Pushpa Day 9 collections: పాన్ ఇండియా రేంజ్, కానీ F2 కంటే తక్కువే.. ఇంకా ఎంత రావాలంటే?

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమా తో కెరీర్ లోనే మొదటి సారి రెండు వందల కోట్ల మార్కెట్ ను అందుకున్నాడు. ఆ తర్వాత ఎలాగైనా పుష్ప సినిమాతో అంతకుమించి అనేలా తనకంటూ ఒక పాన్ ఇండియా మార్కెట్ ను క్రియేట్ చేసుకోవాలని అనుకున్నాడు. అయితే ఈ సినిమా మాత్రం ఓపెనింగ్స్ బాగానే అందుకుంది కానీ.. ఆ తరువాత అనుకున్నంత స్థాయిలో కలెక్షన్స్ అందుకోవడం లేదు. ఇక 9వ రోజు కలెక్షన్స్ అయితే F2 మూవీ కంటే తక్కువగానే రావడం విశేషం.

మొదటిసారి అలా..

మొదటిసారి అలా..

అల్లు అర్జున్ నటించిన మొదటి పాన్ ఇండియా మూవీపై మొదటి నుంచి కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి. ముఖ్యంగా సాంగ్స్ తోనే దేవిశ్రీప్రసాద్ భారీ స్థాయిలో హైప్ ఐతే క్రియేట్ చేశాడు. ఇక ఆ తర్వాత ట్రైలర్ కూడా సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది. స్టైలిష్ స్టార్ గా గుర్తింపు పొందిన బన్నీ మొదటి సారి తన స్టైల్ మొత్తం పక్కన పెట్టేసి ఊర మాస్ లుక్ లో షాక్ ఇచ్చాడు. సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా పుష్ప పాత్ర ఎక్కువగా నచ్చింది అని అంటున్నారు.

ప్రీ రిలీజ్ బిజినెస్.. ఎంతంటే?

ప్రీ రిలీజ్ బిజినెస్.. ఎంతంటే?

తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా మిగతా రాష్ట్రాల్లో కూడా బన్నీకి మంచి మార్కెట్ ఉన్న విషయం తెలిసిందే. ఇక 'పుష్ప' ఏపీ తెలంగాణలో కలిపి రూ. 101.85 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేయగా కర్నాటకలో రూ. 9 కోట్లు అలాగే తమిళనాడులో రూ. 6 కోట్లు, కేరళలో రూ. 4 కోట్ల టార్గెట్ తో విసుదలైంది. ఇక హిందీలో రూ. 10 కోట్ల బిజినెస్ చేయగా రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లో కలిపి రూ. 14.15 కోట్ల ధర పలికింది. ప్రపంచ వ్యాప్తంగా అయితే రూ. 144.90 కోట్లు బిజినెస్ చేసింది. అంటే సినిమా 150కోట్లు షేర్ అందుకుంటేనే హిట్టయినట్లు లెక్క.

ఇక 9వ రోజు వసూళ్ల విషయానికి వస్తే..

ఇక 9వ రోజు వసూళ్ల విషయానికి వస్తే..

తెలుగు రాష్ట్రాల్లో పరవాలేదు అనే విధంగా 9వ రోజులు కలెక్షన్స్ వచ్చాయి. ఏరియాల వారిగా వచ్చిన షేర్ ఈ విధంగా ఉంది. నైజాంలో రూ. 1.71 కోట్లు, సీడెడ్‌లో రూ. 60 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 46 లక్షలు, ఈస్ట్‌లో రూ. 16 లక్షలు, వెస్ట్‌లో రూ. 12 లక్షలు, గుంటూరులో రూ. 14 లక్షలు, కృష్ణాలో రూ. 13 లక్షలు, నెల్లూరులో రూ. 11 లక్షలతో.. 8వ రోజు రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 3.43 కోట్లు షేర్, రూ. 6.35 కోట్లు గ్రాస్ వచ్చింది.

9 రోజుల్లో మొత్తం కలెక్షన్స్

9 రోజుల్లో మొత్తం కలెక్షన్స్

8వ రోజు కంటే కూడా 9వ రోజు తెలుగు రాష్ట్రాల్లో భారీ స్పందన దక్కింది. ఇక ఇప్పటివరకు 9 రోజుల్లో వచ్చిన షేర్ ఈ విధంగా ఉంది. నైజాంలో రూ. 35.70 కోట్లు, సీడెడ్‌లో రూ. 12.25 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 6.66 కోట్లు, ఈస్ట్‌లో రూ. 4.19 కోట్లు, వెస్ట్‌లో రూ. 3.46 కోట్లు, గుంటూరులో రూ. 4.48 కోట్లు, కృష్ణాలో రూ. 3.64 కోట్లు, నెల్లూరులో రూ. 2.67 కోట్లతో.. ఏపీ తెలంగాణ లో మొత్తంగా రూ. 73.05 కోట్లు షేర్, రూ. 112.03 కోట్లు గ్రాస్ వచ్చింది.

వరల్డ్ వైడ్ కలెక్షన్స్..

వరల్డ్ వైడ్ కలెక్షన్స్..

ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు 9 రోజుల్లో వచ్చిన కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి. రెండు రాష్ట్రాల్లో 'పుష్ప'కు రూ. 73.05 కోట్లు షేర్ వచ్చింది. ఇక కర్నాటకలో రూ. 9.21 కోట్లు, తమిళనాడులో రూ. 7.81 కోట్లు, కేరళలో రూ. 4.10 కోట్లు, హిందీలో రూ. 15.55 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.11 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 11.90 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా 9 రోజుల్లోనే రూ. 123.73 కోట్లు షేర్‌తో పాటు రూ. 218 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది.

ఇంకా ఎంత రావాలంటే..

ఇంకా ఎంత రావాలంటే..

ప్రపంచ వ్యాప్తంగా అయితే రూ. 144.90 కోట్లు బిజినెస్ చేసింది. అంటే సినిమా 150కోట్లు షేర్ అందుకుంటేనే హిట్టయినట్లు లెక్క. కనీసం బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే సినిమా ఇంకా 22.27 కోట్ల వరకు షేర్ రాబట్టాల్సి ఉంది. మరి సినిమా రెండవ వారంతరంలో అయినా ఆ టార్గెట్ ను అందుకుంటుందో లేదో చూడాలి.

F 2 కంటే తక్కువే..

F 2 కంటే తక్కువే..

పాన్ ఇండియా రేంజ్ కలిగిన పుష్ప సినిమా ఒక విధంగా 9వ రోజు F2 సినిమా కంటే తక్కువ కలెక్షన్స్ రాబట్టింది. 9వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యదిక షేర్ అందుకున్న సినిమాల లిస్టులోకి వెళితే.. బాహుబలి 6.51కోట్లు, సరిలేరు నీకెవ్వరు 6.33 కోట్లు, అల.. వైకుంఠపురములో 5.05కోట్లు, F2 మూవీ 4.76 కోట్లతో టాప్ 4 లో ఉన్నాయి. ఇక పుష్ప 3.43కోట్ల షేర్ తో 5వ స్థానంలో నిలిచింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X