‘రేసు గుర్రం’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ కేక, ఎన్ని కోట్లో తెలుసా?
హైదరాబాద్: అల్లు అర్జున్, శృతి హాసన్ జంటగా నటించిన 'రేసు గుర్రం' చిత్రం బాక్సాఫీసు వద్ద దుమ్ము రేపుతోంది. సురేందర్ రెడ్డి దర్వకత్వంలో నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి), డా.కె.వెంకటేశ్వరరావు నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద తన సత్తా చాటుతోంది. తాజాగా ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద వారం రోజులు పూర్తి చేసుకుంది.
1000కి పైగా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం తొలి వారం పూర్తయ్యే నాటికి ట్రేడ్ నిపుణులు ఆశ్చర్య పోయేలా కలెక్షన్స్ సాధించింది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం ఈ చిత్రం తొలి వారం రోజుల్లో రూ. 34.10 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఏరియా వారిగా వివరాలు ఇలా ఉన్నాయి.

నైజాం ఏరియా : రూ. 8.40 కోట్లు
సీడెడ్ ఏరియా : రూ. 4.57 కోట్లు
వైజాగ్ ఏరియా: రూ. 2.52 కోట్లు
ఈస్ట్ గోదావరి : రూ. 1.49 కోట్లు
వెస్ట్ గోదావరి : రూ. 1.32 కోట్లు
కృష్ణ ఏరియా : రూ. 1. 45 కోట్లు
గుంటూరు : రూ. 2.25 కోట్లు
నెల్లూరు : రూ. 1.10 కోట్లు
కర్ణాటక ఏరియా: రూ. 3.25 కోట్లు
రెస్టా ఇండియాలో రూ. కోటికి పైగా
యూఎస్ఏలో : రూ. 6.75 కోట్లు
అల్లు అర్జున్ నటించిన 'రేసు గుర్రం' చిత్రం ఈ సంవత్సరం అత్యధికంగా ఓపెనింగ్స్ సాధించిన చిత్రాల్లో తొలి స్థానంలో నిలిచింది. తొలి మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఈచిత్రం రూ. 22.64 కోట్ల షేర్ సాధించింది. ఇంతకు ముందు ఈ రికార్డు రామ్ చరణ్ నటించిన 'ఎవడు' చిత్రం పేరుపై ఉండేది. మొన్న సంక్రాంతికి విడుదలైన 'ఎవడు' చిత్రం తొలి మూడు రోజుల్లో రూ. 21. 65 కోట్ల షేర్ సాధించింది. 'రేసు గుర్రం' దెబ్బకు 'ఎవడు' చిత్రం రికార్డు బద్దలు కాక తప్పలేదు. అయితే మెగా హీరో రికార్డు మరో మెగా హీరో బద్దలు కొట్టడంపై మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
సినిమాలో అల్లు అర్జున్ క్యారెక్టరైజేషన్, శృతి హాసన్ గ్లామర్, కిల్ బిల్ పాండేగా బ్రహ్మానందం పండించిన కామెడీ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచుతున్నాయి. గతంలో 'కిక్' లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు సురేందర్ రెడ్డి 'కిక్' చిత్రం తరహాలో పూర్తిగా కామెడీతో చిత్రాన్ని పరుగెత్తించి సఫలం అయ్యాడు. ఫస్టాఫ్ లో ఫ్యామిలీలను టార్గెట్ చేస్తూ రాసుకున్న సీన్స్ కూడా నీట్ గా ఉన్నాయి.


Click it and Unblock the Notifications











