Raaka Business: రిలీజ్‌కు ముందే నార్త్‌లో రాకా మేనియా.. అల్లు అర్జున్ మూవీకి కళ్లు చెదిరే ఆఫర్?

బాహుబలి సిరీస్ దెబ్బకి నార్త్ ఇండియాలో తెలుగు సినిమాలకు మంచి మార్కెట్ ఏర్పడింది. ఆ తర్వాత వచ్చిన కార్తీకేయ 2, ఆర్ఆర్ఆర్, పుష్ప సిరీస్ తదితర సినిమాలు ఈ మార్కెట్‌ను మరింత పటిష్టం చేశాయి. తెలుగు సినిమాలలో మాస్, కమర్షియల్ ఎలిమెంట్స్‌కు నార్త్ ఆడియన్స్‌ ఫిదా అవుతున్నారు. అందుకే తెలుగు సినిమాల కోసం వారు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇక పుష్ప సిరీస్‌తో ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్‌కు ఉత్తర భారతంలో సాలీడ్ మార్కెట్‌తో పాటు భారీ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఆయన సినిమాల కోసం అక్కడి అభిమానులు వెయిట్ చేస్తున్నారు.

పుష్ప సిరీస్‌తో ఏర్పడిన క్రేజ్‌ను, మార్కెట్‌ను పదిలంగా కాపాడుకోవడానికి అల్లు అర్జున్ పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ- బన్నీ కాంబోలో రాకా తెరకెక్కుతుండగా.. ఈ మూవీ తర్వాత మరో స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌తో అల్లు అర్జున్ సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం రాకా కోసం బన్నీ శ్రమిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్, టెక్నికల్ బ్యాక్‌డ్రాప్‌లో రాకాను తెరకెక్కిస్తున్నారు అట్లీ. ఇప్పటికే రాకా నుంచి రిలీజైన అల్లు అర్జున్ లుక్ సినిమాపై అంచనాలు పెంచేసింది. గుండుతో, కత్తుల్లాంటి గోళ్లతో వైల్డ్‌గా కనిపిస్తున్నారు బన్నీ. 2027 సమ్మర్‌లో రాకా మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Raaka Business North Indian distributors trying to get theatrical rights of Allu Arjun- Atlee Movie

రాకాలో అల్లు అర్జున్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటిస్తున్నారు. అలాగే మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న, జాన్వీ కపూర్‌లు కూడా కీలకపాత్రలు పోషిస్తారని గాసిప్స్ వైరల్ అవుతుండగా.. దీనిపై చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. రమ్యకృష్ణ, జిమ్ సార్బ్, యోగిబాబు తదితరులు రాకాలో నటిస్తున్నారు. దాదాపు 1000 కోట్ల బడ్జెట్‌తో సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సాయి అభ్యాంకర్ సంగీతం అందిస్తుండగా.. జీవీ విష్ణు సినిమాటోగ్రాఫర్‌గా, అంటోనీ ఎల్ రుబిన్‌ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. రాకాలో మిగిలిన నటీనటులు, టెక్నికల్ టీమ్ వివరాలు తెలియాల్సి ఉంది.

అల్లు అర్జున్ - అట్లీ కాంబోకు తోడు బన్నీ గెటప్‌తో రాకాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. దాంతో ఈ సినిమా ఇంకా సెట్స్ మీద ఉండగానే.. థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ కోసం బడా సంస్థలు, డిస్ట్రిబ్యూటర్లు ఎగబడుతున్నారు. ముఖ్యంగా పుష్ప సిరీస్‌తో నార్త్ ఆడియన్స్ ఊగిపోవడంతో ఆ ఏరియా హక్కులకు కూడా భారీ డిమాండ్ ఉంది. ఒక్క హిందీలోనే పుష్ప 2కి ఏకంగా 812 కోట్ల రూపాయల కలెక్షన్స్ ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది.

ప్రత్యేకించి బిహార్ ప్రజలు రాకా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ రాష్ట్రంలో అల్లు అర్జున్‌కు ఉన్న క్రేజ్ దృష్ట్యా.. అక్కడి డిస్ట్రిబ్యూటర్లు రాకా థియేట్రికల్ రైట్స్‌ కోసం ఎగబడుతున్నారట. ఎంత ధరైనా సరే చెల్లించేందుకు నిర్మాతలకు ఆఫర్లు ఇస్తున్నారట. ఉత్తరప్రదేశ్, బిహార్‌, జార్ఖండ్ లాంటి హిందీ బెల్ట్ ఏరియాలలో పుష్ప 2 మూవీకి కలెక్షన్ల వర్షం కురిసింది. ఇప్పుడు రాకాకి కూడా అదే స్థాయిలో ఆదరణ లభిస్తుందని డిస్ట్రిబ్యూటర్లు భావిస్తున్నారు. గతంలో పుష్ప 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ పాట్నాలో గ్రాండ్‌గా జరగ్గా... అభిమానులు భారీగా పోటెత్తారు. ఇప్పుడు రాకాకు కూడా ఇదే స్పందన వస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. రాకా థియేట్రికల్ రైట్స్ కోసం బిహారీలు కళ్లు చెదిరే ఆఫర్ ఇవ్వగా... నిర్మాతల నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Read more about: Raaka allu arjun atlee
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X