Pushpa 2 Business: పుష్ప 2 రికార్డు బ్రేక్ బిజినెస్.. ఇండియాలోనే నెంబర్ 1 గా అల్లు అర్జున్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన పుష్ప ది రైజ్ చిత్రం సంచలన విజయం సాధించింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌సై నవీన్ ఎర్నేని, రవి యలమంచలి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం అల్లు అర్జున్ బాక్సాఫీస్ స్టామినాను చాటి చెప్పింది. దాంతో ఈ మూవీకి సీక్వెల్‌గా వస్తున్న పుష్ప ది రూల్ (Pushpa 2) మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. డిసెంబర్ 5వ తేదీన రిలీజ్ అవుతున్న ఈ సినిమా బిజినెస్ వివరాల్లోకి వెళితే..
పుష్ప చిత్రం బడ్జెట్, బిజినెస్ వివరాల్లోకి వెళితే.. ఈ సినిమా కోవిడ్ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమా సుమారుగా 180 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించారు. ఈ సినిమాబిజినెస్ సుమారుగా 150 కోట్ల రూపాయల మేర జరిగింది. ఈ సినిమాను ఇండియాలోనే సుమారుగా 300 స్క్రీన్లలో రిలీజ్ చేశారు.

ఇక పుష్ప 1 సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఇండియాలో 131 కోట్ల రూపాయల కలెక్షన్లు రాబట్టింది. కన్నడలో 20 కోట్ల రూపాయలు, తమిళంలో 12 కోట్ల రూపాయలు, మలయాళంలో 22 కోట్ల రూపాయలు, హిందీలో 130 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ సినిమా పూర్తిగా థియేట్రికల్ రన్‌లో 315 కోట్ల రూపాయలకుపైగా వసూళ్లను రాబట్టింది.
ఇక పుష్ప 1 సినిమా సాధించిన రికార్డు విజయం, అలాగే పుష్ప 2 మీద ఉన్న భారీ అంచనాల కారణంగా ఇండియాలో ఏ మూవీకి జరుగని విధంగా బిజినెస్ పుష్ప 2 సినిమాకు జరిగింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఇప్పుడు ఇండియాలో ఐకాన్ స్టార్ మూవీ బిజినెస్ గురించి రకరకాలుగా చర్చించుకొంటున్నారు.

పుష్ప 2 సినిమా అంటే పుష్ప ది రూల్ మూవీ బిజినెస్ వివరాల్లోకి వెళితే.. ఏపీ, తెలంగాణ థియేట్రికల్ హక్కులు 220 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి. తమిళనాడు హక్కులు 50 కోట్లు, కర్ణాటక 30 కోట్లు, కేరళ హక్కులు 20 కోట్లు మేర అమ్ముడు పోయాయి. ఇక హిందీ వెర్షన్ హక్కులు 200 కోట్ల రూపాయలు, ఓవర్సీస్ హక్కులు 120 కోట్ల రూపాయల మేర అమ్ముడుపోయాయి. మొత్తంగా ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ద్వారా 640 కోట్ల రూపాయలు సంపాదించింది.
ఇక నాన్ థియేట్రికల్ హక్కుల విషయానికి వస్తే.. డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకొన్నది. సుమారుగా 275 కోట్ల రూపాయల మేర ఈ హక్కుల బిజినెస్ జరిగింది. ఇక మ్యూజిక్ రైట్స్ 65 కోట్ల రూపాయలు, శాటిలైట్ రైట్స్ 85 కోట్ల రూపాయల మేర జరిగింది. దాంతో ఈ సినిమా పూర్తి స్థాయి బిజినెస్ 1065 కోట్ల మేర జరిగిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇటీవల కాలంలో ఈ రేంజ్ బిజినెస్ చేసిన హీరోల్లో అల్లు అర్జున్ దే హవా అని చెప్పుకొంటున్నారు,.


Click it and Unblock the Notifications











