Pushpa Hindi collections: బాలీవుడ్ నుంచి షాకింగ్ రిపోర్ట్.. అలా చేసినందుకే దెబ్బ పడింది!

టాలీవుడ్ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమాల్లో ఒకటైన పుష్ప నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలైన విషయం తెలిసిందే. ఆర్య సీరీస్ అనంతరం అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప సినిమాపై కేవలం తెలుగు ఆడియెన్స్ లోనే కాకుండా మిగతా భాషల్లో కూడా కొంత హైప్ క్రియేట్ అయ్యింది. ఇక సినిమాకు సంబంధించిన కలెక్షన్స్ పై ప్రస్తుతం అనేక రకాల ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి తెలుగులో అయితే మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. ఇక హిందీ నుంచి ఎవరు ఊహించని విధంగా ఓపెనింగ్స్ దక్కినట్లు తెలుస్తోంది.

స్క్రీన్ ప్లే తోనే..

స్క్రీన్ ప్లే తోనే..

దర్శకుడు సుకుమార్ ఎలాంటి సినిమా చేసినా కూడా కమర్షియల్ అంశాలకు భిన్నంగా ఉండేలా స్క్రీన్ ప్లే తోనే చాలా మ్యాజిక్ క్రియేట్ చేస్తుంటాడు. ఇక పుష్పతో మొదటిసారి పాన్ ఇండియా మార్కెట్ ను టచ్ చేసిన సుక్కు అల్లు అర్జున్ తో మాస్ వండర్ క్రియేట్ చేయాలని అనుకున్నాడు. కానీ సినిమాకు ప్రస్తుతం కాస్త విభిన్నంగా టాక్ వస్తోంది. ప్రేక్షకుల నుంచి భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి.

థియేటర్స్ హౌస్ ఫుల్

థియేటర్స్ హౌస్ ఫుల్

మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన పుష్ప సినిమా తెలుగులోనే కాకుండా ఒకేసారి కన్నడ తమిళ్ మలయాళం హిందీలో కూడా విడుదల అయ్యింది. అయితే సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఓపెనింగ్స్ వస్తాయని చెప్పవచ్చు. తెలంగాణలో అయితే వారం ముందే బుకింగ్స్ ఓపెన్ అవ్వడంతో నిమిషాల్లోనే సగానికి పైగా థియేటర్స్ హౌస్ ఫుల్ అయ్యాయి. అలాగే మరికొన్ని రెండు రోజుల్లో ఫుల్ అయ్యాయి.

మొదటి రోజు కలెక్షన్స్ ఎంత?

మొదటి రోజు కలెక్షన్స్ ఎంత?

ఇక మొదటిరోజు అడ్వాన్స్ బూకింగ్స్ తోనే తెలంగాణలో దాదాపు అన్ని ఏరియాలు హౌస్ ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఇక ఆ లెక్కన చూసుకుంటే సినిమా మొదటిరోజు 30కోట్ల వరకు వసూళ్లను అందుకునే అవకాశం ఉంటుంది. ఇక మరికొన్ని చోట్ల ప్రింట్స్ ఆలస్యంగా వెళ్లాయి. ఇక అన్ని చోట్లా అనుకున్నట్లు సినిమా విడుదలైతే 40కోట్ల వరకు రాబట్టే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

 కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్

కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్

ఒక విధంగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లోనే పుష్ప సినిమా అత్యధిక ఓపెనింగ్స్ అందించిన సినిమాగా నిలవనున్నట్లు తెలుస్తోంది. 30కోట్ల నుంచి 35కోట్ల వరకు రావడంలో ఎలాంటి సందేహం లేదని కూడా అనిపిస్తోంది. ఇక ఓవర్సీస్ లో కూడా సినిమాకి ప్రీమియర్ ద్వారా మంచి ఓపెనింగ్స్ దక్కినట్లు అనిపిస్తోంది.

హిందీలో ఎలా ఉందంటే?

హిందీలో ఎలా ఉందంటే?

ఇక అసలైన హిందీ ఏరియాలో పరిస్థితి ఎలా ఉంది అని విషయంలో అనేక రకాల కామెంట్స్ వెలువడుతున్నాయి. ఇక దాదాపు సైరా సినిమా తరహాలోనే పుష్ప సినిమాకు కూడా నిరాశపరిచేలా ఓపెనింగ్స్ అందుకున్నట్లు తెలుస్తోంది. 5% ఆక్యుపెన్స్ లో కూడా హీంది థియేటర్స్ కనిపించడం లేదట.

ఆ క్రేజ్ హెల్ప్ అవ్వలేదు

ఆ క్రేజ్ హెల్ప్ అవ్వలేదు

ఒక విధంగా హిందీలో అల్లు అర్జున్ కి డబ్బింగ్ సినిమాల ద్వారా వచ్చిన క్రేజ్ కూడా పెద్దగా కలిసొచ్చే అవకాశం లేదని అనిపిస్తోంది. బన్నీ చాలా సినిమాలు హిందీలో డబ్ చేయగా యూ ట్యూబ్ లో వందల మిలియన్స్ వ్యూవ్స్ వస్తుంటాయి. అయితే బాక్సాఫీస్ వద్ద మాత్రం పుష్ప సినిమాకు అది కలిసొచ్చే అవకాశం లేదని అర్ధమవుతోంది. ఇక శని ఆదివారాల్లో హిందీలో ఏదైనా మ్యాజిక్ క్రియేట్ అవుతుందో లేదో చూడాలి.

అలా చేయాల్సింది...

అలా చేయాల్సింది...

పుష్ప సినిమాకు హిందీలో మొదట మంచి బజ్ తరువాత ఆ తరువాత ప్రమోషన్ తో అయితే చిత్ర యూనిట్ కొనసాగలేదు. సినిమా హిందీ ప్రమోషన్ పై పెద్దగా ఫోకస్ చేయలేదు. హిందీలో కూడా రెగ్యులర్ ప్రమోషన్స్ చేయాల్సింది. అలాగే ట్రైలర్ కూడా ఆలస్యంగా విడుదల చేశారు. ఇక సాంగ్స్ పెద్దగా అక్కడి వారిని అయితే ఆకట్టుకోలేదు. సినిమాను ముందుగానే ప్రమోట్ చేసి ఉంటే బాగుండేది.. అని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X