Don't Miss!
- Lifestyle పురుషుల్లో ఈ లక్షణాలు ఉంటే.. ఖచ్చితంగా డిప్రెషన్‌కు గురైనట్టే..!
- Automobiles కారులో ఎక్కువ సౌండ్‌తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- News మండుటెండల్లో నారాయణ విద్యాసంస్థల సిబ్బందికి ఎన్నికల కష్టం!!
- Sports T20 వరల్డ్ కప్‌కు భారత తుదిజట్టు ఇదే - సెహ్వాగ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
రేసు గుర్రంలా వచ్చాడు...రామ్ చరణ్ రికార్డు బద్దల్
హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పేరు మీద ఉన్న రికార్డును.... రేసు గుర్రంలా దూసుకొచ్చిన అల్లు అర్జున్ బద్దలు కొట్టాడు. అల్లు అర్జున్ నటించిన 'రేసు గుర్రం' చిత్రం ఈ సంవత్సరం అత్యధికంగా ఓపెనింగ్స్ సాధించిన చిత్రాల్లో తొలి స్థానంలో నిలిచింది. తొలి మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఈచిత్రం రూ. 22.64 కోట్ల షేర్ సాధించింది.
ఇంతకు ముందు ఈ రికార్డు రామ్ చరణ్ నటించిన 'ఎవడు' చిత్రం పేరుపై ఉండేది. మొన్న సంక్రాంతికి విడుదలైన 'ఎవడు' చిత్రం తొలి మూడు రోజుల్లో రూ. 21. 65 కోట్ల షేర్ సాధించింది. 'రేసు గుర్రం' దెబ్బకు 'ఎవడు' చిత్రం రికార్డు బద్దలు కాక తప్పలేదు. అయితే మెగా హీరో రికార్డు మరో మెగా హీరో బద్దలు కొట్టడంపై మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
"రేసు గుర్రం" 1050 థియోటర్స్ తో ప్రపంచవ్యాప్తంగా మొన్న శుక్రవారం విడుదల అయ్యింది. మార్నింగ్ షోకే ఈ చిత్రం హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. అలాగే ఓపినింగ్స్ సైతం అల్లు అర్జున్ కెరీర్ లో బెస్ట్ అన్న రీతిలో వచ్చాయి. ఇప్పుడు వీకెండ్ కలెక్షన్స్ (మూడు రోజులు) లో కూడా ఈ సంవత్సరం బెస్ట్ కలెక్షన్స్ కలెక్టు చేసి రికార్డు క్రియేట్ చేసిందంటున్నారు. ఏపీ /నైజాంలో 15.5 కోట్ల షేర్, ప్రపంచవ్యాప్తంగా 22.64Cr షేర్ సాధించిందని ట్రేడ్ వర్గాల అంచనా.
సినిమాలో అల్లు అర్జున్ క్యారెక్టరైజేషన్, శృతి హాసన్ గ్లామర్, కిల్ బిల్ పాండేగా బ్రహ్మానందం పండించిన కామెడీ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచుతున్నాయి. గతంలో 'కిక్' లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు సురేందర్ రెడ్డి 'కిక్' చిత్రం తరహాలో పూర్తిగా కామెడీతో చిత్రాన్ని పరుగెత్తించి సఫలం అయ్యాడు. ఫస్టాఫ్ లో ఫ్యామిలీలను టార్గెట్ చేస్తూ రాసుకున్న సీన్స్ కూడా నీట్ గా ఉన్నాయి.