twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Pushpa 11 days collections: KGF రికార్డుకు చేరువలో పుష్ప.. బాలీవుడ్ బాక్సాఫీస్ షేక్

    |

    టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ప్రభాస్ తర్వాత అసలైన పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అల్లు అర్జున్ తన సత్తా చాటుకున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమాపై మొదటి నుంచి కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే ఉన్నాయి. ఇక మొత్తానికి బాక్సాఫీస్ వద్ద ఓపెనింగ్స్ అయితే గట్టిగానే ఉన్నాయి. త్వరలోనే నార్త్ ఇండస్ట్రీలో కూడా ఈ సినిమా కేజీఎఫ్ రికార్డును బద్దలు కొట్టడానికి సిద్ధంగా ఉంది. ఇక సినిమా 11 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఏ స్థాయిలో బాక్సాఫీస్ కలెక్షన్స్ అందుకుందో చూద్దాం..

    Recommended Video

    Pushpa Collections : AP Govt Decision Effects Pushpa
    ఇంకా ఎక్కువ స్థాయిలో..

    ఇంకా ఎక్కువ స్థాయిలో..

    బాహుబలి సినిమాలతో పాన్ ఇండియా మార్కెట్ స్థాయిని అమాంతంగా పెంచేసింది రెబల్ స్టార్ ప్రభాస్ ఆ తర్వాత సాహో సినిమాతో కూడా అదే స్థాయిలో క్రేజ్ అందుకున్నాడు. ఇక ఆ తర్వాత అల్లు అర్జున్ ఆ స్థాయిలో కాకపోయినా దాదాపు పాన్ ఇండియా మార్కెట్ ను అందుకున్నాడు అనే చెప్పాలి. సినిమాకు ఇంకాస్త ప్రమోషన్స్ గట్టిగా చేసి ఉంటే ఇంకా ఎక్కువ స్థాయిలో కలెక్షన్స్ వచ్చి ఉండేవి అని అర్థమవుతోంది.

    వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్..

    వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్..

    అల్లు అర్జున్ లోకల్ గానే కాకుండా నాన్ లోకల్ లో ఏరియాల్లో కూడా మంచి మార్కెట్ ఉన్న విషయం తెలిసిందే. ఒకసారి ప్రీ రిలీజ్ బిజినెస్ లిస్టులోకి వెళితే.. ఏపీ తెలంగాణలో కలిపి రూ. 101.85 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన పుష్ప కర్నాటకలో రూ. 9 కోట్లు అలాగే తమిళనాడులో రూ. 6 కోట్లు, కేరళలో రూ. 4 కోట్ల టార్గెట్ తో విసుదలైంది. ఇక హిందీలో రూ. 10 కోట్ల బిజినెస్ చేసింది. ఇక రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లో కలిపి రూ. 14.15 కోట్ల ధర పలికింది. ప్రపంచ వ్యాప్తంగా అయితే రూ. 144.90 కోట్లు బిజినెస్ చేసింది. అంటే సినిమా 150కోట్లు షేర్ అందుకుంటేనే హిట్టయినట్లు లెక్క.

    11వ రోజ ఏపీ, తెలంగాణ కలెక్షన్స్

    11వ రోజ ఏపీ, తెలంగాణ కలెక్షన్స్

    తెలుగు రాష్ట్రాల్లో పరవాలేదు అనే విధంగా 11వ రోజు కలెక్షన్స్ వచ్చాయి. ఏరియాల వారిగా వచ్చిన షేర్ ఈ విధంగా ఉంది. నైజాంలో రూ. 54లక్షలు, సీడెడ్‌లో రూ. 16 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 9 లక్షలు, ఈస్ట్‌లో రూ. 6 లక్షలు, వెస్ట్‌లో రూ. 5 లక్షలు, గుంటూరులో రూ. 6 లక్షలు, కృష్ణాలో రూ. 5 లక్షలు, నెల్లూరులో రూ. 4 లక్షలతో.. 11వ రోజు రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 1.05 కోట్లు షేర్, రూ. 1.75 కోట్లు గ్రాస్ వచ్చింది.

    11 రోజుల్లో వచ్చిన కలెక్షన్స్

    11 రోజుల్లో వచ్చిన కలెక్షన్స్

    తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా 11 రోజుల్లో వచ్చిన షేర్ ఈ విధంగా ఉంది. నైజాంలో రూ. 37 85 కోట్లు, సీడెడ్‌లో రూ. 13.12 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 7.20 కోట్లు, ఈస్ట్‌లో రూ. 4.40 కోట్లు, వెస్ట్‌లో రూ. 3.63 కోట్లు, గుంటూరులో రూ. 4.66 కోట్లు, కృష్ణాలో రూ. 3.82 కోట్లు, నెల్లూరులో రూ. 2.83 కోట్లతో.. ఏపీ తెలంగాణ లో మొత్తంగా రూ. 77.51 కోట్లు షేర్, రూ. 120.08 కోట్లు గ్రాస్ వచ్చింది.

    ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్స్..

    ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్స్..

    11 రోజుల్లో వరల్డ్ వైడ్ గా వచ్చిన కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి. రెండు రాష్ట్రాల్లో 'పుష్ప'కు రూ. 77.51 కోట్లు షేర్ వచ్చింది. కర్నాటకలో రూ. 10.15 కోట్లు, తమిళనాడులో రూ. 8.35కోట్లు, కేరళలో రూ. 4.60 కోట్లు, హిందీలో రూ. 19.40 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.13 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 11.90 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా 11 రోజుల్లోనే రూ. 134.59 కోట్లు షేర్‌తో పాటు రూ. 236 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది.

    KGF రికార్డుకు చేరువలో పుష్ప..

    KGF రికార్డుకు చేరువలో పుష్ప..

    ఇక పుష్ప సినిమా నార్త్ లో KGF చాప్టర్ 1 రికార్డును బ్రేక్ చేయడానికి చేరువలో ఉంది. సెకండ్ వీకెండ్ లోనే స్ట్రాంగ్ గా ఉన్న పుష్ప వసూళ్లు ఇప్పటివరకు 37.20కోట్ల వసూళ్లను సాదించింది. ఆదివారం రోజు 4.20కోట్లు రాబట్టిన ఈ సినిమా మిగతా రోజుల్లో కూడా హిందీలో మరీంత వసూళ్లను అందుకునే ఛాన్స్ ఉంటుంది. కేజీఎఫ్ చాప్ట‌ర్-1 హిందీ వెర్ష‌న్ రూ.44 కోట్ల గ్రాస్ క‌లెక్ట్ చేసింది. ఇక పుష్ప ఏకంగా 50కోట్లను ఈజీగా టచ్ చేస్తుందని తెలుస్తోంది. మరి ఆ రికార్డు ఎన్ని రోజుల్లో బ్రేక్ అవుతుందో చూడాలి.

    బ్రేక్ ఈవెన్ కావాలి అంటే..

    బ్రేక్ ఈవెన్ కావాలి అంటే..

    వరల్డ్ వైడ్ గా రూ. 144.90 కోట్లు బిజినెస్ చేసిన పుష్ప పెట్టిన పెట్టుబడికి కనీసం సినిమా 150కోట్లు షేర్ అందుకుంటేనే హిట్టయినట్లు లెక్క. కనీసం బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే సినిమా మరో 11.41 కోట్ల వరకు షేర్ రాబట్టాల్సి ఉంది. మరి సినిమా రెండవ వారంలో పూర్తయ్యే లోపు ఆ టార్గెట్ ను అందుకుంటుందో లేదో చూడాలి.

    English summary
    Pushpa movie worldwide total 11 days collections..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X