twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కారణం ఏదైనా "రేసు గుర్రం" కలెక్షన్స్ పరిస్ధితి ఇదీ

    By Srikanya
    |

    హైదరాబాద్: అల్లు అర్జున్ తాజా చిత్రం "రేసు గుర్రం" టైటిల్ కి తగ్గట్లే భాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఈ చిత్రం కలెక్షన్స్ బట్టి సూపర్ హిట్ క్రింద డిక్లేర్ చేసారు ట్రేడ్ పండితులు. రెండు వారాలకే ప్రపంచవ్యాప్తంగా 43.45 కోట్ల షేర్ సాధించింది రికార్డు క్రియేట్ చేసిందీ ఈ చిత్రం. మూడో వారంలోనూ రచ్చ రికార్డు 45 కోట్లును దాటి ఆల్ టైమ్ రికార్డుని క్రియేట్ చేసిందని చెప్తున్నారు. ఈ సంవత్సరం ఇప్పటివరకూ రిలీజైన చిత్రాల్లో రేసు గుర్రం ఎక్కువ కలెక్టు చేసిన చిత్రంగా నమోదు అవుతోంది.

    ఇదే స్పీడులో దూసుకుపోతే యాభై కోట్లు అనేది పెద్ద విషయం కాదు అంటున్నారు. ఈ చిత్రం ఇంత విజయానికి కారణాల్లో ప్రధానమైనది మార్కెట్ లో మరో చిత్రం పోటీ లేకపోవటమే అని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. కారణం ఏదైనా రేసుగుర్రం కు అన్నీ కలిసివచ్చాయి. కేవలం క్లైమాక్స్ నిలబెట్టింది అన్నా ప్రేక్షకుడుకి అవేమీ పట్టడం లేదు. సినిమాని ముందుకు తీసుకువెళ్తూనే ఉన్నారు.

    Race Gurram become Biggest Earner of the Year

    ఇక ఈ చిత్రం కథ ఏమిటంటే.... అన్నదమ్ములైన రామ్(శ్యామ్),లక్ష్మణ్ అలియాస్ లక్కీ(అల్లు అర్జున్) చిన్నప్పటి నుంచి టామ్ అండ్ జెర్రీ తరహాలో కొట్టుకుంటూ ఎదుగుతారు. పెద్దయ్యాక ఎసిపి గా ఎదిగిన రామ్ ... తన నిజాయితీతో లోకల్ రాజకీయనాయకుడు శివారెడ్డి(రవికిషన్) కి సమస్యగా మారతాడు. అతనికి వ్యతిరేకంగా సాక్ష్యం సంపాదిస్తాడు. దాంతో శివారెడ్డి అతన్ని అడ్డు తప్పించుకోవాలనుకుంటాడు. ఆ విషయం తెలిసిన తమ్ముడు లక్కీ ఏం చేసాడు. తన అన్నను ఎలా ఆ కుటిల రాజకీయనాయకుడు నుంచి రక్షించాడు...ఆ క్రమంలో కిల్ బిల్ పాండే(బ్రహ్మానందం) ఎలా ఉపయోగపడ్డాడు అన్నది మిగతా కథ. అలాగే...లక్కీ తొలిచూపులోనే ప్రేమలో పడిన స్పందన(శృతి హాసన్)ని ఎలా దక్కించుకున్నాడు...సినిమాలో సలోని పాత్ర ఏమిటి అన్నది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

    స్టోరీ లైన్ గా సునీల్, నాగచైతన్య నటించిన 'తడాఖా' గుర్తుకు వచ్చినా దాన్ని విభిన్నమైన క్యారెక్టరైజేషన్స్, కామెడీ సన్నివేశాలతో మైమరిపించగలిగారు. ఫక్తు కామెడీ వ్యవహారం కావటంతో ట్విస్ట్ లు లేకపోవటమే కలిసివచ్చింది. 'కిక్' చిత్రం తరహాలో పూర్తిగా కామెడీతో చిత్రాన్ని పరుగెత్తించాలన్న దర్శకుడు నిర్ణయం సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. ఫస్టాఫ్ లో ఫ్యామిలీలను టార్గెట్ చేస్తూ రాసుకున్న సీన్స్ కూడా నీట్ గా ఉన్నాయి. కిల్ బిల్ పాండే గా బ్రహ్మానందం మరోసారి విజృంభించాడు. అలీ.. 'బాలీ ఫ్రమ్ మలేషియా'(కిక్ లో పాత్ర కంటిన్యూషన్) గా బాగా నవ్వించాడు. అలాగే యాక్షన్ ఎపిసోడ్స్ బాగా డిజైన్ చేసారు అదే సినిమాకు కలిసి వచ్చిందంటున్నారు.

    కోట శ్రీనివాసరావు, ప్రకాష్‌రాజ్, అలీ, ఎమ్మెస్ నారాయణ, రఘుబాబు, ముఖేష్‌రుషి, ఆశిష్ విద్యార్థి, నవాజ్ సోనూ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి రచన: వక్కంతం వంశీ, కెమెరా: మనోజ్ పరమహంస, సంగీతం: ఎస్.తమన్, కూర్పు: గౌతంరాజు, నిర్మాతలు: నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి), డా.కె.వెంకటేశ్వరరావు, నిర్మాణం: శ్రీలక్ష్మీనరసింహా ప్రొడక్షన్స్.

    English summary
    By collecting 43.45Cr Share in 2 weeks worldwide Race Gurram is now 11th Highest Ever Earner for Tollywood. Race Gurram is highly likely to become the biggest earner of the year so far overtaking Yevadu, probably in 3weeks.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X