నార్త్‌లో పుప్పకు 100 కోట్లు.. అయినా నిర్మాతలకు నష్టమే.. కారణం ఏమిటంటే?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరికొత్తగా పుష్ప సినిమాతో స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ను ఏర్పాటు చేసుకున్నాడు. మొత్తానికి నార్త్ ఇండియాలో కూడా బన్నీ హావా ఏమిటో మరోసారి అర్థమయింది. కేవలం యూట్యూబ్ వరకు మాత్రమే కాకుండా వెండితెరపై కూడా బన్నీ ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకుంటాడు అనే క్లారిటీ వచ్చేసింది. పుష్ప సినిమా మొత్తానికి పాన్ ఇండియా రేంజ్ కి తగ్గట్టుగానే సక్సెస్ అయింది. అసలైన బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ సినిమా 100 కోట్ల నెట్ కలెక్షన్ కూడా అందుకుంది. అయితే నిర్మాతలకు మాత్రం ఒక విధంగా భారీ నష్టాలను కలిగే చేసినట్లు తెలుస్తోంది కారణం ఏమిటి అనే విషయంలోకి వెళితే..

మూడవసారి..

మూడవసారి..

సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో ఇంత వరకు రెండు ప్రేమ కథలు మాత్రమే వచ్చాయి. ఆర్య, ఆర్య 2 సినిమాలు వేటికవే భిన్నంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఒక సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేయగా మరొక సినిమా విమర్శకుల ప్రశంసలను అందుకుంది. ఇక మూడవ సారి చేసిన పుష్ప సినిమా అంతకుమించి అనేలా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది.

పుష్ప 2 విషయంలో..

పుష్ప 2 విషయంలో..

పుష్ప పార్ట్ 1 సక్సెస్ కావడంతో పుష్ప రెండవ భాగం పై కూడా అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. అందుకే దర్శకుడు సుకుమార్ ఆ సినిమా విషయంలో చాలా ప్రత్యేకంగా ఆలోచిస్తున్నాడు. సినిమా షూటింగ్ దాదాపు ఫినిష్ అయిపోయింది. అయితే చివర్లో కొన్ని మార్పులు కూడా చేసే అవకాశం ఉన్నట్లుగా టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా మరొక పవర్ఫుల్ విలన్ ను కూడా సినిమా కథలు జత చేయబోతున్నట్లు సమాచారం.

ఆ డౌట్ క్లియర్ అయ్యింది..

ఆ డౌట్ క్లియర్ అయ్యింది..

ఇక పుష్ప సినిమా బాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ స్థాయిలో రెస్పాన్స్ అందుకుంది. గతంలో అల్లు అర్జున్ సినిమాలు అన్ని కూడా హిందీలో డబ్ చేసి యూట్యూబ్లో రిలీజ్ చేయగా వందల మిలియన్ల వ్యూవ్స్ అందుకున్నాయి. అయితే బన్నీకి మంచి క్రేజ్ ఉందని అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది. కానీ ఆ క్రేజ్ సినిమా థియేటర్స్ వరకు తీసుకు వస్తుందా లేదా అనేది కొంత అనుమానంగా ఉండేది. కానీ మొత్తానికి బన్నీ అయితే ప్రేక్షకులను థియేటర్ వరకు తీసుకు వచ్చి సినిమాను సక్సెస్ చేశారు.

హిందీ విడుదలపై అప్పుడు టెన్షన్

హిందీ విడుదలపై అప్పుడు టెన్షన్

పుష్ప సినిమా ఒక విధంగా సౌత్ లో కాంటె నార్త్ లో పెట్టిన పెట్టుబడికి అత్యధిక స్థాయిలో లాభాలను అందించడం విశేషం. అసలైతే హిందీ లో సినిమాను విడుదల చేస్తారా లేదా అని చివరి నిమిషం వరకు కాస్త సందేహంగానే ఉండేది. విడుదలకు ముందు రోజు వరకు కూడా నిర్మాతల్లో ఒక భయం అయితే ఉంది కానీ ధైర్యం చేసి హిందీలో విడుదల చేశారు.

హిందీలో నష్టాలు

హిందీలో నష్టాలు

పుష్ప సినిమాకు మొదట్లో హిందీ లో అంతగా ఆఫర్స్ అయితే రాలేదు. అందుకు కారణం చిత్ర యూనిట్ సభ్యులు భారీస్థాయిలో ప్రమోషన్స్ కూడా చేయలేదు. ఫైనల్ గా సినిమా విడుదల తర్వాతనే పాజిటివ్ టాక్ అందుకుంటూ కలెక్షన్స్ సంఖ్యను కూడా పెంచుతుంది. 100 కోట్ల వరకు నెట్ కలెక్షన్స్ అందుకుంది అంటే తప్పకుండా నిర్మాతలకు భారీ స్థాయిలో లాభాలు వచ్చి ఉంటాయి అని అందరూ అనుకున్నారు. కానీ ఒక విధంగా నిర్మాతల్లో భారీగా నష్టపోయినట్లు అర్థమవుతోంది.

 మైత్రి మూవీ మేకర్స్ మిస్టేక్..

మైత్రి మూవీ మేకర్స్ మిస్టేక్..

ఎందుకంటే పుష్ప సినిమాను హిందీలో కేవలం పది కోట్లకు అమ్మేశారు. ఇక నార్త్ బయ్యర్లు ఆ సినిమాను క్యాష్ చేసుకునే భారీస్థాయిలో విడుదల చేయడం జరిగింది. ఈ సినిమా ఇప్పటికే వంద కోట్ల నెట్ కలెక్షన్ రావడంతో 10 కోట్ల పెట్టుబడికి వారికి ఏ స్థాయిలో లాభాలు వచ్చాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మైత్రి మూవీ మేకర్స్ హిందీ లో సినిమాను ఇంకా బాగా ప్రమోట్ చేసి విడుదల చేయించి అమ్మి ఉంటే మరో 25 కోట్లకు పైగా లాభాలు వచ్చి ఉండేవి.

సెకండ్ పార్ట్ విషయంలో..

సెకండ్ పార్ట్ విషయంలో..

ఏదేమైనా కూడా పుష్ప సినిమా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ హిందీ లో భారీగా నష్టపోవాల్సి వచ్చింది. ఇక ఆ పొరపాటు పుష్ప పార్ట్ 2 విషయంలో జరగకూడదు అని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మొదటి పార్ట్ 100 కోట్ల నెట్ కలెక్షన్ అందుకుంది కాబట్టి పుష్ప సెకండ్ పార్ట్ ఈజీగా 60 కోట్ల పైగా అమ్ముకునే అవకాశం ఉంటుంది. లేదా సొంతంగా రిలీజ్ చేసిన కూడా భారీ స్థాయిలో లాభాలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. మరి మైత్రి మూవీ మేకర్స్ ఏ విధంగా ఆలోచిస్తారో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X