Race Gurram4K Re-Release Box Office: రేసుగుర్రం రీ రిలీజ్‌.. అడ్వాన్స్ బుకింగ్‌లో అల్లు అర్జున్ మూవీకి ఎంతంటే?

ప్రస్తుతం రీ రిలీజ్ కల్చర్‌లో చిత్ర నిర్మాతలు బాగానే లాభాలు అందుకుంటున్నారు. డ్రై సీజన్‌లో రీ రిలీజ్‌ల వల్ల థియేటర్లు కూడా ప్రేక్షకుల రాకతో సందడిగా మారుతుండటంతో పాత హిట్ సినిమాలను ఈ జనరేషన్‌కు తగినట్లుగా అత్యాధునిక 4కే వెర్షన్, డాల్బీ డీటీఎస్ ఎఫెక్ట్స్‌తో వదులుతున్నారు. తెలుగునాట రీ రిలీజ్ బొమ్మలకు మంచి ఆదరణ లభిస్తోంది. పోకిరి, బిజినెస్‌మెన్, మురారి, అతడు, గబ్బర్‌సింగ్, జల్సా, ఖుషి, శివ, మనసంతానువ్వే, ఆరెంజ్ తదితర సినిమాలు రీ రిలీజ్‌ కేటగిరీలో సరికొత్త రికార్డులు సృష్టించాయి.

ఏప్రిల్ 8న రేసుగుర్రం రీ రిలీజ్
వీటిని చూసి మరికొందరు నిర్మాతలు కూడా తమ సినిమాలను రీ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. తాజాగా ఐకాన్‌స్టార్ అల్లు నటించిన రేసుగుర్రం మూవీ 4కే వెర్షన్‌లో థియేటర్‌లోకి రానుంది. బన్నీ కెరీర్‌లోనే ప్రత్యేక స్థానం పొందిన సినిమాను.. ఆయన బర్త్ డే సందర్భంగా ఏప్రిల్ 8న వరల్డ్ వైడ్‌గా రీ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ కాగా.. ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ఈ వివరాల్లోకి వెళితే..

Race Gurram4K Re-Release Box Office Allu Arjun Starrer Advance booking Collection Report

రేసుగుర్రం తారాగణం
శ్రీలక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), వెంకటేశ్వరరావులు సంయుక్తంగా రేసుగుర్రం సినిమాను నిర్మించగా సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. అల్లు అర్జున్ సరసన శృతిహాసన్ హీరోయిన్‌గా నటించారు. కిక్ శ్యామ్, రవికిషన్, ముఖేష్ రిషి, సలోనీ, ప్రకాష్‌రాజ్, బ్రహ్మానందం, అలీ, ఎంఎస్ నారాయణ, పోసాని కృష్ణమురళి, జయప్రకాష్ రెడ్డి, కోటా శ్రీనివాసరావు తదితరులు నటించారు. వక్కంతం వంశీ ఈ సినిమాకు కథను అందించగా.. వేమా రెడ్డి డైలాగ్స్ రాశారు. మనోజ్ పరమహంస సినిమాటోగ్రాఫర్‌గా, గౌతమ్ రాజు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించగా.. థమన్ సంగీం అందించారు. వేసవి కానుకగా 2014 ఏప్రిల్ 11న రేసుగుర్రం చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది.

రేసుగుర్రం టోటల్ కలెక్షన్స్
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్ కాస్ట్, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి రేసు గుర్రం సినిమాను 52 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఈ సినిమాకు 57 కోట్ల రూపాయల బ్రేక్ఈవెన్ టార్గెట్‌ను నిర్దేశించారు ట్రేడ్ పండితులు. అంచనాలకు తగినట్లుగానే బాక్సాఫీస్ వద్ద వసూళ్లు కురిపించింది రేసుగుర్రం. తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజున ఏకంగా 6.89 కోట్ల రూపాయల షేర్ వసూలు చేయగా.. అమెరికాలో అల్లు అర్జున్‌కు తొలి 1 మిలియన్ మూవీగా నిలిచింది. 4 వారాల్లో 54.31 కోట్ల రూపాయలు నికర వసూళ్లు రాబట్టిన రేసు గుర్రం.. అల్లు అర్జున్ కెరీర్‌లోనే అప్పటి వరకు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. 159 సెంటర్లలో 50 రోజులు.. 26 కేంద్రాలలో 100 రోజులు ప్రదర్శించబడింది. ఓవరాల్‌గా థియేట్రికల్ రన్ ముగిసేసరికి 60 కోట్ల రూపాయల డిస్ట్రిబ్యూషన్ షేర్ సాధించి 2014లో అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు సినిమాగా రేసు గుర్రం నిలిచింది.

అడ్వాన్స్ బుకింగ్‌లో రేసుగుర్రం కలెక్షన్స్
దాదాపు 12 ఏళ్ల తర్వాత రేసుగుర్రం మూవీని 4కే వెర్షన్‌లో అభిమానుల ముందుకు తీసుకొస్తున్నారు మేకర్స్. 8వ తేదీన రిలీజ్ నేపథ్యంలో అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేయగా ప్రేక్షకుల నుంచి ఊహించని స్పందన లభిస్తోంది. రీ రిలీజ్‌లో ఈ సినిమా 2 కోట్ల రూపాయల బ్రేక్ఈవెన్ టార్గెట్‌గా బరిలోకి దిగుతున్నట్లు ట్రేడ్ పండితులు తెలిపారు. అడ్వాన్స్ బుకింగ్‌లో భాగంగా నిన్నటి వరకు తెలుగు రాష్ట్రాల్లో 50 వేలకు పైగా టికెట్లు అమ్ముడై 71 లక్షల రూపాయల గ్రాస్ రాబట్టింది రేసుగుర్రం.

అటు ఓవర్సీస్‌లోనూ రేసుగుర్రంకు మంచి ఆదరణ లభిస్తోంది. ఏప్రిల్ 6వ తేదీ ఉదయం వరకు అమెరికాలో 57 సెంటర్లలో 99 షోలకు గాను 234 టికెట్లు అమ్ముడై.. 2076 డాలర్లు (దాదాపు 2 లక్షల రూపాయలు) వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాలు, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ కలిపి అడ్వాన్స్ బుకింగ్‌లో రేసుగుర్రం మూవీకి వరల్డ్ వైడ్‌గా 85 లక్షల రూపాయలు వసూలైనట్లు ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. మరో రెండ్రోజులు సమయం ఉండటంతో అల్లు అర్జున్ మూవీ భారీగా వసూళ్లు రాబడుతుందని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X