Don't Miss!
- Lifestyle ఇవి తింటే మీ జుట్టు చాలా బలంగా మారుతుంది.. బట్టతల కూడా రాదు..
- News Lok Sabha Election 2024: 102 సీట్లలో తొలి దశ పోలింగ్ పూర్తి- దాదాపు 60 శాతం ఓటింగ్..!
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Sports SRH playing XI: అతనిపై వేటు..ఢిల్లీతో ఆడే తుదిజట్టు ఇదే
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
Pushpa 31 days collections: పండగ చివరి రోజు పుష్ప రాజ్ డీసెంట్ కలెక్షన్స్.. ఇక ఇవే ఫైనల్ ప్రాఫిట్స్!
మొత్తానికి బాక్సాఫీస్ వద్ద అల్లు అర్జున్ పాన్ ఇండియా మార్కెట్ కు తగ్గట్టుగా మొదటి విజయాన్ని అందుకున్నాడు. గతంలో ఎప్పుడు లేని విధంగా సుకుమార్ దర్శకత్వంలో ఒక సరికొత్త కల్ట్ మాస్ సినిమాను తెరపైకి తీసుకు రావడంతో మొదట కొంత నెగిటివ్ టాక్ వచ్చింది. కానీ ఆ తరువాత పాజిటివ్ టాక్ తోనే సినిమా రేంజ్ మారిపోయింది. ఇక సంక్రాంతి పండగ సీజన్ లో 31వ రోజు కూడా సినిమా మంచి వసూళ్లను అందుకుంది.
ప్రీ రిలీజ్ బిజినెస్..
ప్రభాస్ తర్వాత పాన్ ఇండియా రేంజ్ లో భారీ విజయాన్ని అందుకున్న హీరోగా అల్లుఅర్జున్ సరికొత్త రికార్డును నెలకొల్పాడు. ఇక బాక్సాఫీస్ వద్ద పుష్ప హడావుడి దాదాపు ముగిసింది అనుకుంటున్న తరుణంలో.. సంక్రాంతి హడావిడిలో బాగానే వసూళ్లను అందునుంది. 25వ రోజు నుంచే కలెక్షన్స్ చాలా వరకు తగ్గిపోయాయి. పుష్ప ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కలిపి రూ. 101.85 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేయగా.. కర్నాటకలో రూ. 9 కోట్లు, తమిళనాడులో రూ. 6 కోట్లు, కేరళలో రూ. 4 కోట్ల టార్గెట్ తో మార్కెట్ లోకి విడుదలైంది. ఇక హిందీలో రూ. 10 కోట్ల బిజినెస్ చేసింది. రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్లో కలిపి రూ. 14.15 కోట్ల ధర పలికింది. ప్రపంచ వ్యాప్తంగా అయితే రూ. 144.90 కోట్లు బిజినెస్ చేసింది.
31వ రోజు వచ్చిన కలెక్షన్స్
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మూడు వారాల్లోనే రికార్డు స్థాయిలో వసూళ్లను రాబట్టిన పుష్ప ఆ తరువాత మెల్లగా డౌన్ అయ్యాడు. అయితే, తర్వాత తగ్గుతూ వచ్చిన కలెక్షన్లు సోమవారం నాటికి పూర్తిగా తగ్గిపోయాయి. ఇక 31వ రోజు ఏపీ తెలంగాణలో కలిపి రూ. 10 లక్షలు వచ్చాయి. ఇక సినిమా ఓటీటీలో విడుదలైనప్పటికి సంక్రాంతి హడావుడిలో ఈ స్థాయిలో వసూళ్లను అందుకుంది అంటే గ్రేట్ అనే చెప్పాలి.
31 రోజుల్లో ఏపీ తెలంగాణలో..
తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా 31 రోజుల్లో వచ్చిన షేర్ ఈ విధంగా ఉంది. నైజాంలో రూ. 40.65 కోట్లు, సీడెడ్‌లో రూ. 14.99 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 15.08 కోట్లు, ఈస్ట్‌లో రూ. 4.89 కోట్లు, వెస్ట్‌లో రూ. 3.95 కోట్లు, గుంటూరులో రూ. 5.13 కోట్లు, కృష్ణాలో రూ. 4.25 కోట్లు, నెల్లూరులో రూ. 3.08 కోట్లతో.. ఏపీ తెలంగాణ లో మొత్తంగా రూ. 85.13 కోట్లు షేర్, రూ. 132.83 కోట్లు గ్రాస్ వచ్చింది.
వరల్డ్ వైడ్ కలెక్షన్స్
31 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి. రెండు రాష్ట్రాల్లో 'పుష్ప'కు రూ. 85.13 కోట్లు షేర్ వచ్చింది. ఇక కర్నాటకలో రూ. 11.59 కోట్లు, తమిళనాడులో రూ. 11.38కోట్లు, కేరళలో రూ. 5.51 కోట్లు, హిందీలో రూ. 42.10 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.22 కోట్లు, ఓవర్సీస్లో రూ. 14.48 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా 31 రోజుల్లోనే రూ. 172.41 కోట్లు షేర్‌తో పాటు రూ. 330 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది.
హిందీలో కూడా భారీ స్థాయిలో..
పుష్ప సినిమా ఫైనల్ గా హిందీలో నాన్ బాహుబలి రికార్డులను క్రియేట్ చేసి టాప్ లిస్టులో చేరింది. ఇక 31వ రోజు హిందీలో ఒక్కసారిగా వసూళ్లు తగ్గిపోయాయి పుష్ప మొత్తంగా హిందీలో 82.58కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. ఇక గతంలో కేజీఎఫ్ చాప్టర్-1 హిందీ వెర్షన్ రూ.44 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది.
ఇక పుష్ప ఆ రికార్డును బ్రేక్ చేసి అంతకంటే డబుల్ ప్రాఫిట్స్ అందించింది. హిందీలో అత్యధిక వసూళ్లను అందుకున్న సౌత్ సినిమాల్లో కూడా నెంబర్ 5లో పుష్ప నిలిచింది. ఆ రూట్లో బాహుబలి 2, 2 పాయింట్ ఓ, బాహుబలి 1, సాహో అనంతరం పుష్ప 5వ స్థానం దక్కించుకుంది.
మొత్తం లాభాలు ఎంతంటే..
ఇక ప్రపంచవ్యాప్తంగా గా రూ. 144.90 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ తో మార్కెట్ లోకి వచ్చిన పుష్ప పెట్టిన పెట్టుబడికి కనీసం 150కోట్లు షేర్ అందుకుంటేనే చాలని అనుకున్నారు. కానీ మొత్తానికి 172 కోట్ల షేర్ తో పుష్ప మంచి ప్రాఫిట్స్ అందించింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకి టోటల్ గా 26.41 కోట్ల వరకు ప్రాఫిట్స్ వచ్చినట్లు తెలుస్తోంది.