Raayan 3 days Collections బాక్సాఫీస్‌పై రాయన్ కలెక్షన్ల ధమాకా.. ధనుష్ మూవీకి ఎన్ని కోట్లంటే?

విలక్షణ నటుడు, తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన తాజా చిత్రం రాయన్ బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్‌గా దూసుకెళ్తున్నది. దక్షిణాదిలో అగ్ర సినీ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించిన ఈ చిత్రం భారీ వసూళ్లను రాబడుతున్నది. సందీప్ కిషన్, ఎస్‌జే సూర్య, అపర్ణ బాలమురళీకృష్ణ నటించిన ఈ సినిమా జూలై 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా గత 3 రోజుల్లో వసూలు చేసిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

రాయన్ చిత్రం తొలి రోజు ఇండియాలో 14 కోట్ల రూపాయలు రాబట్టింది. తమిళంలో 12 కోట్లు, తెలుగు 1.6 కోట్లు రాబట్టింది. ఇక రెండో రోజు ఈ చిత్రం మరో 14 కోట్ల రూపాయలు తన అకౌంట్‌లో వేసుకొన్నది. ఇక 3వ రోజు అత్యధికంగా 16 కోట్ల రూపాయలు వసూలు చేసింది. తమిళంలో 12 కోట్లు,తెలుగులో 1.5 కోట్లు రాబట్టింది.

Raayan Day 3 Expected Box Office Collections Worldwide Dhanush Movie crossed 50 Crores Club

ఇక మలయాళంలో రాయన్ సినిమాకు మంచి స్పందన లభిస్తున్నది. ఈ చిత్రం 3 రోజుల్లో 2.15 కోట్ల గ్రాస్, హిందీలో ఈ చిత్రం 1 కోటి రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ చిత్రం ఇండియాలో గత 3 రోజుల్లో దాదాపు 47 కోట్లకుపైగా గ్రాస్ కలెక్షన్లను నమోదు చేసింది.

తెలుగులో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ సుమారుగా 5 కోట్ల రూపాయల మేర జరిగింది. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల 3 రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రం గత 3 రోజుల్లో 1.8 కోట్లు, సీడెడ్‌లో 32 లక్షలు, ఉత్తరాంధ్రలో 37 లక్షలు, తూర్పు గోదావరి 20 లక్షలు, పశ్చిమ గోదావరి 8 లక్షలు, గుంటూరులో 23 లక్షలు రూపాయలు, నెల్లూరులో 12 లక్షలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా ఇప్పటి వరు 3.32 కోట్ల షేర్ వసూళ్లను రాబట్టింది.

Raayan Day 3 Expected Box Office Collections Worldwide Dhanush Movie crossed 50 Crores Club

ఓవర్సీస్‌లో రాయన్ సినిమా రికార్డు వసూళ్లను రాబడుతున్నది. ఈ చిత్రం నార్త్ అమెరికాలో 550K డాలర్లు, యూకేలో 150000 పౌండ్స్ వసూలు చేసింది. ఈ సినిమా గల్ఫ్‌లో 1 మిలియన్ డాలర్ల దిశగా ఈ సినిమా పరుగులు పెడుతున్నది. ఓవర్సీస్‌లో 15 కోట్ల రూపాయలు రాబట్టింది. దాంతో ఈ చిత్రం 52 కోట్ల రూపాయలు గ్రాస్ 43 కోట్లు నెట్ వసూలు చేసింది.

ఇక రాయన్ ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. తమిళనాడులో 28 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రా్లో 5 కోట్లు, కర్ణాటకలో 3 కోట్లు, ఇతర రాష్ట్రాలు, హిందీ రైట్స్ 1.5 కోట్లు, ఓవర్సీస్‌లో 7.5 కోట్ల మేర జరిగింది. దాంతో ఈ సినిమా 45 కోట్ల రూపాయల మేర జరిగింది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే.. కనీసం 46 కోట్ల షేర్ వసూలు చేయాల్సి ఉంటుంది. త్వరలోనే ఈ చిత్రం లాభాల్లోకి చేరే అవకాశం ఉంది.

More from Filmibeat

Read more about: raayan dhanush sandeep kishan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X