కలెక్షన్స్: అల్లు అర్జున్ మహేష్ బాబును దాటేసాడ్రోయ్!

By Bojja Kumar

హైదరాబాద్: అల్లు అర్జున్ నటించిన 'రేసు గుర్రం' చిత్రం కలెక్షన్ల పరంగా మంచి ఫలితాలను ఇస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈచిత్రం వరల్డ్ వైడ్ బక్సాఫీసు వద్ద రూ. 51 కోట్ల మార్కును దాటినట్లు తెలుస్తోంది. దీంతో ఈ మహేష్ బాబు-వెంకటేష్ కాంబినేషన్లో వచ్చిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం వసూలు చేసిన రూ. 51 కోట్ల రికార్డును బద్దలు కొట్టినట్లయింది.

'రేసు గుర్రం' చిత్రం రూ. 51 కోట్ల మార్కును దాటడంతో....టాలీవుడ్లో అత్యధిక గ్రాస్ కలెక్షన్ సాధించిన టాప్-10 చిత్రాల్లో 5వ స్థానంలో ఈచిత్రం నిలిచినట్లయింది. 23 రోజులు పూర్తయ్యే నాటికి ఈ చిత్రం నైజాం ఏరియాలో ఇప్పటి వరకు 16 కోట్ల పై చిలుకు వసూళ్లు సాధించింది. సీడెడ్ ఏరియాలో రూ. 7 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది.

‘Race Gurram’ crossed Rs.51 crore

ఇప్పటి వరకు టాలీవుడ్లో రూ. 50 కోట్ల వసూలు చేసే సత్తా ఉన్న హీరోలుగా పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రామ్ చరణ్‌‍లకు మాత్రమే పేరుంది. ఇపుడు రూ. 50 కోట్ల క్లబ్బులో అల్లు అర్జున్ కూడా చేరడంపై ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. రేసు గుర్రం చిత్రం టోటల్ బిజినెస్ పూర్తయ్యే నాటికి ఎన్ని కోట్లు వసూలు చేస్తుందో అని ట్రేడ్ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.

రేసు గుర్రం చిత్రంలో కోట శ్రీనివాసరావు, సుహాసిని మణిరత్నం, ప్రకాష్‌రాజ్, అలీ, ఎమ్మెస్ నారాయణ, రఘుబాబు, ముఖేష్‌రుషి, ఆశిష్ విద్యార్థి, నవాజ్ సోనూ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి రచన: వక్కంతం వంశీ, కెమెరా: మనోజ్ పరమహంస, సంగీతం: ఎస్.తమన్, కూర్పు: గౌతంరాజు, నిర్మాతలు: నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి), డా.కె.వెంకటేశ్వరరావు, నిర్మాణ సంస్థ: శ్రీలక్ష్మీనరసింహా ప్రొడక్షన్స్, దర్శకత్వం: సురేందర్ రెడ్డి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X