Pushpa 16 days collections: టార్గెట్ పూర్తి చేసిన పుష్ప రాజ్.. హిందీలో అయితే అరాచకం సామీ!

అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన మొట్టమొదటి పాన్ ఇండియా సినిమా పుష్ప మొత్తానికి అనుకున్న టార్గెట్ ను ఫినిష్ చేసింది. మొదటి వారం ఈ సినిమా అసలు బ్రేక్ ఈవెన్ ను ఫినిష్ చేస్తుందా లేదా అని కామెంట్స్ అయితే చాలానే వచ్చాయి. కానీ ఏదేమైనా కూడా సినిమా 16 రోజుల్లో అనుకున్న పనిని పూర్తి చేసింది ఇక హిందీలో అయితే ఎవరూ ఊహించని విధంగా 16వ రోజు 6 కోట్లకు పైగా వసూళ్లను అందుకోవడం విశేషం.

పుష్ప ప్రీ రిలీజ్ బిజినెస్..

పుష్ప ప్రీ రిలీజ్ బిజినెస్..

అల్లు అర్జున్ పుష్ప ప్రీ రిలీజ్ బిజినెస్ లిస్టులోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కలిపి రూ. 101.85 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేయగా.. కర్నాటకలో రూ. 9 కోట్లు, తమిళనాడులో రూ. 6 కోట్లు, కేరళలో రూ. 4 కోట్ల టార్గెట్ తో మార్కెట్ లోకి విడుదలైంది. ఇక హిందీలో రూ. 10 కోట్ల బిజినెస్ చేసింది. రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లో కలిపి రూ. 14.15 కోట్ల ధర పలికింది. ప్రపంచ వ్యాప్తంగా అయితే రూ. 144.90 కోట్లు బిజినెస్ చేసింది.

16వ రోజు వచ్చిన కలెక్షన్స్

16వ రోజు వచ్చిన కలెక్షన్స్

ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో 11వ రోజుకు తరువాత కలెక్షన్స్ ఒక్కసారిగా తగ్గిపోగా.. 15 రోజు నుంచి మళ్ళీ ట్రాక్ లోకి వచ్చింది. ఇక 16వ రోజు ఏరియాల వారిగా వచ్చిన షేర్ ఈ విధంగా ఉంది. నైజాంలో రూ. 88 లక్షలు, సీడెడ్‌లో రూ. 66 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 29 లక్షలు, ఈస్ట్‌లో రూ. 12 లక్షలు, వెస్ట్‌లో రూ. 9 లక్షలు, గుంటూరులో రూ. 11 లక్షలు, కృష్ణాలో రూ. 10 లక్షలు, నెల్లూరులో రూ. 7 లక్షలతో.. 16 వ రోజు రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 2.23 కోట్లు షేర్, రూ. 3.60 కోట్లు గ్రాస్ వచ్చింది.

16 రోజుల్లో ఏపీ తెలంగాణలో..

16 రోజుల్లో ఏపీ తెలంగాణలో..

తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా 14 రోజుల్లో వచ్చిన షేర్ ఈ విధంగా ఉంది. నైజాంలో రూ. 39.37 కోట్లు, సీడెడ్‌లో రూ. 14.02 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 7.65 కోట్లు, ఈస్ట్‌లో రూ. 4.64 కోట్లు, వెస్ట్‌లో రూ. 3.80 కోట్లు, గుంటూరులో రూ. 4.88 కోట్లు, కృష్ణాలో రూ. 4.02 కోట్లు, నెల్లూరులో రూ. 2.97 కోట్లతో.. ఏపీ తెలంగాణ లో మొత్తంగా రూ. 81.35 కోట్లు షేర్, రూ. 126.15 కోట్లు గ్రాస్ వచ్చింది.

వరల్డ్ వైడ్ టోటల్ కలెక్షన్స్..

వరల్డ్ వైడ్ టోటల్ కలెక్షన్స్..

16 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి. రెండు రాష్ట్రాల్లో 'పుష్ప'కు రూ. 81.35 కోట్లు షేర్ వచ్చింది. కర్నాటకలో రూ. 11.05 కోట్లు, తమిళనాడులో రూ. 10.20కోట్లు, కేరళలో రూ. 5.10 కోట్లు, హిందీలో రూ. 26.80 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.20 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 12.85 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా 11 రోజుల్లోనే రూ. 149.55 కోట్లు షేర్‌తో పాటు రూ. 274 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది.

హిందీలో 16వ రోజు అరాచకం

హిందీలో 16వ రోజు అరాచకం

పుష్ప సినిమా ఫైనల్ గా నార్త్ లో KGF చాప్టర్ 1 రికార్డును బ్రేక్ చేయడమే కాకుండా హిందీ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. మొదటివారంలో వరుసగా 3కోట్ల స్టాండర్డ్ కలెక్షన్స్ తో కొనసాగిన పుష్ప ఆ తరువాత రోజు రెండు కోట్ల కలెక్షన్స్ అందుకుంటూ వచ్చింది. ఇక 15వ రోజు హిందీలో 3.5కోట్లు రాబట్టిన పుష్ప 16వ రోజు 6.1 కోట్ల వసూళ్లను అందుకోవడం అరాచకం అనే చెప్పాలి.

నెంబర్ 5లో పుష్ప

నెంబర్ 5లో పుష్ప

కేజీఎఫ్ చాప్ట‌ర్-1 హిందీ వెర్ష‌న్ రూ.44 కోట్ల గ్రాస్ క‌లెక్ట్ చేసింది. ఇక పుష్ప ఏకంగా 56 కోట్లను ఈజీగా టచ్ చేసింది. హిందీలో అత్యధిక వసూళ్లను అందుకున్న సౌత్ సినిమాల్లో కూడా నెంబర్ 5లో పుష్ప నిలిచింది. ఆ రూట్లో బాహుబలి 2, 2 పాయింట్ ఓ, బాహుబలి 1, సాహో అనంతరం పుష్ప 5వ స్థానం దక్కించుకుంది.

బ్రేక్ ఈవెన్.. ఫినిష్!

బ్రేక్ ఈవెన్.. ఫినిష్!

ఇక ప్రపంచవ్యాప్తంగా గా రూ. 144.90 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ తో వచ్చిన పుష్ప పెట్టిన పెట్టుబడికి కనీసం 150కోట్లు షేర్ అందుకుంటేనే ఒక అర్థం ఉంటుంది. ఇక మొత్తానికి ప్రస్తుతం 146కోట్ల షేర్ తో కొనసాగుతున్న పుష్ప 3.55 కోట్లతో ప్రాఫిట్ జోన్ లోనే కొనసాగుతోంది. ఇక ఆదివారం రోజు కూడా కలెక్షన్స్ ఇంకా ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X