Raayan Day 2 Collections 50 కోట్లు కొల్లగొట్టిన రాయన్.. ధనుష్ మూవీకి 2 రోజుల్లో ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?
తమిళ స్టార్ హీరో ధనుష్ దర్శకత్వం వహించి నటించిన చిత్రం రాయన్. అన్నా చెల్లె, తమ్ముళ్ల మధ్య సెంటిమెంట్ దట్టించి రూపొందించిన ఈ చిత్రం జూలై 26వ తేదీన రిలీజైంది. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ రూపొందించిన ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ కళానిధి మారన్ నిర్మించారు. ఈ సినిమా రిలీజ్ తర్వాత సాధిస్తున్న వసూళ్లు, బడ్జెట్, బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? అనే వివరాల్లోకి వెళితే..
రాయన్ సినిమాను సుమారుగా 90 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందించారు.ఈ సినిమాను సుమారుగా 1600 స్క్రీన్లలో ప్రదర్శిస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే..ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 45 కోట్ల రూపాయల మేర జరిగింది. దాంతో ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే.. 46 కోట్ల షేర్, 90 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను సాధించాల్సి ఉంటుంది.

ఇక రాయన్ సినిమా తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం తమిళనాడులో 11 కోట్ల రూపాయలు, ఆంధ్రప్రదేశ్‌లో 2.5 కోట్ల రూపాయలు, కేరళలో 1 కోటి, కర్ణాటకలో 2 కోట్ల రూపాయలు, హిందీ, ఇతర ప్రాంతాల్లో 60 లక్షల గ్రాస్, ఓవర్సీస్‌లో 8 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ చిత్రం ఇండియాలో 15.5 కోట్ల గ్రాస్, ప్రపంచవ్యాప్తంగా 25 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
రాయన్ సినిమా తొలి రోజు కలెక్షన్ల తర్వాత అదే జోష్‌ను రెండో రోజు కొనసాగించింది. ఈ చిత్రం రెండో రోజున కూడా భారీ ఆక్యుపెన్సీని నమోదు చేసింది. ఈ చిత్రం మార్నింగ్ షోకు 50 శాతం, మ్యాట్నీకిి 60 శాతం, ఫస్ట్ షోకు 64 శాతం, సెకండ్ షోకు 70 శాతం ఆక్యుపెన్సీ నమోదు చేసింది. ఓవరాల్ ఈ చిత్రం రెండో రోజున 55 నుంచి 60 శాతం ఆక్యుపెన్సీ రికార్డు చేసింది.
అలాగే రాయన్ సినిమా రెండో రోజు కలెక్షన్లు వివరాల్లోకి వెళితే.. కూడా రికార్డు స్థాయి కలెక్షన్లను ధనుష్ కెరీర్‌లో నమోద చేసింది. తమిళంలో 2వ రోజు 12 కోట్ల రూపాయలు రాబట్టింది. మిగితా ప్రాంతాల్లో కలిపి ఈ సినిమా 14 కోట్ల రూపాయలు వసూలు చేసింది. రెండో రోజు కూడా 25 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను ప్రపంచవ్యాప్తంగా రాబట్టింది.
ఇక ఇండియా, ఓవర్సీస్‌లో రాయన్ సినిమా స్ట్రాంగ్‌గా వసూళ్లు సాధిస్తున్నది. ఈ చిత్రం తొలి రోజు 25 కోట్లు, రెండో రోజు కూడా 25 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ సినిమా రెండు రోజుల్లోనే 50 కోట్ల రూపాయల మైలురాయిని దాటేసింది.


Click it and Unblock the Notifications











