వీకెండ్ లో నే 31.5 కోట్లు వసూలు!
35 కోట్ల వ్యయంతో ధనుష్, సోనమ్ కపూర్ జంటగా ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో రాన్ జానా చిత్రం రూపొందింది. రాన్ జానా చిత్రంపై బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ప్రశంసలు కురిపించారు. రాన్ జనా చిత్రం గురించి సెలబ్రిటీలు గొప్పగా మాట్లాడుకుంటున్నారని.. అమితాబ్ ట్విటర్ లో పోస్ట్ చేశారు.
ధనుష్ మాట్లాడుతూ.. తనకు భాష ముఖ్యం కాదని, కథ నచ్చితే చాలని తెలిపాడు. బాలీవుడ్‌లో క్రమం తప్పక నటిస్తానని అక్కడొకటి, ఇక్కడొకటి చొప్పున కెరీర్ కొనసాగుతుందని స్పష్టం చేశాడు. ఆ మేరకు ప్రస్తుతం మరో హిందీ కథకు పచ్చజెండా ఊపాడు. ఈ కొత్త చిత్రం కూడా 'రాంజానా' దర్శకుడు ఆనంద్ ఎల్‌రాయ్ నిర్దేశకత్వంలోనే రూపొందనుండటం విశేషం.
కథ నచ్చటంతోనే మళ్లీ ఆయన చిత్రంలో నటించేందుకు అంగీకరించాడని, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోందని ధనుష్ సన్నిహితవర్గాలు పేర్కొంటున్నాయి. 'రాంజానా' చిత్రం 21న హిందీలో, అదే రోజు 'అంబికాపతి' పేరిట తమిళంలోనూ తెరపైకి వచ్చింది. మరో ప్రక్క భరత్‌బాలా దర్శకత్వంలో నటించిన నేరు తమిళచిత్రం 'మరియన్' కూడా విడుదలకు సిద్ధంగా ఉంది.


Click it and Unblock the Notifications












