twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పుష్ప బిజినెస్ హవా మొదలైంది.. తమిళంలో డీసెంట్ డీల్.. కేరళలో హై డిమాండ్

    |

    అల్లు అర్జున్ అల వైకుంఠ పురములో ఈ సినిమాతో బాక్సాఫీసు వద్ద భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. మొదటిసారి రెండు వందల కోట్ల బిజినెస్ మార్కును చేరుకోవడంతో అల్లు అర్జున్ కు ఎంతో సంతోషంగా ఉన్నాడు. అయితే తదుపరి సినిమా కూడా అంతకు మించి అనేలా ఉండాలి అని పుష్ప సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే బన్నీకి కేరళలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. హిందీ డబ్బింగ్ సినిమాలకి అయితే భారీ స్థాయిలో వ్యూవ్స్ సైతం వస్తున్నాయి. ఇక తమిళ ఇండస్ట్రీలో కూడా మెల్లగా అల్లు అర్జున్ కు క్రేజ్ ఏర్పడుతోంది. ఇక సినిమా బిజినెస్ కు క్రేజ్ ఎంతవరకు ఉపయోగపడింది అనే వివరాల్లోకి వెళితే..

    Recommended Video

    Pushpa లో Samantha ఐటెం సాంగ్.. కండిషన్స్ అప్లై..! || Filmibeat Telugu
     మూడవసారి పాన్ ఇండియా ప్రాజెక్ట్ తో

    మూడవసారి పాన్ ఇండియా ప్రాజెక్ట్ తో

    అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో ఇదివరకే రెండు సినిమాలు వచ్చాయి. మొదటి సినిమా ఆర్య బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో విజయాన్ని అందుకుంది. ఇక ఆ తర్వాత వచ్చిన ఆర్య 2 సినిమా మాత్రం డిజాస్టర్ అయిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం పుష్ప సినిమా పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రూపొందుతోంది. తప్పకుండా సినిమా ఒక సెన్సేషనల్ విజయాన్ని అందుకుంటుంది అని చిత్ర యూనిట్ నమ్మకంతో ఉంది. అయితే డానికి తగ్గట్టుగా మార్కెట్ క్రియేట్ అవుతుందా లేదా అనేది ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

    హిందీలో కూడా

    హిందీలో కూడా

    అల్లు అర్జున్ క్రేజ్ గురించి దాదాపు అన్ని అన్ని భాషల్లోని ప్రేక్షకులకు తెలిసిందే. మంచి స్పీడ్ డాన్సర్ అని కూడా చాలామంది అగ్రహీరోలు ఇదివరకే పాజిటివ్ గా కామెంట్ చేశారు. ఇక పుష్ప సినిమాను కూడా అన్ని భాషల్లో భారీ స్థాయిలో విడుదల చేయాలని అనుకుంటున్నారు. హిందీ లో రిలీజ్ చేయడం కాస్త అనుమానంగానే ఉంది అనే కామెంట్స్ అయితే వినిపించాయి. కానీ చిత్ర యూనిట్ ఇటీవల చర్చలు జరిపి ఆ విషయంలో కూడా ఒక క్లారిటీ అయితే ఇచ్చేసింది. హిందీలో కూడా భారీగా విడుదల చేయబోతున్నారని తెలుస్తోంది.

    కేరళలో హై డిమాండ్

    కేరళలో హై డిమాండ్

    ఇక తెలుగు కన్నడలో అయితే ఎప్పటిలానే అల్లు అర్జున్ మార్కెట్ కు తగ్గట్టుగా బ్భారీగా ఫ్రీ రిలీజ్ బిజినెస్ తో సినిమా విడుదల అవుతుందని చెప్పవచ్చు. ఇక మలయాళం ఇండస్ట్రీలో అయితే బన్నీ కి ప్రత్యేకమైన మార్కెట్ ఉంది. అక్కడ మల్లు స్టార్ అనే క్రేజ్ కూడా ఉందని అందరికీ తెలిసిందే. ఇక పుష్ప సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ కూడా మలయాళంలో హైలెట్ అవుతోంది. ఇక కేరళలో 200+ స్క్రీన్ లలో సినిమాను విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే 40+ స్క్రీన్స్ లలో ఫ్యాన్స్ టికెట్స్ భారీగా అమ్ముడైనట్లు సమాచారం.

    తమిళంలో లైకా.. డీల్ క్లోజ్

    తమిళంలో లైకా.. డీల్ క్లోజ్

    ఇక తమిళంలో పుష్ప సినిమా రిలీజ్ హక్కులను లైకా ప్రొడక్షన్ హౌస్ దక్కించుకుంది. దాదాపు 5కోట్ల నుంచి 7కోట్ల మధ్యలో సినిమా హక్కులు అమ్ముడైనట్లు సమాచారం. మరి సినిమా ఆ భాషలో ఏ స్థాయిలో సక్సెస్ అవుతుందో చూడాలి. పుష్ప పార్ట్ 1 ను వరల్డ్ వైడ్ గా డిసెంబర్ 17న విడుదల చేయబోతున్నారు. ఇక రెండవ పార్ట్ ను వచ్చే ఏడాది సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే అవకాశం ఉంది.

    English summary
    Pushpa movie high demand in kerala and tamil theatrical bussiness deal,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X