Race Gurram Re-Release Collections: నిరాశజనకంగా రేసుగుర్రం కలెక్షన్లు.. అల్లు అర్జున్ మూవీకి ఎంతంటే?

రీ రిలీజ్ కల్చర్‌లో సినిమాలకు బాగా గిట్టుబాటు అవుతోంది. అభిమానుల నుంచి మంచి ఆదరణతో స్టార్ హీరోలంతా తమ సినిమాలను రీ రిలీజ్ చేయడానికి ముందుకొస్తున్నారు. తాజాగా ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించిన రేసుగుర్రం మూవీ 4కే వెర్షన్‌లో ఏప్రిల్ 8న వరల్డ్ వైడ్‌గా రీ రిలీజ్ అయ్యింది. శ్రీలక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), వెంకటేశ్వరరావులు సంయుక్తంగా రేసుగుర్రం సినిమాను నిర్మించగా సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు.

అల్లు అర్జున్ సరసన శృతిహాసన్ హీరోయిన్‌గా నటించారు. కిక్ శ్యామ్, రవికిషన్, ముఖేష్ రిషి, సలోనీ, ప్రకాష్‌రాజ్, బ్రహ్మానందం, అలీ, ఎంఎస్ నారాయణ, పోసాని కృష్ణమురళి, జయప్రకాష్ రెడ్డి, కోటా శ్రీనివాసరావు తదితరులు కీలకపాత్రలు పోషించారు. వక్కంతం వంశీ ఈ సినిమాకు కథను అందించగా.. వేమా రెడ్డి డైలాగ్స్ రాశారు. మనోజ్ పరమహంస సినిమాటోగ్రాఫర్‌గా, గౌతమ్ రాజు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించగా.. థమన్ సంగీం అందించారు. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్‌లో దుమ్మురేపిన రేసుగుర్రం రీ రిలీజ్‌లో రెండో రోజు ఎంత రాబట్టింది అనేది పరిశీలిస్తే..

Race Gurram4K Re-Release 2 Days Expected Box Office Collections Worldwide Allu Arjun Starrer heading towards 4 crores mark

రేసుగుర్రం తొలిరోజు కలెక్షన్స్
రీ రిలీజ్‌లో ఈ సినిమా 2 కోట్ల రూపాయల బ్రేక్ఈవెన్ టార్గెట్‌గా బరిలోకి దిగుతున్నట్లు ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు. అడ్వాన్స్ బుకింగ్‌లో మంచి రెస్పాన్స్ అందుకున్న రేసుగుర్రం మూవీకి తొలిరోజున నైజాంలో 85 లక్షల రూపాయలు, సీడెడ్‌లో 29 లక్షల రూపాయలు, వైజాగ్‌లో 25 లక్షల రూపాయలు, ఈస్ట్ గోదావరిలో 11 లక్షల రూపాయలు, వెస్ట్ గోదావరిలో 6 లక్షల రూపాయలు, కృష్ణాలో 9 లక్షల రూపాయలు, గుంటూరులో 8.5 లక్షల రూపాయలు, నెల్లూరులో 2 లక్షల రూపాయలు చొప్పున ఫస్ట్ డే తెలుగు రాష్ట్రాల్లో 1.75 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టింది.

కర్ణాటకలో 17 లక్షల రూపాయలు, తమిళనాడు+ రెస్టాఫ్ ఇండియాలో 2 లక్షల రూపాయలు చొప్పున ఇండియాలో 2 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక ఓవర్సీస్‌ విషయానికి వస్తే నార్త్ అమెరికాలో 8.8k డాలర్లు (8.20 లక్షల రూపాయలు), యూకేలో 5 లక్షల రూపాయలు చొప్పున తొలిరోజున 2.70 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టినట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. అయితే రేసుగుర్రం తొలిరోజున 3.50 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసినట్లుగా పోస్టర్లు చక్కర్లు కొడుతున్నాయి.

రేసుగుర్రం రెండ్రోజుల కలెక్షన్స్
రెండో రోజు రేసుగుర్రం మూవీకి బుకింగ్స్ తగ్గాయి. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం రెండ్రోజుల వరకు తెలంగాణలో 1.38 కోట్ల రూపాయలు, ఆంధ్రాలో 1.36 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 21 లక్షల రూపాయలు, తమిళనాడులో 3 లక్షల రూపాయలు, రెస్టాఫ్ ఇండియాలో 2.5 లక్షల రూపాయలు నెట్ చొప్పున వసూలు చేసింది. ఇక ఓవర్సీస్‌‌లో 15 లక్షల రూపాయలు వచ్చినట్లుగా తెలుస్తోంది. దాంతో రెండ్రోజుల్లో రేసుగుర్రం మూవీ రీ రిలీజ్‌లో వరల్డ్ వైడ్‌గా 3.20 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసినట్లుగా తెలుస్తోంది. ట్రెండ్‌ను బట్టి చూస్తే 3 రోజులు ముగిసేసరికి రేసుగుర్రం రీ రిలీజ్‌లో 4 కోట్ల రూపాయల రేంజ్‌లో వసూళ్లు రాబట్టవచ్చని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X