Raayan 13 Days Collections: చరిత్ర సృష్టించిన రాయన్.. టాప్ మూవీగా రికార్డు.. ధనుష్ లాభం చూశారంటే!
దక్షిణ భారతదేశం నుంచి ఇప్పుడు చాలా మంది పాన్ ఇండియా హీరోలు ఉన్నారు. కానీ, కొన్నేళ్ల క్రితమే దేశ వ్యాప్తంగా క్రేజ్‌ను, మార్కెట్‌ను సొంతం చేసుకున్న హీరోలు మాత్రం కొందరే ఉన్నారు. వారిలో కోలీవుడ్ స్టార్ ధనుష్ ఒకడు. వరుస చిత్రాలతో సందడి చేస్తోన్న అతడు.. ఇటీవలే 'రాయన్' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి అన్ని చోట్లా అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తోంది. ఫలితంగా ఈ చిత్రం భారీ స్థాయిలో వసూళ్లను రాబడుతూ దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో 'ధనుష్' రాయన్ మూవీ 13 రోజుల బాక్సాఫీస్ వసూళ్లను మీరే చూడండి!
రాయన్‌గా వచ్చేసిన ధనుష్
తమిళ స్టార్ ధనుష్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన మాస్ సినిమానే 'రాయన్' (Raayan). దీనికి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజ్ చేశారు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించిన ఈ సినిమాలో తెలుగు హీరో సందీప్ కిషన్ మరో కీలక పాత్రను పోషించాడు. అలాగే, ప్రకాశ్ రాజ్, ఎస్‌జే సూర్య, సెల్వ రాఘవన్, అపర్ణ బాలమురళిలు కీలక పాత్రల్లో నటించారు.

రాయన్ సినిమాకు బిజినెస్
కోలీవుడ్ స్టార్ ధనుష్ 'రాయన్' సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉండడంతో ఇది ఆరంభంలో అందరి దృష్టినీ ఆకర్షించింది. దీంతో ఈ సినిమా హక్కులకు అన్ని ప్రాంతాల్లో భారీ డిమాండ్ ఏర్పడింది. తెలుగు రాష్ట్రాల్లో రూ. 5.00 కోట్లు, తమిళంతో సహా మిగిలిన అన్ని ప్రాంతాలూ కలిపి రూ. 40 కోట్లు బిజినెస్ అయింది. ఇలా మొత్తంగా రూ. 45.00 కోట్లు బిజినెస్ చేసింది.
13వ రోజు తెలుగు కలెక్షన్లు
సుదీర్ఘ కాలంగా తనదైన చిత్రాలతో సందడి చేస్తోన్న ధనుష్ హీరోగా నటించడంతో పాటు తెరకెక్కించిన 'రాయన్' సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి స్పందన కూడా లభిస్తోంది. అయితే, 13 రోజు మాత్రం ఈ చిత్రానికి రెస్పాన్స్ బాగా డౌన్ అయింది. ఫలితంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి ఈ సినిమా రూ. 10 లక్షలు షేర్ మాత్రమే వసూలు అయింది.

13 రోజుల్లో తెలుగు వసూళ్లు
ఆంధ్రా, తెలంగాణలో ధనుష్ 'రాయన్' మూవీ 13 రోజుల్లో సత్తా చాటింది. ఫలితంగా నైజాంలో రూ. 3.18 కోట్లు, సీడెడ్‌లో రూ. 74 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 73 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 41 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 29 లక్షలు, గుంటూరులో రూ. 49 లక్షలు, కృష్ణాలో రూ. 47 లక్షలు, నెల్లూరులో రూ. 27 లక్షలతో.. రూ. 6.58 కోట్లు షేర్, రూ. 12.80 కోట్లు గ్రాస్ వచ్చింది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంత?
'రాయన్' మూవీ ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటింది. దీంతో 13 రోజుల్లో తెలుగులో రూ. 12.80 కోట్లు, తమిళంలో రూ. 66.80 కోట్లు, కర్నాటకలో రూ. 9.50 కోట్లు, కేరళలో రూ. 5.10 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 3.35 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 37.90 కోట్లు గ్రాస్ వసూలైంది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా రూ. 135.45 కోట్లు గ్రాస్, రూ. 64.10 కోట్లు షేర్ వచ్చింది. తద్వారా కమల్ హాసన్ నటించిన 'ఇండియన్ 2' మూవీ లైఫ్ టైం కలెక్షన్లను దాటింది. తద్వారా 2024లో తమిళం అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా నిలిచింది.

మూవీకి లాభం ఎంతంటే
'రాయన్' మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 45 కోట్ల బిజినెస్ చేసుకుని రూ. 46 కోట్లు షేర్ టార్గెట్‌తో వచ్చింది. ఇది 13 రోజుల్లో రూ. 64.10 కోట్లు రాబట్టింది. అంటే.. హిట్ స్టేటస్‌తో పాటు రూ. 18.10 కోట్లు లాభాలు తెచ్చుకుంది. అలాగే, తెలుగులో రూ. 5 కోట్లు బిజినెస్.. రూ. 5.50 కోట్లు టార్గెట్‌తో వచ్చింది. 13 రోజుల్లో ఇది రూ. 6.58 కోట్లు రాబట్టడంతో రూ. 1.08 కోట్లు లాభాలు అందుకుంది.


Click it and Unblock the Notifications











