twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Pushpa 25 days collections: ఒక్కసారిగా పడిపోయిన పుష్ప కలెక్షన్స్.. హిందీలో మొత్తం ఎంతంటే!

    |

    ప్రభాస్ తర్వాత ఇందులో అత్యధిక బాక్సాఫీస్ హిట్ అందుకున్న హీరోగా అల్లుఅర్జున్ సరికొత్త రికార్డును నెలకొల్పాడు. పాన్ ఇండియా స్టార్స్ లో ప్రస్తుతం ప్రభాస్ తర్వాత అల్లు అర్జున్ బిగ్గెస్ట్ హీరోగా క్రేజ్ అందుకుంటున్నాడు. ఇక బాక్సాఫీస్ వద్ద పుష్ప హడావుడి దాదాపు ముగిసింది అని చెప్పాలి. ఎందుకంటే అన్ని భాషల్లోనూ ఓటీటీలో విడుదల అవుతోంది. ఇక 25వ రోజుకి కలెక్షన్స్ చాలా వరకు తగ్గిపోయాయి. ముఖ్యంగా హిందీ లో మొదటి సారి కోటి కలెక్షన్స్ మాత్రమే వచ్చాయి. ఇక 25 రోజుల్లో సినిమా వరల్డ్ వైడ్ గా ఏ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంది అనే విషయంపై ఒక లుక్కేస్తే..

    పుష్ప ప్రీ రిలీజ్ బిజినెస్..

    పుష్ప ప్రీ రిలీజ్ బిజినెస్..

    అల్లు అర్జున్ పుష్ప ప్రీ రిలీజ్ బిజినెస్ లిస్టులోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కలిపి రూ. 101.85 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేయగా.. కర్నాటకలో రూ. 9 కోట్లు, తమిళనాడులో రూ. 6 కోట్లు, కేరళలో రూ. 4 కోట్ల టార్గెట్ తో మార్కెట్ లోకి విడుదలైంది. ఇక హిందీలో రూ. 10 కోట్ల బిజినెస్ చేసింది. రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లో కలిపి రూ. 14.15 కోట్ల ధర పలికింది. ప్రపంచ వ్యాప్తంగా అయితే రూ. 144.90 కోట్లు బిజినెస్ చేసింది.

    25వ రోజు వచ్చిన కలెక్షన్స్

    25వ రోజు వచ్చిన కలెక్షన్స్

    ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మొదటి మూడు రెండు వారాల్లో రికార్డు స్థాయిలో వసూళ్లను రాబట్టిన పుష్ప ఆ తరువాత మెల్లగా డౌన్ అయ్యాడు. అయితే, తర్వాత తగ్గుతూ వచ్చిన కలెక్షన్లు సోమవారం నాటికి పూర్తిగా తగ్గిపోయాయి. ఇక 25వ రోజు ఏపీ తెలంగాణలో కలిపి రూ. 19 లక్షలు రాగా 25వ రోజు 8లక్షలు మాత్రమే వచ్చాయి.

    25 రోజుల్లో ఏపీ తెలంగాణలో..

    25 రోజుల్లో ఏపీ తెలంగాణలో..

    తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా 25 రోజుల్లో వచ్చిన షేర్ ఈ విధంగా ఉంది. నైజాంలో రూ. 40.52 కోట్లు, సీడెడ్‌లో రూ. 14.99 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 8.03 కోట్లు, ఈస్ట్‌లో రూ. 4.87 కోట్లు, వెస్ట్‌లో రూ. 3.94 కోట్లు, గుంటూరులో రూ. 5.08 కోట్లు, కృష్ణాలో రూ. 4.22 కోట్లు, నెల్లూరులో రూ. 3.08 కోట్లతో.. ఏపీ తెలంగాణ లో మొత్తంగా రూ. 84.73 కోట్లు షేర్, రూ. 132.15 కోట్లు గ్రాస్ వచ్చింది.

    ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్స్

    ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్స్

    25 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి. రెండు రాష్ట్రాల్లో 'పుష్ప'కు రూ. 84.73 కోట్లు షేర్ వచ్చింది. ఇక కర్నాటకలో రూ. 11.46 కోట్లు, తమిళనాడులో రూ. 11.15కోట్లు, కేరళలో రూ. 5.42 కోట్లు, హిందీలో రూ. 37.90 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.22 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 14.36 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా 25 రోజుల్లోనే రూ. 167.55 కోట్లు షేర్‌తో పాటు రూ. 317 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది.

    హిందీలో 25వ రోజు

    హిందీలో 25వ రోజు

    పుష్ప సినిమా ఫైనల్ గా నార్త్ లో KGF చాప్టర్ 1 రికార్డును బ్రేక్ చేసింది. ఇక 25వ రోజు హిందీలో ఒక్కసారిగా తగ్గిపోయింది. సోమవారం కేవలం 1.1కోట్లు రాబట్టిన పుష్ప మొత్తంగా 81.58కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. కేజీఎఫ్ చాప్ట‌ర్-1 హిందీ వెర్ష‌న్ రూ.44 కోట్ల గ్రాస్ క‌లెక్ట్ చేసింది. ఇక పుష్ప చాలా వేగంగా ఆ రికార్డును బ్రేక్ చేసి అంతకంటే డబుల్ ప్రాఫిట్స్ అందించింది. ఇక హిందీలో అత్యధిక వసూళ్లను అందుకున్న సౌత్ సినిమాల్లో కూడా నెంబర్ 5లో పుష్ప నిలిచింది. ఆ రూట్లో బాహుబలి 2, 2 పాయింట్ ఓ, బాహుబలి 1, సాహో అనంతరం పుష్ప 5వ స్థానం దక్కించుకుంది.

    ప్రాఫిట్స్ ఎంతంటే..

    ప్రాఫిట్స్ ఎంతంటే..

    ఇక వరల్డ్ వైడ్ గా గా రూ. 144.90 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ తో వచ్చిన పుష్ప పెట్టిన పెట్టుబడికి కనీసం 150కోట్లు షేర్ అందుకుంటేనే చాలని అనుకున్నారు. కానీ మొత్తానికి 167కోట్ల షేర్ తో పుష్ప మంచి ప్రాఫిట్స్ అందించింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకి 21.24కోట్ల వరకు ప్రాఫిట్స్ వచ్చినట్లు తెలుస్తోంది.

    English summary
    Pushpa screen counts increased in week 4, Pushpa Day 16 Collections: Allu Arjun Movie Slow Down In hindi States..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X