twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రోజు రోజుకీ డౌన్: ‘రభస’ 6 డేస్ కలెక్షన్స్

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన ‘రభస' చిత్రం ఓపెనింగ్స్ బాగానే సాధించినా....మిక్డ్స్ టాక్ రావడంతో కలెక్షన్ల పరిస్థితి రోజు రోజుకు దిగజారుతోంది. ఆగస్టు 29న విడుదలైన ఈచిత్రం ఆశించిన స్థాయిలో కలెక్షన్లు సాధించడం లేదు. అయితే రభసకు పోటీగా ఇతర స్టార్ హీరోల పెద్ద సినిమాలేవీ ప్రస్తుతానికి థియేటర్లలోలేక పోవడం ఈ చిత్రానికి కాస్త ఊరట నిచ్చే అంశంగా చెప్పొచ్చు. ఈనెల 5న విడుదల కావాల్సిన ‘పవర్' చిత్రం కూడా మరో వారినికి వాయిదా పడటం కలిసొస్తుందని భావిస్తున్నారు.

    ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న అంచనాల ప్రకారం గడిచిన ఆరు రోజుల్లో ‘రభస' కలెక్షన్ల పరిస్థితి ఈ క్రింది విధంగా ఉంది.

    Rabhasa first 6 days collections

    నైజాం : రూ. 5. 34 కోట్లు
    సీడెడ్: రూ. 3.55 కోట్లు
    వైజాగ్: రూ. 1.68 కోట్లు
    వెస్ట్ గోదావరి: రూ. 98 లక్షలు
    ఈస్ట్ గోదావరి: రూ. 1.37 కోట్లు
    గుంటూరు : రూ. 2 కోట్లు
    కృష్ణ : రూ. 1.12 కోట్లు
    నెల్లూరు : రూ. 70 లక్షలు

    ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వసూలైన మొత్తం దాదాపు రూ. 16 కోట్లు. ఇందులో ఎక్కువ శాతం మొటి మూడు రోజుల్లో వసూలైన ఓపెనింగ్ కలెక్షన్లే కావడం గమనార్హం. సినిమా విడుదలకు ముందు పబ్లిసిటీ బాగా చేయడంతో అంచనాలు పెరిగాయి. అయితే సినిమా కథ,కథనం ఆశించిన స్థాయిలో లేక పోవడంతో యావరేజ్ రేటింగ్ సొంతం చేసుకుంది.

    ఎన్టీఆర్ సరసన సమంత హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో ప్రణీత మరో హీరోయిన్. బ్రహ్మనందం,ఆలీ, బ్రహ్మాజీ, నాజర్, జయసుధ, సీత, జయప్రకాశ్‌రెడ్డి, మీనా తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు.

    English summary
    Jr NTR, Samantha, Pranitha starrer Rabhasa after Opening to the Year`s Biggest Revenues Friday has started off and this Movie now dipped all time low in all the areas.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X