»   » బన్నీ 'రేసు గుర్రం' రిలీజ్ వాయిదా

బన్నీ 'రేసు గుర్రం' రిలీజ్ వాయిదా

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    హైదరాబాద్ : అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం 'రేసు గుర్రం'. సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరి కలయికలో వస్తున్న తొలి సినిమా ఇదే. సంక్రాంతికి విడుదల అవుతుందనుకున్న ఈ చిత్రం పిభ్రవరికి వాయిదా పడిందని ట్రేడ్ వర్గాల సమాచారం. చిత్రం పూర్తై ఫస్ట్ కాపీ పట్టటానికి ఇంకా రెండు నెలలు సమయం పట్టేటట్లు ఉందని అందుకే విడుదల ను ముందుకు తోసారని చెప్తున్నారు. త్వరలో ఈ చిత్రానికి సంభంధించి ఛేజ్ సీన్ తీస్తారు. అలాగే నెక్ట్స్ షెడ్యూల్ కుంభకోణంలో ప్లాన్ చేస్తున్నారు. అయితే ఫిబ్రవరి అనేది డల్ సీజన్ కాబట్టి మార్చి చివర నెలలోకి వెళ్లే అవకాసం ఉంది.


    ఇక చిత్రంలో అల్లు అర్జున్ క్యారక్టరైజేషన్ చాలా విభిన్నంగా ఉండబోతోందని దర్శకుడు చెప్తున్నాడు. ఫన్,యాక్షన్ కలిపి మరో కిక్ లా రూపొందిస్తున్న ఈ చిత్రం పై మంచి అంచనాలే ఉన్నాయి. సురేంద్రరెడ్డి మాట్లాడుతూ... "పరుగు పందెంలో గెలవడం రేసుగుర్రం విధి. జీవితమనే పరుగు పందెంలో గెలవడం మనిషి విధి. అయితే... ఈ రేసులో అడపాదడపా గెలిచేవారు కొందరైతే... గెలుపుని ఇంటిపేరుగా మార్చుకున్నవాళ్లు కొందరు. ఆ కొందరిలో ఒకడి కథే... 'రేసుగుర్రం. బాధ్యతాయుతమైన ఓ యువకుని కథాంశంతో సురేందర్‌రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ శక్తిమంతమైన పాత్ర పోషిస్తున్నారు" అన్నారు.

    Race Gurram moved to February

    అలాగే "గెలుపు కోసం బరిలో దిగినవాడికి... లక్ష్యం మాత్రమే కనిపించాలి. ఎదురొస్తున్న సవాళ్లు, పరిగెట్టిస్తున్న పరిస్థితులు, చుట్టుముడుతున్న సమస్యలూ ఇవేమీ పట్టించుకోకూడదు. రేసులో నిలవాలన్నా, నిలిచి గెలవాలన్నా పోరాడాల్సిందే. ఆ యువకుడూ అదే చేశాడు. 'రేసు గుర్రం'లా దూసుకుపోయాడు. మరి విజయం అందిందా? లేదా? ఇంతకీ ఈ రేసు దేని కోసం? తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే!" అన్నారు.

    కుటుంబ భావోద్వేగాల నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో బన్నీ పాత్ర చిత్రణ వైవిధ్యంగా ఉండనుందని, కథా కథనాల పరంగా సురేందర్‌రెడ్డి గత చిత్రాలను మించేలా ఈ సినిమా ఉంటుందని సమాచారం. శ్రుతిహాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో 'కిక్'శ్యామ్, సలోని ప్రత్యేక పాత్రలు పోషిస్తున్నారు.

    ఇద్దరమ్మాయిలతో... సినిమా బాక్సాఫీస్‌ వద్ద పరాజయం చెందిన తరువాత బన్ని చేస్తున్న సినిమా ఇది. ఈ సినిమాతో ఎలాగైనా హిట్‌ కొట్టాలని భావిస్తున్నాడు. అలాగే ఊసరవెల్లి సినిమా తరువాత సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో వస్తున్న సినిమా ఇది. ఇతనికీ ఈ సినిమా విజయం ఎంతో అవసరం ఉంది. ఎందుకంటే ఊసరవెల్లి అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది.ఈ చిత్రంలో సలోని సెకండ్ హీరోయిన్‌గా కనిపించనుంది.

    కోట శ్రీనివాసరావు, సుహాసిని మణిరత్నం, ప్రకాష్‌రాజ్, అలీ, ఎమ్మెస్ నారాయణ, రఘుబాబు, ముఖేష్‌రుషి, ఆశిష్ విద్యార్థి, నవాజ్ సోనూ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి రచన: వక్కంతం వంశీ, కెమెరా: మనోజ్ పరమహంస, సంగీతం: ఎస్.తమన్, కూర్పు: గౌతంరాజు, నిర్మాతలు: నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి), డా.కె.వెంకటేశ్వరరావు, నిర్మాణం: శ్రీలక్ష్మీనరసింహా ప్రొడక్షన్స్.

    English summary
    Allu Arjun's Race Gurram if things go according to the plan may release in February. But the makers may choose to move to March end too considering February being dull season .
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more