twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Pushpa Day 4 Collections: పుష్ప సినిమాకి అసలు టెన్షన్ మొదలైంది.. మన దగ్గరే ఇలా ఉందంటే..

    |

    క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ మొదటి సారి అల్లుఅర్జున్ తో కలిసి పాన్ ఇండియా సినిమాను తెరపైకి తీసుకువచ్చాడు. పుష్ప సినిమా కేవలం తెలుగులోనే కాకుండా హిందీ తమిళ తెలుగు మలయాళ భాషల్లో కూడా భారీగానే విడుదలయ్యింది. అయితే సినిమా ప్రమోషన్స్ అనుకున్నంతగా చేయక పోయినప్పటికీ కూడా సినిమాకు చాలా ఏరియాల్లో ఓపెనింగ్స్ అయితే గట్టిగానే వచ్చాయి. అయితే ఆ కలెక్షన్స్ అన్నీ కూడా ఆదివారం వరకే స్టాండర్డ్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక సోమవారం నుంచి ఈ సినిమాకు అసలు పరీక్ష మొదలవుతుంది అనేది ముందు నుంచి అందరూ అనుకుంటున్నారు. ఇక అనుకున్నట్లు సోమవారం భారీ స్థాయిలో కలెక్షన్స్ తగ్గుతున్నట్లుగా తెలుస్తోంది. నాలుగో రోజు కలెక్షన్ల అంచనా ఎలా ఉన్నాయంటే..

     మరో మెట్టు ఎక్కిన బన్నీ

    మరో మెట్టు ఎక్కిన బన్నీ

    అల్లు అర్జున్ అల..వైకుంఠ పురములో సినిమా తర్వాత అంతకు మించి అనేలా పుష్ప సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ ను క్రియేట్ చేసుకోవాలి అని అనుకున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ కాంబినేషన్ లో మొదటిసారిగా పాన్ ఇండియా సినిమా చేయడానికి అడుగులు వేసిన అల్లు అర్జున్ తన నటనతో అయితే అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. నటన విషయంలో అయితే బన్నీ మరో మెట్టు ఎక్కాడు.

    మూడు రోజుల్లోనే 170 కోట్లకు పైగా..

    మూడు రోజుల్లోనే 170 కోట్లకు పైగా..

    అల్లు అర్జున్ తప్పితే మిగతా విషయాలు ఏవీ కూడా అంతగా ఆకట్టుకోలేదు అని చాలా మంది ప్రేక్షకుల నుంచి విభిన్నమైన టాక్ అయితే వచ్చింది.. అయితే సినిమా కలెక్షన్స్ మొదటి మూడు రోజులు బాగానే ఉన్నప్పటికీ వీకెండ్ అనంతరం ఒక్కసారిగా తగ్గిపోతున్నట్లుగా తెలుస్తోంది.. శుక్రవారం తరువాత శని ఆదివారాలు సెలవు దినం కాబట్టి అనుకున్నట్లుగానే సినిమా భారీ స్థాయిలో వసూళ్లను అందుకుంది. మూడు రోజుల్లోనే 170 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి.

     వచ్చిన షేర్ ఎంతంటే..

    వచ్చిన షేర్ ఎంతంటే..

    ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో 2021లో అత్యధిక వసూళ్లను అందుకున్న సినిమాగా పుష్ప సినిమా నెంబర్ వన్ రికార్డును అయితే తన ఖాతాలో వేసుకుంది. ఇక ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకుంటుందా లేదా అనేది చాలా ఆసక్తిని కలిగిస్తోంది. ఇక మూడు రోజుల్లో సినిమా 80 కోట్లకు పైగా షేర్ కలెక్షన్స్ అందుకున్నట్లు తెలుస్తోంది.

    సోమవారం.. తగ్గిన కలెక్షన్స్..

    సోమవారం.. తగ్గిన కలెక్షన్స్..


    సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అవ్వాలంటే 150 కోట్ల వరకు షేర్ వసూలు అందుకుంటేనే సక్సెస్ అయినట్లు లెక్క. అయితే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకోవాలి అంటే పుష్ప సినిమా మరొక 70 కోట్ల వరకు షేర్ ను సాధించాల్సి ఉంటుంది. మొదటి మూడు రోజుల్లో తప్పితే పుష్ప సినిమా మిగతా రోజుల్లో పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదని తెలుస్తోంది. ముఖ్యంగా ఆంధ్రలో సోమవారం ఉదయం మధ్యాహ్నం షోలతోనే కలెక్షన్స్ భారీగా తగ్గిపోయినట్లు అర్థమవుతుంది.

    Recommended Video

    Pushpa Movie : The Aparichit In Telugu Audience | Allu Arjun
     ఆ ప్రభావం గట్టిగానే పడింది..

    ఆ ప్రభావం గట్టిగానే పడింది..

    మొన్నటివరకు ప్రమోషన్స్ బాగానే చేసిన చిత్ర యూనిట్ మళ్లీ అదే తరహాలో కంటిన్యూ చేయలేకపోయింది. తెలుగు రాష్ట్రాల్లోనే సోమవారం కలెక్షన్స్ తగ్గుతున్నాయి అంటే ఇక మిగతా భాషల్లో కూడా దాదాపు భారీగా తగ్గే అవకాశం ఉన్నట్లు చెప్పవచ్చు.. హిందీలో కూడా సినిమాను విడుదల చేసే ముందు భారీగా ప్రమోషన్ ఉంటే ఓపెనింగ్స్ కూడా మరో లెవెల్ లో ఉండేవి కానీ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ హడావిడి కారణంగా ఈ చిత్రం యూనిట్ సభ్యులు ఆ విషయంపై పెద్దగా ఫోకస్ చేయకపోవడం ప్రభావం చూపింది అనే చెప్పాలి. మరి సోమవారం మొత్తంగా పుష్ప సినిమా ఏ స్థాయిలో వసూళ్లను అందుకుంటుందో తెలియాలంటే మరి కొన్ని గంటలు ఆగాల్సిందే.

    English summary
    Pushpa Day 4 Expected Collections: Allu Arjun Movie Slow Down In Telugu States
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X