ఖేల్ ఖతం: ‘రేసు గుర్రం’ క్లోజింగ్ బిజినెస్ డీటేల్స్
హైదరాబాద్: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, శృతి హాసన్ జంటగా నటించిన 'రేసు గుర్రం' చిత్రం ఏప్రిల్ 10న విడుదలై విజయవంతంగా బాక్సాఫీసు వద్ద 50 రోజులు పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. తొలి రోజు నుండే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈచిత్రం దుమ్మురేపే కలెక్షన్లు సాధిస్తూ కేవలం 3 వారాల్లోనే రూ. 50 కోట్లు వసూలు చేసిన సినిమాల జాబితాలో చేరింది. మే 30న ఈ ఈచిత్రం మొత్తం 159 సెంటర్లలో 50 రోజులు పూర్తి చేసుకుంది.
తాజాగా ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం బిజినెస్ క్లోజింగ్ దశకు చేరుకుందని తెలుస్తోంది. అయితే 100 రోజులు పూర్తయ్యే నాటికి ఎన్ని థియేటర్లు మిగులుతాయో ఇప్పుడే చెప్పడం కాస్త కష్టమే. ఇప్పటి వరకు ఈ సినిమా చేసిన బిజినెస్ ఏరియా వైజ్ వివరాలపై ఓ లుక్కేద్దాం...

నైజాం: రూ. 14.09 కోట్లు
సీడెడ్ : రూ. 8.09 కోట్లు
నెల్లూరు : రూ. 3.23 కోట్లు
కృష్ణా: రూ. 3.41 కోట్లు
గుంటూరు : 4.21 కోట్లు
వైజాగ్: రూ. 4.30 కోట్లు
వెస్ట్: రూ. 2.85 కోట్లు
ఈస్ట్ గోదావరి: 2.92 కోట్లు
టోటల్ ఏపీ కలెక్షన్: 43.10 కోట్లు
కర్నాటక: రూ. 4.59 కోట్లు
రెస్టాఫ్ ఇండియా : రూ. 1.97 కోట్లు
ఓవర్సీస్ కలెక్షన్ : రూ. 9.31 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్: రూ. 58.97 కోట్లు
రేసు గుర్రం చిత్రంలో కోట శ్రీనివాసరావు, సుహాసిని మణిరత్నం, ప్రకాష్‌రాజ్, అలీ, ఎమ్మెస్ నారాయణ, రఘుబాబు, ముఖేష్‌రుషి, ఆశిష్ విద్యార్థి, నవాజ్ సోనూ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి రచన: వక్కంతం వంశీ, కెమెరా: మనోజ్ పరమహంస, సంగీతం: ఎస్.తమన్, కూర్పు: గౌతంరాజు, నిర్మాతలు: నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి), డా.కె.వెంకటేశ్వరరావు, నిర్మాణ సంస్థ: శ్రీలక్ష్మీనరసింహా ప్రొడక్షన్స్, దర్శకత్వం: సురేందర్ రెడ్డి.


Click it and Unblock the Notifications











