Raayan 5 days Collections: 100 కోట్లకు చేరువగా రాయన్.. ధనుష్ మూవీకి లాభాలా? నష్టాలా?
తమిళ సూపర్ స్టార్ ధనుష్ నటించిన రాయన్ సినిమా బాక్సాఫీస్ వద్ద నిలకడగా వసూళ్లను సాధిస్తున్నది. రిలీజ్ తర్వాత మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకొన్న ఈ చిత్రం వర్కింగ్ రోజున కూడా భారీ వసూళ్లు సాధించడంతో బ్లాక్ బస్టర్ దిశగా అడుగులేస్తున్నది. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించిన ఈ సినిమా జూలై 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం గత 5 రోజుల్లో వసూలు చేసిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
ప్రపంచవ్యాప్తంగా రాయన్ చిత్రం గత నాలుగు రోజుల్లో భారీగా వసూళ్లను రాబడుతున్నది. ఈ సినిమా తమిళనాడులో 38 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాల్లో 7 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 6 కోట్ల రూపాయలు, కేరళలో 3 కోట్ల రూపాయలు, మిగితా రాష్ట్రాల్లో 2 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 56 కోట్ల రూపాయలు ఇండియాలో రాబట్టింది.

ఇక ధనుష్ మూవీ 5వ రోజున కూడా స్ట్రాంగ్‌గా బాక్సాఫీస్ వద్ద కనిపించింది. ఈ చిత్రం 5వ రోజున ఇండియాలో 6 కోట్ల రూపాయలు, ప్రపంచవ్యాప్తంగా 7 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. తమిళంలో 3.5 కోట్లు, తెలుగులో 1 కోటి రూపాయలు, కన్నడ, కేరళ, హిందీ ప్రాంతాల్లో కలిపి 1.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
ఓవర్సీస్‌లో రాయన్ చిత్రం అత్యధిక వసూళ్లను రాబడుతున్నది. అమెరికాలో ఈ మూవీ తాజాగా 500K డాలర్లను, ఓవర్సీస్ మొత్తంగా 3 మిలియన్ మార్క్‌ను దాటింది. నార్త్ అమెరికా, ఇతర దేశాల్లో కలుపుకొని ఈ చిత్రం 30 కోట్ల రూపాయలను వసూలు చేసింది. దాంతో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 93 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది.

అన్నాదమ్ములు, చెల్లెలి మధ్య జరిగే ఎమోషనల్ స్టోరితో రూపొందిన రాయన్ సినిమాను సుమారుగా 90 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను సుమారుగా 1600 స్క్రీన్లలో ప్రదర్శిస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే..ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 45 కోట్ల రూపాయల మేర జరిగింది. దాంతో ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే.. 46 కోట్ల షేర్, 90 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను సాధించాల్సి ఉంటుంది. దాదాపు ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించిందని ట్రేడ్ వర్గాలు ధృవీకరిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











