పుష్ప పార్ట్ 2 రావడానికి అసలు కారణం ఇదే.. రెమ్యూనరేషన్ డోస్ పెంచిన అల్లు అర్జున్, సుకుమార్

పాన్ ఇండియా సినిమాలకు మార్కెట్ అనేది ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటుంది. బాహుబలి తరువాత సినిమా ప్రపంచంలో చాలా మార్పులు వచ్చాయి. హీరోల రేంజ్ ను బట్టి కాకుండా సినిమాలో అసలు కంటెంట్ ఏముందనే ఆలోచనతో జనాలు థియేటర్ వరకు వస్తున్నారు. ఇక అల్లు అర్జున్ పుష్ప కంటెంట్ పై కూడా చిత్ర యూనిట్ ఎంతో నమ్మకంతో ఉంది. ఇక సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయడానికి సిద్ధం కావడంతో అనేక రకాల రూమర్స్ వైరల్ అవుతున్నాయి.

టీజర్ తోనే క్లారిటీ ఇచ్చేశాడు

టీజర్ తోనే క్లారిటీ ఇచ్చేశాడు

అల్లు అర్జున్ తో ఆర్య, ఆర్య 2 లాంటి విభిన్నమైన ప్రేమ కథలను తెరకెక్కించిన దర్శకుడు సుకుమార్ ఒకసారి హిట్టు కొట్టి మరొకసారి డిజాస్టర్ ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఇక గత సినిమాలతో సంబంధం లేకుండా సుకుమార్ ఈసారి పుష్ప అనే డిఫరెంట్ యాక్షన్ కథతో రాబోతున్నట్లు టీజర్ తోనే క్లారిటీ ఇచ్చేశాడు.

అందువల్లే రెండు భాగాలుగా

అందువల్లే రెండు భాగాలుగా

సుకుమార్ ఎలాంటి సినినా చేసినా కూడా రాజమౌకి తరహాలోనే ఆలస్యం చేస్తుంటాడు అని అందరికి తెలిసిందే. రెండున్నర గంటల సినిమాను దాదాపు 4గంటల నిడివితో తీస్తుంటారని ఇండస్ట్రీలో ఒక టాక్ అయితే ఉంది. ఇక పుష్ప విషయంలో కూడా అలానే అవుతుండడంతో ఏకంగా రెండు భాగాలుగా రాబోతోంది అంటూ షాక్ ఇచ్చారు.

అనుకున్న బడ్జెట్ లోనే షూటింగ్

అనుకున్న బడ్జెట్ లోనే షూటింగ్

నిజానికి మొదట పుష్ప కథను ఒకటే పార్ట్ లో పూర్తి చేయాలని అనుకున్నారు. ఇక నిడివి ఎక్కువవుతున్నప్పటికి కంటెంట్ మాత్రం సాలీడ్ గానే వుందట. ఏ సీన్ కూడా కట్ చేయడానికీ వీలుపడటం లేదు. దీంతో దర్శక నిర్మాతలు దాదాపు అనుకున్న బడ్జెట్ లోనే షూటింగ్ ను పుర్తి చేసేందుకు ప్లాన్ సెట్ చేసినట్లు సమాచారం. ఎక్కువ స్థాయులో భారం పడకుండా పుష్ప 2కు అడిషనల్ గా కొంత గ్లామర్ డోస్ పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Recommended Video

Allu Arjun Family Time, Pushpa రెండు భాగాలు It's Official అంటున్న నిర్మాత || Filmibeat Telugu
రెమ్యునరేషన్ డోస్ పెరిగింది

రెమ్యునరేషన్ డోస్ పెరిగింది

అయితే ఈ క్రమంలో రెమ్యునరేషన్ డోస్ పెరిగే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అల్లు అర్జున్ కు మరో 10కోట్లు అదనంగా ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇక డైరెక్టర్ సుకుమార్ కు కూడా 5కోట్లు బోనస్ గా రానున్నట్లు టాక్ వస్తోంది. ఇక ఫస్ట్ పార్ట్ ఆల్ మోస్ట్ రెడీ అయ్యింది. కరోనా హడావుడి తగ్గిన అనంతరం పుష్ప 1 సినిమాను ఈ ఏడాది చివరలోనే విడుదల చేయవచ్చని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X