'రేసు గుర్రం' ఆడియో రైట్స్ ఎవరికి? ఎంతకి??
హైదరాబాద్ : పెద్ద హీరోల ఆడియో రైట్స్ కు ఉండే క్రేజే వేరు. అందుకోసం పెద్ద మొత్తాలని చెల్లించటానికి ఆడియో కంపెనీలు ఎగబడతాయి. వారికి కూడా ఆ ఆడియో సేల్స్ పై మంచి లాభాలు వస్తూంటాయి. తాజాగా అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం 'రేసు గుర్రం' ఆడియో మంచి రేటుకి అమ్ముడుపోయినట్లు ఫిల్మ్ నగర్ సమాచారం. లహరి ఆడియో కంపెనీ వారు ఈ రైట్స్ ని సొంతం చేసుకున్నట్లు ట్రేడ్ టాక్. ఈ మేరకు 54 లక్షలు చెల్లించారు.
ఈ చిత్రానికి సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరి కలయికలో వస్తున్న తొలి సినిమా ఇదే. నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), డా.కె.వెంకటేశ్వరరావు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్ పై మంచి అంచనాలే ఉన్నాయి.ఈ చిత్రంలో పోలీస్ అధికారి అయిన అన్న కోసం తమ్ముడు అల్లు అర్జున్ చేసే సాహసాల సమాహారమే చిత్రం అంటున్నారు. అన్నకోసం ఓ పరవ్ ఫుల్ పొలిటీషన్ ని ఎదిరించి,అతన్ని ఓ రేంజిలో ఢీ కొనే సీన్స్ తో కథ సాగుతుందని ఫిల్మ్ సర్కిల్స్ లో ఈ కథ గురించి చెప్పుకుంటున్నారు. బాధ్యతాయుతమైన ఓ యువకుని కథాంశంతో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ శక్తిమంతమైన పాత్ర పోషిస్తున్నారు.

దర్శకుడు సురేంద్రరెడ్డి మాట్లాడుతూ... పోటీలో అలసత్వానికి చోటు లేదు. చూద్దాం, చేద్దాం అంటే కుదరదు. మరొకడు.. మనల్ని దాటుకొంటూ పోతాడు. రేసు మొదలైందంటే.. పూర్తయ్యే వరకూ దౌడు తీయాల్సిందే. అతనూ అదే చేశాడు. అనుకొన్న లక్ష్యాన్ని చేరుకొనే వరకూ పట్టువీడని పోరాటం చేశాడు. ఇంతకీ ఈ రేసు ఎవరి కోసం, ఎందుకోసం..? తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే అంటున్నారు.
ఇద్దరమ్మాయిలతో... సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం చెందిన తరువాత బన్ని చేస్తున్న సినిమా ఇది. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని భావిస్తున్నాడు. అలాగే ఊసరవెల్లి సినిమా తరువాత సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో వస్తున్న సినిమా ఇది. ఇతనికీ ఈ సినిమా విజయం ఎంతో అవసరం ఉంది. ఎందుకంటే ఊసరవెల్లి అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది.ఈ చిత్రంలో సలోని సెకండ్ హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ చిత్రానికి కథ : వక్కతం వంశీ, సంగీతం : తమన్, సినిమాటోగ్రఫీ : మనోజ్ పరమహంస, ఎడిటింగ్ : గౌతం రాజు, నిర్మాతలు : నల్లమలుపు శ్రీనివాస్, వెంకటేశ్వర రావు, దర్శకత్వం : సురేందర్ రెడ్డి.


Click it and Unblock the Notifications











