రేస్ 3: యావరేజ్ టాక్ వచ్చినా వసూళ్లు అదరగొడుతోంది
Recommended Video

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన 'రేస్ 3' మూవీ ఇండియాలో అదిరిపోయే కలెక్షన్లతో దూసుకెళుతోంది. కలెక్షన్ల పరంగా తానే బాలీవుడ్ రియల్ సికిందర్ అని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. రెమో డిసౌజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ యావరేజ్ టాక్‌లోనూ భారీ ఓపెనింగ్స్ సాధించింది. తొలి మూడు రోజుల్లోనే 100 కోట్లు వసూలు చేసింది. అంతే కాదు పలు బాలీవుడ్ రికార్డులను ఈ చిత్రం బద్దలు కొట్టింది. కేవలం సల్మాన్ ఖాన్ మీద ఉన్న క్రేజ్ వల్లే ఇది సాధ్యమైందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

భారీ కలెక్షన్
రేస్ 3 మూవీ తొలి రోజు రూ. 29.17 కోట్లు వసూలు చేసింది. మర్నాడు ఈద్ పండగ హాలిడే కావడం కూడా బాగా కలిసొచ్చింది. దీంతో శనివారం రోజు రూ. 38.14 కోట్లు రాబట్టింది. ఇదే జోరు ఆదివారం కూడా కంటిన్యూ అయి రూ. 38.16 కోట్లు రాబట్టింది. దీంతో తొలి మూడు రోజుల్లో రూ. 106.47 కోట్లు రాబట్టింది.

సల్మాన్ ఖాన్‌కు ఇది కొత్తేం కాదు
సల్మాన్ ఖాన్ మూవీ తొలి మూడు రోజుల్లో రూ. 100 కోట్లు అందుకోవడం ఇది నాలుగోసారి. గతంలో ఆయన నటించిన బజరంగీ భాయిజాన్, సుల్తాన్, టైగర్ జిందా హై చిత్రాలు తొలి మూడు రోజుల్లోనే ఈ ఫీట్ సాధించాయి.

సెకండ్ బిగ్గెస్ట్ మూవీ
2018లో విడుదలైన సినిమాల్లో..... రేస్ 3 మూవీ సెకండ్ బిగ్గెస్ట్ వీకెండ్ ఓపెనర్ గా నిలిచింది. మొదటి స్థానంలో రూ. 114 కోట్లతో ‘పద్మావత్' ఉండగా... రేస్ 3 తర్వాతి స్థానంలో రూ. 73.10 కోట్లతో బాగీ, రూ. 41.01 కోట్లతో రైడ్, రూ. 40.05 కోట్లతో పాడ్‌మ్యాన్ చిత్రాలు ఉన్నాయి.

సల్మాన్ సెకండ్ బిగ్గెస్ట్ వీకెండ్ ఈద్ గ్రాసర్
ఈద్ సందర్భంగా విడుదలైన సల్మాన్ ఖాన్ సినిమాల్లో సెకండ్ బిగ్గెస్ట్ వీకెండ్ గ్రాసర్‌గా ‘రేస్-3' నిలిచింది. రూ. 180 కోట్లతో సుల్తాన్ మూవీ మొదటి స్థానంలో ఉంది.

రూ. 100 కోట్ల మార్కును అందుకున్నసల్మాన్ 13వ మూవీ
సల్మాన్ కెరీర్లో రూ. 100 కోట్ల మార్కును అందుకున్న 13వ చిత్రంగా ‘రేస్-3' నిలిచింది. ఇంతకు ముందు ఆయన నటించిన దబాంగ్, రెడీ, బాడీగార్డ్, దబాంగ్ 2, ఏక్ థా టైగర్, బజరంగీ భాయిజాన్, జైహో, కిక్, సుల్తాన్, ప్రేమ్ రతన్ ధన్ పాయో, ట్యూబ్ లైట్, టైగర్ జిందామై చిత్రాలు రూ. 100 కోట్ల మార్కును అందుకున్నారు.


Click it and Unblock the Notifications











