షారూఖ్ 'రా.వన్' ఫస్ట్ డే కలెక్షన్ వివరాలు
షారూఖ్ ఖాన్ తాజా చిత్రం రావన్ మొన్న దీపావళి రోజు విడుదలైన సంగతి తెలిసిందే. ఆ చిత్రం ఆ రోజు కేవలం 18 కోట్లు మాత్రమే వసూలు చేయగలిగింది.సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ చిత్రం ఓపినింగ్ డే కలెక్షన్స్ అయిన 22 కోట్లను రీచ్ కాలేకపోయింది.దాంతో షారూఖ్ కాస్త నిరాశపడ్డారని తెలుస్తోంది.అప్పటికీ రివ్యూలు పాజిటివ్ గా వచ్చినా ఇదో పిల్లల చిత్రం అనే ముద్రపడటం సినిమాకు మైనస్ గా మారిందని లీట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు.భారతీయ భావోద్వేగాలతో కూడిన హాలీవుడ్ తరహా చిత్రమని,వీడియో గేమ్ మాదిరి సాగే సూపర్ హీరో చిత్రమని తేల్చేసారు.ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని 3,500 ధియోటర్స్ లో రిలీజ్ చేసారు.దాదాపు 150 కోట్లకు పైగానే ఈ చిత్రంపై పెట్టుబడి పెట్టారు. ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ 35 కోట్లు వచ్చాయి. డిస్ట్రిబ్యూషన్ రైట్స్ 77 కోట్లు వచ్చాయి.
షారుఖ్ తన స్వంత బ్యానర్ రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్ మెంట్ పతాకం పై తెరకెక్కిన ఈ సినిమా పై అంచనాలు కూడా భారీగానే ఏర్పడ్డాయి. మరి వాటిని షారుఖ్ అందుకున్నాడా అంటే అంటే లేదనే చెప్పాలి. విర్చువల్ వరల్డ్ లో ఉన్న క్యారక్టర్ లు రియల్ లైఫ్ లోకి ఎంటర్ అయితే ఏంటి పరిస్థితి అనేది సినిమా కథ. మొదటి నుంచి చివర వరకు ఇది పూర్తిగా షారుఖ్ ఖాన్ సినిమా గా తీర్చి దిద్దారు. రావన్ గా అర్జున్ రామ్ పాల్ క్యారక్టర్ మంచి మార్కులే వేయించుకున్నారు. రజనీకాంత్, ప్రియాంక చోప్రా, సంజయ్ దత్ గెస్ట్ క్యారక్టర్స్ లో కనిపించి అలరించారు. హింది,తెలుగు,తమిళ భాషల్లో కూడా ఈ చిత్రం విడుదలైంది.


Click it and Unblock the Notifications











