2021లో నెంబర్ వన్ రికార్డును బ్రేక్ చేసిన పుష్ప.. వకీల్ సాబ్ కంటే ఎక్కువగా టాప్ 5లో..
అల్లు అర్జున్ మొదటి సారి నటించిన పాన్ ఇండియా మూవీ పుష్ప గత శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే. సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించింది. ఈ సినిమా ప్రతి రోజు కలెక్షన్స్ సంఖ్యను అంతకంతకూ పెంచుకుంటూనే ఉంది. ఇక ఫస్ట్ వీక్ లోనే సినిమా మరొక బిగ్గెస్ట్ రికార్డు అందుకని 2021 లో అత్యధిక వసూళ్లు అందుకున్న సినిమాగా గుర్తింపు పొందింది.
Recommended Video

భారీ బడ్జెట్ తో..
సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన ఈ మూడవ సినిమాపై మొదటి నుంచి కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి ఇక మొదట ఈ సినిమాను దర్శకుడు సుకుమార్ వెబ్ సిరీస్ గా పైకి తీసుకురావాలని అనుకున్నారు. కానీ ఆ తర్వాత అల్లు అర్జున్ ప్రాజెక్టులోకి రావడంతో ఒక్కసారిగా ప్లాన్స్ అన్నీ మారిపోయాయి. ఇక మైత్రి మూవీ మేకర్స్ కూడా భారీ స్థాయిలో బడ్జెట్ పెట్టడానికి సిద్ధమైంది. రెండు భాగాలకు కలిపి రెండు వందల యాభై కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం.

రెండు రోజుల్లోనే సెంచరీ
పుష్ప సినిమా బాక్సాఫీస్ వద్ద రోజుకో రికార్డును అందుకుంటోంది. మొదటి రోజు ప్రీమియర్స్ తో కలుపుకొని ప్రపంచవ్యాప్తంగా బన్నీ కెరీర్ లోనే అత్యదిక గ్రాస్ కలెక్షన్స్ అందుకున్న పుష్ప సినిమా ఆ తరువాత రెండవరోజు అంతకంటే ఎక్కువ కలెక్షన్స్ అందుకుంది. రెండు రోజుల్లోనే 100కోట్ల వసూళ్లతో అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.

మూడు రోజుల్లో 173కోట్లు
ఇక వరల్డ్ వైడ్ గా పుష్ప బాక్సాఫీస్ వద్ద 173కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకున్నట్లు చిత్ర యూనిట్ సభ్యులు కూడా క్లారిటీ ఇచ్చారు. అఫీషియల్ గా పోస్టర్లు కూడా విడుదల చేసి సినిమాకు మరింత బజ్ క్రియేట్ చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమా థియేటర్స్ నెంబర్స్ ను పెంచే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి 2021లో అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా పుష్ప రికార్డును క్రియేట్ చేసింది.

2021 నెంబర్ రికార్డ్
ఇప్పటికే వకీల్ సాబ్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ. 137. 65 కోట్లు అందుకుని 2021లో అత్యధిక వసూళ్లు సాధించిన టాలీవుడ్ చిత్రంగా నిలిచింది. ఇక ఆ రికార్డును పుష్ప సినిమా మూడు రోజుల్లోనే బ్రేక్ చేసింది. అయితే పుష్ప ఐదు భాషల్లో కలుపుకొని ఈ స్థాయిలో వసూళ్లను అందుకుంది. వకీల్ సాబ్ కేవలం తెలుగులోనే రిలీజ్ అయిన విషయం తెలిసిందే.

ఆ తరువాత స్థానంలో బాలయ్య
ఈ ఏడాది అత్యదిక వసూళ్లను అందుకున్న సినిమాగా పుష్ప నెంబర్ వన్ స్థానంలో నిలువగా వకీల్ సాబ్ రెండవ స్థానంలో నిలిచింది. ఇక మూడవ స్థానంలో అఖండ సినిమా 115కోట్ల కలెక్షన్స్ తో కొనసాగుతోంది. ఇక ఆ తరువాత 90కోట్లతో ఉప్పెన సినిమా నాలుగవ స్థానంలో ఉండగా 5వ స్థానంలో క్రాక్ సినిమా 67కోట్లతో 5వ స్థానంలో ఉంది.

సోమవారం అసలు పరీక్ష..
ఏదేమైనా కూడా ఇప్పటివరకు పుష్ప సినిమాకు వచ్చింది డివైడ్ టాక్ తోనే భారీగా వసూళ్లను అందుకోవడం విశేషం. ఇక సినిమాకు సోమవారం నుంచి అసలు పరీక్ష మొదలు కానుంది. ఇప్పటివరకు వచ్చిన కలెక్షన్స్ చూస్తే సోమవారం కూడా మంచి వసూళ్లు దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి పుష్ప రాజ్ ఏ స్థాయిలో రికార్డులను బ్రేక్ చేస్తాడో చూడాలి.


Click it and Unblock the Notifications











