'రభస' మొట్టమెదటి షో ఎక్కడ...ఎన్నింటికి

By Srikanya

హైదరాబాద్: ఈ వినాయక చవితికి ఎన్టీఆర్‌ 'రభస' చేయబోతున్నాడు. ఆ రభస ఏ రేంజిలో ఉంటుందా అని అభిమానులంతా వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం మొదటి షో ఎప్పుడు పడుతుందా...ఎన్నింటికి వేస్తారా...ఎక్కడ ఏ థియోటర్ లో వేస్తారా అనేది అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది. ఆ వివరాలు మేం ఇస్తున్నాం. ఈ చిత్రం మొదటి షో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తాత్కాలిక రాజధాని విజయవాడలో వేస్తున్నారు. ఫ్యాన్స్ బెనిఫిట్ షో ...12:30 మొదలు కానుంది.

ఇక హైదరాబాద్ విషయానికి వస్తే... అబిమానులకు కుకుట్ పల్లి విశ్వనాధ్ థియోటర్ లో వేస్తున్నారు. అయితే ఉదయం ఏడు గంటలకు షో ప్రారంభం కానుందని సమాచారం. మిగతా చోట్ల థియోటర్ టైమింగ్ లను బట్టి షోలు పడతాయి. అంటే తెల్లారేసరికి సినిమా రిజల్ట్ వచ్చేస్తుంది అన్నమాట.

Rabhasa to be screened first at Vijayawada

ఇక 'బాద్‌షా' తరవాత ఆ స్థాయి విజయం ఎన్టీఆర్‌కి దక్కలేదు. అయినా ఎన్టీఆర్‌ సినిమాపై ఉన్న ఇమేజ్‌ చెక్కుచెదరలేదు. శాటిలైట్‌ రూపంలో ఈ చిత్రానికి రూ. తొమ్మిది కోట్లు దక్కినట్టు మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. దాదాపు రూ.50 కోట్ల వ్యయంతో తెరకెక్కిన 'రభస' అభిమానుల అశల్ని నిజం చేస్తే అంతకు మించిన వసూళ్లు రాబట్టేయగలదు.

''బాద్‌షా' ఓవర్సీస్‌లో మంచి ఫలితాన్ని రాబట్టింది. కుటుంబ అంశాలు మేళవించిన 'రభస'కీ అంతే మంచి స్పందన వచ్చే అవకాశం ఉంద''ని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రంపై ఇప్పటికే పాజిటివ్ బజ్ అంతటా ఉంది. సినిమా ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని అంతటా అంచనాలు ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X