Pushpa closing collections ప్రపంచవ్యాప్తంగా అల్లు అర్జున్ స్వైర విహారం.. ఎన్ని కోట్లు కొల్లగొట్టిందంటే?

టాలీవుడ్ కాకుండా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్‌కే జోష్ పెంచిన పుష్ప చిత్రం వసూళ్ల ప్రవాహం ఆగిపోయినట్టే కనిపిస్తున్నది. 22 రోజులపాటు ఏకధాటిగా ఎదురులేకుండా అన్ని ప్రతికూలతలను ఎదురించిన పుష్ప చిత్రం సరికొత్త రికార్డులను 2021లో తిరగరాసింది. తొలిసారి హిందీలోకి ప్రవేశించిన అల్లు అర్జున్ ఉత్తరాదిలో తన స్టామినా ఏంటో ఈ చిత్రం ద్వారా చూపించాడు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఫిజి లాంటి దేశాల్లో వసూళ్ల రికార్డులకు బాటలు తెరిచాడు. పుష్ప చిత్రం గత మూడు వారాల్లో ఎంత వసూలు చేసిందంటే..

వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్

వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్

సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప చిత్రం విడుదలకు ముందు భారీగానే బిజినెస్ చేసింది. ఏపీ, తెలంగాణలో 102 కోట్ల రూపాయల మేరకు, కర్ణాటకలో 9 కోట్లు, తమిళనాడులో 6 కోట్లు, కేరళలో 4 కోట్లు, హిందీలో 10 కోట్లు, మిగితా రాష్ట్రాల్లో 1.15 కోట్లు, ఓవర్సీస్‌లో 13 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. దాంతో ఈ చిత్రం ఓవరాల్‌గా 144.90 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ నమోదు చేసింది.

22 రోజుల్లో కలెక్షన్లు

22 రోజుల్లో కలెక్షన్లు

గత మూడు వారాల్లో (22 రోజుల్లో) పుష్ప చిత్రం తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లను సాధించింది. నైజాంలో 37.25 కోట్లు, సీడెడ్‌లో 14.92 కోట్లు, ఉత్తరాంధ్రలో 8 కోట్లు, తూర్పు గోదావరి జిల్లాలో 4.85 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో 3.95 కోట్లు, గుంటూరులో 5.05 కోట్లు, కృష్ణా జిల్లాలో 4.20 కోట్లు, నెల్లూరులో 3.10 కోట్లు రాబట్టింది. దాంతో ఈ చిత్రం 85 కోట్ల మేర నికర వసూళ్లను, 132.5 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

కర్ణాటక, కేరళ.. ఇతర రాష్ట్రాల్లో

కర్ణాటక, కేరళ.. ఇతర రాష్ట్రాల్లో

తెలుగేతర రాష్ట్రా వసూళ్ల వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలో 11.35 కోట్లు, తమిళనాడులో 10.55 కోట్లు, కేరళలో 5.35 కోట్లు, హిందీలో రూ.35 కోట్లకుపైగా, మిగితా రాష్ట్రాల్లో 2.25 కోట్లు వసూలు చేసింది. అల్లు అర్జున్ తొలిసారి ఇండియావైడ్ మార్కెట్‌ను విస్తరించాడని ఈ చిత్రం నిరూపించింది.

హిందీ వెర్షన్ కలెక్షన్లు ఎంతంటే..

హిందీ వెర్షన్ కలెక్షన్లు ఎంతంటే..

పుష్ప హిందీ వెర్షన్‌కు మంచి ప్రేక్షకదారణ లభిస్తున్నది. తొలి వారంలో 26.89 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఈ చిత్రం రెండోవారంలో కూడా నిలకడగా వసూళ్లను సాధించింది. ఇక రెండోవారంలో 20.20 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఇక మూడో వారంలో కూడా మెరుగైన కలెక్షన్లను రిజిస్టర్ చేసింది. మూడో వారంలో 25.40 కోట్ల రాబట్టడం గమనార్హం. ఇక 22 రోజు కూడా ఈ చిత్రం 2 కోట్ల మేర వసూళ్లను వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 74.5 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసినట్టు ట్రేడ్ వర్గాల సమాచారం.

అమెరికా, ఆస్ట్రేలియాలో

అమెరికా, ఆస్ట్రేలియాలో

ఇక ఓవర్సీస్‌లో కూడా అల్జు అర్జున్ హంగామా కనిపించింది. అమెరికాలో ఈ చిత్రం సుమారు 2 మిలియన్ అమెరికన్ డాలర్ల గ్రాస్‌ను నమోదు చేసింది. దాంతో సుమారుగా ఈ చిత్రం 8 కోట్ల మేర నికర వసూళ్లను రాబట్టిందని చెప్పుకోవచ్చు. ఆస్ట్రేలియాలో మొదటి వారం 410,617 ఆస్ట్రేలియన్ డాలర్లు, రెండో వారం 49,914, మూడో వారం 71,809 వసూలు చేసింది. దీంతో 532,340 ఆస్ట్రేలియన్ డాలర్లకుపైగా వసూలు చేసింది. అంటే భారతీయ కరెన్సీలో ఈ చిత్రం 3 కోట్ల రూపాయలను మేర కొల్లగొట్టింది.

న్యూజిలాండ్, ఫిజి, ఇతర దేశాల్లో

న్యూజిలాండ్, ఫిజి, ఇతర దేశాల్లో

న్యూజిలాండ్‌లో తొలివారంలో 33,596 న్యూజిలాండ్ డాలర్స్, రెండోవారం 1,201 డాలర్ల వసూళ్లతో రెండువారాల్లో 34,797 డాలర్లు, అంటే భారతీయ కరెన్సీలో 17.54 లక్షలు వసూలు చేసింది. ఇక ఫిజి దేశంలో తొలివారంలో 2,572 ఫిజి డాలర్లను, రెండో వారంలో 6,311 డాలర్లు, మూడో వారంలో 10,552 డాలర్లు వసూళ్లతో ఈ చిత్రం 19,435 డాలర్లు, అంటే భారతీయ కరెన్సీలో 6.81 లక్షలు వసూలు చేసింది. అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఫిజితోపాటు మిగితా దేశాల్లో మొత్తంగా పుష్ప చిత్రం సుమారుగా 15 కోట్లు వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

Recommended Video

Pushpa Collections : AP Govt Decision Effects Pushpa
పుష్ప ఓవరాల్ లాభం ఎంతంటే..

పుష్ప ఓవరాల్ లాభం ఎంతంటే..

పుష్ప చిత్రం 146 కోట్ల బ్రేక్ ఈవెన్‌తో బాక్సాఫీస్ పరుగు ప్రారంభించింది. ప్రస్తుతం వరల్డ్ వైడ్‌గా పుష్ప చిత్రం 165 కోట్ల షేర్, 320 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసినట్టు సమాచారం. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సుమారు 20 కోట్ల లాభంతో సరిపెట్టుకొనే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X