Raayan Collections రాయన్ సినిమాకు రికార్డు ఓపెనింగ్స్..ధనుష్ కెరీర్‌లో హయ్యెస్ట్.. ఎన్ని కోట్లంటే?
తమిళ సూపర్ స్టార్ ధనుష్ నటించి దర్శకత్వం వహించిన చిత్రం రాయన్. సిస్టర్ సెంటిమెంట్‌తోపాటు యాక్షన్, డ్రామాగా రూపొందిన చిత్రంలో సందీప్ కిషన్, అపర్ణ బాలకృష్ణన్, ఎస్ జే సూర్య తదితరులు నటించారు. తమిళ నాడులో అగ్ర సినీ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించిన ఈ సినిమా జూలై 26వ తేదీన రిలీజైంది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత అనే విషయంలోకి వెళితే..
రాయన్ సినిమా కథ విషయానికి వస్తే.. తల్లిదండ్రులు చిన్నతనంలోనే చనిపోవడంతో అనాధలుగా మారిన నలుగురు అన్నాచెల్లెల ఎమోషనల్ కథ. రాయన్ పెద్ద దిక్కుగా మారి తన సోదరి, సోదరులకు అండగా నిలుస్తాడు. తన తమ్ముళ్లు, చెల్లెల కోసం ఎంతకైనా తెగించే రాయన్ ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి. వాటిని ఎలా ఎదురించాడనేది సినిమా కథ.

రాయన్ సినిమాను చాలా మంది అగ్ర నటులతో, ఏఆర్ రెహ్మాన్ లాంటి టెక్నిషియన్స్‌తో రూపొందించడంతో బడ్జెట్ భారీగా అయిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. రిచ్‌గా క్వాలిటీ విషయంలో రాజీలేకుండా నిర్మించారు. ఇక ఈ మూవీని యూనిట్ రెమ్యునరేషన్లు, ప్రమోషన్స్‌తో కలిపి సుమారుగా 90 కోట్ల రూపాయలు అయిందని పేర్కొన్నారు.
ధనుష్ దర్శకత్వం వహించడంతో బిజినెస్ భారీగానే జరిగింది. ఈ సినిమా హక్కులు తమిళనాడులో 28 కోట్ల రూపాయలు, తెలుగులో 5 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 3 కోట్లు, ఇతర రాష్ట్రాల్లో 1.5 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 7 కోట్ల రూపాయల మేర జరిగింది. మొత్తంగా ఈ సినిమా బిజినెస్ ఓవరాల్‌గా 45 కోట్ల రూపాయల మేర జరిగింది.

రాయన్ సినిమా ప్రమోషన్స్ క్రేజీగా జరగడంతో మంచి బజ్ క్రియేట్ అయింది. దాంతో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1600 స్క్రీన్లో రిలీజ్ చేశారు. 90 కోట్ల గ్రాస్ వసూళ్ల టార్గెట్‌గా బాక్సాఫీస్ జర్నీని ప్రారంభించిన ఈ చిత్రం ధనుష్ కెరీర్‌లోనే అత్యధికంగా అడ్వాన్స్ బుకింగ్ నమోదు చేసింది.
ఇక మూవీ తొలి రోజున భారీగా ఓపెనింగ్స్ సాధించింది. తమిళంలో ఈ సినిమా 9 కోట్ల గ్రాస్, ఇండియాలో 13 కోట్ల గ్రాస్, ఓవర్సీస్ అంతా కలుపుకొని ఈ మూవీ సుమారుగా 18 నుంచి 20 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబడుతుందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.


Click it and Unblock the Notifications











