25 నుంచి బన్నీ అక్కడ రేసు

By Srikanya

హైదరాబాద్ : అల్లు అర్జున్‌ సినిమాలు కేరళ లో కూడా విడుదలై అక్కడా మంచి వసూళ్లను సాధిస్తున్న సాధిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యలో ఆయన హీరోగా తెరకెక్కి,విడుదలైన తాజా చిత్రం 'రేసుగుర్రం' సైతం మళయాళంలోకి వెళ్తోంది. మళయాళ టైటిల్... లక్కీ ...ది రేసర్. పిఆర్ టి ఎంటర్ ప్రైజస్ బ్యానర్ పై మళయాళంలో రిలీజ్ అవుతోంది. శ్రుతిహాసన్‌ హీరోయిన్. సురేందర్‌రెడ్డి దర్శకుడు. ఏప్రియల్ 25న ఈ చిత్రం విడుదలకు ప్లాన్ చేస్తున్నామని చెప్పారు. ఈ చిత్రానికి తమన్‌ స్వరాలందించారు. ఇక్కడ హిట్ టాక్ తెచ్చుకోవటంతో అక్కడా మంచి క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు. E4 ఎంటర్ట్నైమెంట్ వారు ఈ చిత్రాన్ని అక్కడ పంపిణీ చేస్తున్నారు.

అల్లు అర్జున్‌ మాట్లాడుతూ.... ''నా జీవితాంతం గుర్తుపెట్టుకునే సినిమా ఇది. సురేందర్‌ రెడ్డి చాలా బాగా తీశారు. పరిశ్రమలో ప్రతి దర్శకుడు సినిమాతోపాటు నా హీరో బాగుండాలని కోరుకుంటాడు. వాళ్ల అభిరుచి వల్లే మేము తెరపై ఇంత అందంగా కనిపిస్తుంటాం. 'కిక్‌', 'బృందావనం' పాటలు విన్నాక తమన్‌తో పని చేయాలనిపించింది. ప్రపంచ స్థాయి సంగీతం తన దగ్గర ఉంటుంది.'' అన్నారు.

Race Gurram Mal Dub releasing this 25th April

సురేందర్‌ రెడ్డి మాట్లాడుతూ... ''తెరపై బన్నీ రేసుగుర్రమైతే తెరవెనుక చిత్రబృందమంతా రేసుగుర్రాల్లా పరుగెత్తి పని చేశారు. తమన్‌ తన పాటలతో నాకు రెండింతలు కిక్‌ ఇచ్చాడు. ఈ సినిమా విజయం ఎప్పుడో ఖరారైంది.'' అన్నారు.

కోట శ్రీనివాసరావు, సుహాసిని మణిరత్నం, ప్రకాష్‌రాజ్, అలీ, ఎమ్మెస్ నారాయణ, రఘుబాబు, ముఖేష్‌రుషి, ఆశిష్ విద్యార్థి, నవాజ్ సోనూ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి రచన: వక్కంతం వంశీ, కెమెరా: మనోజ్ పరమహంస, సంగీతం: ఎస్.తమన్, కూర్పు: గౌతంరాజు, నిర్మాతలు: నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి), డా.కె.వెంకటేశ్వరరావు, నిర్మాణం: శ్రీలక్ష్మీనరసింహా ప్రొడక్షన్స్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X