Pushpa 14 days collections: KGF రికార్డ్ బ్రేక్ చేసిన బన్నీ.. టాప్ 5లో చోటు.. ఇంకా ఒక్క సిక్స్ పడితే..
అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన మొట్టమొదటి సినిమా 2 వారాల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే ఇక మూడో వారంలో కి అడుగు పెట్టబోతున్న సినిమా చాలా క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కోబోతున్న అర్థమవుతోంది ఇప్పటివరకు వచ్చిన లెక్క ల తో సినిమా రంగస్థలం ఎదుర్కోలేదు కానీ ప్రాఫిట్స్ జనం లోకి రావాలి అంటే మరొక రోజులు బాక్సాఫీస్ వద్ద సిక్స్ పడాల్సిందే. ఇక 14 రోజుల్లో వచ్చిన కలెక్షన్స్ లెక్కలు ఈ విధంగా ఉన్నాయి..

పుష్ప ప్రీ రిలీజ్ బిజినెస్..
అల్లు అర్జున్ పుష్ప ప్రీ రిలీజ్ బిజినెస్ లిస్టులోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కలిపి రూ. 101.85 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేయగా.. కర్నాటకలో రూ. 9 కోట్లు, తమిళనాడులో రూ. 6 కోట్లు, కేరళలో రూ. 4 కోట్ల టార్గెట్ తో మార్కెట్ లోకి విడుదలైంది. ఇక హిందీలో రూ. 10 కోట్ల బిజినెస్ చేసింది. రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లో కలిపి రూ. 14.15 కోట్ల ధర పలికింది. ప్రపంచ వ్యాప్తంగా అయితే రూ. 144.90 కోట్లు బిజినెస్ చేసింది.

14వ రోజ తెలుగు గడ్డపై వచ్చిన కలెక్షన్స్
ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఇన్ని రోజులు పరవాలేదు అనే విధంగా కలెక్షన్స్ వచ్చాయి. ఇక 14వ రోజు ఒక్కసారిగా తగ్గిపోయాయి. ఏరియాల వారిగా వచ్చిన షేర్ ఈ విధంగా ఉంది. నైజాంలో రూ. 11 లక్షలు, సీడెడ్‌లో రూ. 6 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 3 లక్షలు, ఈస్ట్‌లో రూ. 2 లక్షలు, వెస్ట్‌లో రూ. 1 లక్షలు, గుంటూరులో రూ. 2 లక్షలు, కృష్ణాలో రూ. 2 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో.. 14 వ రోజు రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 28లక్షల షేర్, రూ. 0.50 కోట్లు గ్రాస్ వచ్చింది.

14 రోజుల్లో వచ్చిన కలెక్షన్స్
తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా 14 రోజుల్లో వచ్చిన షేర్ ఈ విధంగా ఉంది. నైజాంలో రూ. 38.45 కోట్లు, సీడెడ్‌లో రూ. 13.37 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 7.34 కోట్లు, ఈస్ట్‌లో రూ. 4.50 కోట్లు, వెస్ట్‌లో రూ. 3.90 కోట్లు, గుంటూరులో రూ. 4.75 కోట్లు, కృష్ణాలో రూ. 3.90 కోట్లు, నెల్లూరులో రూ. 2.89 కోట్లతో.. ఏపీ తెలంగాణ లో మొత్తంగా రూ. 78.90 కోట్లు షేర్, రూ. 122.18 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్స్..
14 రోజుల్లో వరల్డ్ వైడ్ గా వచ్చిన కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి. రెండు రాష్ట్రాల్లో 'పుష్ప'కు రూ. 78.90 కోట్లు షేర్ వచ్చింది. కర్నాటకలో రూ. 10.35 కోట్లు, తమిళనాడులో రూ. 8.51కోట్లు, కేరళలో రూ. 4.67 కోట్లు, హిందీలో రూ. 22.40 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.15 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 12.72 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా 11 రోజుల్లోనే రూ. 139.70 కోట్లు షేర్‌తో పాటు రూ. 238 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది.

KGF రికార్డ్ బ్రేక్ చేసిన బన్నీ..
ఇక పుష్ప సినిమా ఫైనల్ గా నార్త్ లో KGF చాప్టర్ 1 రికార్డును బ్రేక్ చేసింది. కేజీఎఫ్ చాప్టర్-1 హిందీ వెర్షన్ రూ.44 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక పుష్ప ఏకంగా 45కోట్లను ఈజీగా టచ్ చేసింది. చూస్తుంటే నార్త్ లో హాఫ్ సెంచరీ కొట్టేయడం కాయంగా కనిపిస్తుంది. ఇక రెండు వారాల్లో హిందీలో అత్యధిక వసూళ్లను అందుకున్న సౌత్ సినిమాల్లో కూడా నెంబర్ 5లో పుష్ప నిలిచింది. ఆ రూట్లో బాహుబలి 2, 2 పాయింట్ ఓ, బాహుబలి 1, సాహో అనంతరం పుష్ప 5వ స్థానం దక్కించుకుంది.
Recommended Video

బ్రేక్ ఈవెన్.. ఒక్క సిక్స్ పడితే..
ఇక వరల్డ్ వైడ్ గా రూ. 144.90 కోట్లు బిజినెస్ చేసిన పుష్ప పెట్టిన పెట్టుబడికి కనీసం 150కోట్లు షేర్ అందుకుంటేనే ఒక అర్థం ఉంటుంది. కనీసం బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే సినిమా మరో 06.30 కోట్ల వరకు షేర్ రాబట్టాల్సి ఉంటుంది. మరి సినిమా రెండవ వారంలో పూర్తయ్యే లోపు ఆ సిక్స్ ను దాటుతుందో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











