వావ్...‘రేసు గుర్రం’ 4 వీక్స్ కలెక్షన్స్ సూపర్
హైదరాబాద్: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, శృతి హాసన్ జంటగా నటించిన 'రేసు గుర్రం' చిత్రం ఏప్రిల్ 10న విడుదలై విజయవంతంగా బాక్సాఫీసు వద్ద 4 వారాలు పూర్తి చేసుకుంది. తొలి రోజు నుండే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈచిత్రం దుమ్మురేపే కలెక్షన్లు సాధిస్తూ కేవలం 3 వారాల్లోనే రూ. 50 కోట్లు వసూలు చేసిన సినిమాల జాబితాలో చేరింది.
'రేసు గుర్రం' హవా సాగుతున్న రోజుల్లో 'కొత్త జంట', 'అనామిక' లాంటి చిత్రాలు విడుదలైనా ఈ చిత్రంపై పెద్దగా ప్రభావం చూపలేక పోయాయి. నాలుగు వారంలోనూ ఈచిత్రం నిర్మాతలకు లాభాలు కురిపిస్తూ సాగింది. హీరో అల్లు అర్జున్, దర్శకుడు సురేందర్ రెడ్డి కెరీర్లో ఈ చిత్రం బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలిచింది.

4 వారాలు పూర్తయ్యే నాటికి 'రేసు గుర్రం' చిత్రం రూ. 54.31 కోట్లు వసూలు చేసింది. నైజాం ఏరియాలో అత్యధికంగా రూ. 16.69 కోట్లు వసూలు చేసింది. సీడెడ్ ఏరియాలో రూ. 7.42 కోట్లు, వైజాగ్ ఏరియాలో రూ. 4.40 కోట్లు, ఈస్ట్‌లో రూ. 2.56 కోట్లు, వెస్ట్‌లో రూ. 2.21 కోట్లు, కృష్ణాలో రూ. 2.27 కోట్లు, గుంటూరులో రూ. 3.40 కోట్లు, నెల్లూరులో రూ. 1.76 కోట్లు, కర్ణాటకలో రూ. 4.99 కోట్లు, యూఎస్ఏలో రూ. 7.42 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.20 కోట్లు వసూలు చేసింది.
రేసు గుర్రం చిత్రంలో కోట శ్రీనివాసరావు, సుహాసిని మణిరత్నం, ప్రకాష్‌రాజ్, అలీ, ఎమ్మెస్ నారాయణ, రఘుబాబు, ముఖేష్‌రుషి, ఆశిష్ విద్యార్థి, నవాజ్ సోనూ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి రచన: వక్కంతం వంశీ, కెమెరా: మనోజ్ పరమహంస, సంగీతం: ఎస్.తమన్, కూర్పు: గౌతంరాజు, నిర్మాతలు: నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి), డా.కె.వెంకటేశ్వరరావు, నిర్మాణ సంస్థ: శ్రీలక్ష్మీనరసింహా ప్రొడక్షన్స్, దర్శకత్వం: సురేందర్ రెడ్డి.


Click it and Unblock the Notifications











