‘రభస’ కలెక్షన్స్ పరిస్ధితి ఏంటి?
హైదరాబాద్ : బెల్లంకొండ సురేష్ సమర్పణలో యువ నిర్మాత బెల్లంకొండ గణేష్‌బాబు శ్రీలక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించిన భారీ చిత్రం 'రభస' ఈ చిత్రం ఆగస్ట్ 29న వరల్డ్‌వైడ్‌గా విడుదల అయ్యింది. ఎన్టీఆర్, సమంత, ప్రణీత కాంబినేషన్ లో రూపొందిన ఈ చిత్రం మార్నింగ్ షో కే డివైడ్ టాక్ తెచ్చుకున్నా వీకెండ్స్ లో కలెక్షన్స్ కు లోటు ఉండదని భావించారు.
అయితే ట్రేడ్ లో అందుతున్న సమాచారం ప్రకారం...ఆశ్చర్యంగా ఆదివారం సైతం ఈ చిత్రం కలెక్షన్స్ పడిపోయాయి. రిలీజైన మరుసటి రోజు అంటే శని, ఆదివారాలలో గ్రాడ్యూవల్ గా డ్రాప్ అవటం మొదలెట్టింది. దాంతో ఈ చిత్రం ఏ మేరకు రన్ ఉంటుందనేది ఇప్పుడు కొన్నవారిలో ప్రశ్నార్దకంగా మారింది. ఆంధ్రా,తెలంగాణ కలిపి ఈ చిత్రం ఆదివారం కేవలం 2.9 కోట్లు మాత్రమే కలెక్టు చేయటం ఆందోళన కలిగించే అంశం.
రిలీజ్ కు ముందు..

బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ-''ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఆడియో చాలా పెద్ద హిట్ అయింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాడిన 'రాకాసి రాకాసి' ఈ ఆడియోకి హైలైట్ సాంగ్‌గా నిలిచింది. ఆదిలాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత మా లక్ష్మీనరసింహ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో యంగ్‌టైగర్ ఎన్టీఆర్‌తో చేస్తున్న ఈచిత్రం అభిమానుల్ని, ప్రేక్షకుల్ని, విశేషంగా ఆకట్టుకుంటుంది. ఎన్టీఆర్ కెరీర్‌లో, మా బ్యానర్‌లో ఇది సెన్సేషనల్ హిట్ సినిమా అవుతుంది'' అన్నారు.
డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్ మాట్లాడుతూ- యూత్‌పుల్, మాస్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న 'రభస' ప్రతి ఒక్కరిని అలరిస్తుంది. ఎన్టీఆర్ రభసలో పక్కా మాస్ లుక్‌తో వుంటారు, అలాగే ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఆకట్టుకునేలా వుంటారు. ఎన్టీఆర్ ఈ మూడు జోన్స్‌ని టార్గెట్ చేసి తీస్తున్న సినిమా రభస. రెండున్నర గంటల సేపు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి చూసి ఎంజాయ్ చేసి అందరూ అయిదార్లుసార్లు చూసేంత ఎంటర్‌టైనింగ్‌గా వుంటుంది. బెల్లం కొండ సురేష్‌గారి రేంజ్ మేకింగ్‌లో ఈ సినిమాలో కనిపిస్తుంది'' అన్నారు.
ఎన్టీఆర్ సరసన సమంత హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో ప్రణీత మరో హీరోయిన్. బ్రహ్మనందం,ఆలీ, బ్రహ్మాజీ, నాజర్, జయసుధ, సీత, జయప్రకాశ్‌రెడ్డి, మీనా తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.


Click it and Unblock the Notifications











