సాయికుమార్ కొడుక్కి రజనీకాంత్ సాయం

By Srikanya

హైదరాబాద్ : సినిమా తీయటం ఒకెత్తు అయితే రిలీజ్ కూడా అంతకంటే కష్టతరమైనపనిగా మారింది. ముఖ్యంగా చిన్న సినిమాలకు సరైన థియోటర్స్ దొరకని పరిస్ధితి ఏర్పడింది. టైం బాగుంటే ఆ సమస్య దానంతట అదే తీరుతుంది. తాజాగా రజనీకాంత్ తాజా చిత్రం విక్రమ్ సింహా ముందు అనుకున్నట్లుగా మే 9 న విడుదల కాకుండా వాయిదా పడిన సంగతి తెలిసిందే. అది సాయికుమార్ కుమారుడు ఆదికి కలిసివస్తోంది.విక్రమ్ సింహా కోసం అందుకోసం కేటాయించిన థియోటర్స్ లోకి అతని తాజా చిత్రం దూకేస్తోంది. ఆ రకంగా ఆదికి రజనీకాంత్ ఇండైరక్ట్ గా సాయం చేసాడన్నమాట.

ఇక ఆ రోజు విడుదల అవుతున్న ఆ చిత్రం... ఆది, శాన్వి జంటగా నటించిన చిత్రం 'ప్యార్‌మే పడిపోయానే'. రవి చావలి దర్శకుడు. కె.కె.రాధామోహన్‌ నిర్మాత. ఈనెల 16న ఈ చిత్రాన్ని విడుదల చేద్దామనుకొన్నారు. కానీ.. ఓ వారం ముందుగా అంటే.. ఈనెల 10నే ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. మొత్తానికి ఈ రూపంలో రజనీ కాంత్ అతని ధియోటర్ కష్టాన్ని తీర్చాడన్నమాట.

ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ''సాధారణంగా సినిమాల వాయిదా పడుతుంటాయి. మేం ముందే వస్తున్నందుకు సంతోషంగా ఉంది. కుటుంబ సమేతంగా చూడదగిన చిత్రమిది. ఆది, శాన్విల జంట మరోసారి ఆకట్టుకొంటుంది. అనూప్‌ బాణీలకు మంచి స్పందన వస్తోంది. ఈవేసవిలో వినోదాల జల్లు కురిపించే చిత్రమిది'' అన్నారు.

Pyaar Mein Padipoyane to release on May 10

దర్శకుడు మాట్లాడుతూ... "మా సినిమాకు సంబంధించిన సెన్సార్ పనులన్నీ పూర్తయ్యాయి. యు/ఎ సర్టిఫికెట్ వచ్చింది. మంచి లవ్ ఫీల్‌తో తెరకెక్కిన సినిమా ఇది. చక్కటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ఆది, శాన్వికి 'లవ్‌లీ' తర్వాత 'ప్యార్ మే పడిపోయానే' మంచి హిట్ సినిమా అవుతుంది. అనూప్ అందించిన సంగీతానికి మంచి స్పందన వస్తోంది. మా సంస్థలో ఇది చాలా పెద్ద హిట్ సినిమా అవుతుంది'' అని తెలిపారు.

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎం.ఎస్.కుమార్ మాట్లాడుతూ...ఆది పెర్ఫార్మెన్స్ ఈ చిత్రానికి హైలెట్. ఈ చిత్రం ఆది కెరీర్లో మరో సూపర్ హిట్ అవుతుంది. మా బేనర్లో వస్తున్న మరో మంచి చిత్రమిది. కుటుంబ సమేతంగా చూడదగ్గ క్లీన్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టెనర్ ఈ చిత్రం. అనూపర్ రూబెన్స్ అందిస్తున్న సంగీతం ఈ చిత్రానికి మరో హైలెట్ అవుతుంది' అన్నారు.

ఆది, శాన్వి, వెన్నెల కిషోర్, కాశీ విశ్వనాథ్, దువ్వాసి మోహన్, తాగుబోతు రమేష్, సప్తగిరి, మధు, నరసింహ, పృథ్వి, గురురాజ్, సత్యకృష్ణ, అనంత్, సంధ్యా ఝనక్, మాధవి సిద్ధం, విష్ణుప్రియ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ సినిమాకు సంగీతం: అనూప్ రూబెన్స్, ఎడిటింగ్: కె.వి.కృష్ణారెడ్డి, ఆర్ట్: కె.వి.రమణ, కెమెరా: టి.సురేంద్రరెడ్డి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఎం.ఎస్.కుమార్, నిర్మాత: కె.కె. రాధామోహన్, రచన-దర్శకత్వం: రవిచావలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X