Pushpa 2 Advance Booking: ఓవర్సీస్‌లో అల్లు అర్జున్ అడ్వాన్స్ బుకింగ్ తడాఖా.. పుష్ప 2 మూవీకి ఎన్ని కోట్లంటే?

ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన పుష్ప ది రైజ్ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న చిత్రం పుష్ప ది రూల్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి ముస్తాబవుతున్నది. సుకుమార్‌ రైటింగ్స్‌ అసోసియేషన్‌తో మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. అయితే టీజర్, ఇతర ప్రమోషనల్ కంటెంట్ ఈ సినిమా రేంజ్‌ను మరో లెవెల్‌కు తీసుకెళ్లాయి. అయితే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ వేడుక, అలాగే అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

డిసెంబర్ 5వ తేదీన గ్రాండ్‌గా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్నది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌ను కనివీని ఎరుగని రీతిలో చేయనున్నారు. ఇండియాలోని ప్రధాన నగరాల్లో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. నవంబర్ 17వ తేదీన పాట్నాలో ట్రైలర్ రిలీజ్ చేయడం ద్వారా ప్రమోషన్స్‌ను సంచలన రీతిలో చేయనున్నారు. ఆ తర్వాత కోల్‌కత్తా, చెన్నై, కొచ్చి, బెంగళూరు, ముంబై, హైదరాబాద్ నగరాల్లో ఈవెంట్స్ నిర్వహించనున్నారు.

Pushpa The Rule Overseas Box Office Advance Booking Allu Arjun movie gets tremendous response at GBOC

పుష్ప 2 సినిమాలో సమంత రుత్ ప్రభు స్పెషల్ సాంగ్ హైలెట్‌గా మారింది. అయితే పుష్ప 2 సినిమాలో కూడా ఓ స్పెషల్ సాంగ్‌ను ప్లాన్ చేశారు. త్రిప్తి డిమ్రీ, శ్రద్దాకపూర్ పేర్లను పరిశీలించగా.. చివరకు తెలుగు అమ్మాయి శ్రీలీలను ఖరారు చేశారు. కిస్సిన్ అనే పాటను ఇటీవల షూట్ చేశారు. దాంతో ఈ సినిమాపై మరింత క్రేజ్ పెరిగింది.

నేషనల్ క్రష్ రష్మిక మందన్న, ఫహాద్‌ ఫాజిల్‌, రావు రమేష్‌, సునీల్‌, అనసూయ భరద్వాజ్‌ తదితరులు నటించిన ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్‌ను ఇటీవలే అమెరికాలో ప్రారంభించారు. అయితే యూఎస్ బాక్సాఫీస్ వద్ద భారీగా కలెక్షన్లు రాబడుతున్నది. రిలీజ్ డేట్‌కు ఇంకా చాలా రోజులు ఉండగానే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్‌కు భారీ రెస్పాన్స్ వస్తున్నది.

Pushpa The Rule Overseas Box Office Advance Booking Allu Arjun movie gets tremendous response at GBOC

ఓవర్సీస్‌లో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్‌ను ఒక నెల ముందుగానే ప్రారంభించారు. పలు దేశాల్లో ఈ సినిమాకు భారీగా బుకింగ్స్ నమోదు అవుతున్నాయి. ఇంకా విడుదలకు 20 రోజులకుపైగా ఉండగా రికార్డు ప్రీ సేల్స్ నమోదు అవుతున్నాయి. ఈ సినిమా ఓవర్సీస్‌లో ఇప్పటి వరకు సుమారుగా 1 మిలియన్ డాలర్లకు చేరువైంది. అంటే సుమారుగా ఈ సినిమా రిలీజ్‌కు ముందే 8.3 కోట్ల రూపాయలు వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X