Race Gurram Re Release Day 1 Collections: రీ రిలీజ్‌లో రేసుగుర్రం హవా.. అల్లు అర్జున్ మూవీకి ఎన్ని కోట్లంటే?

ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించిన రేసుగుర్రం మూవీ 4కే వెర్షన్‌లో ఏప్రిల్ 8న వరల్డ్ వైడ్‌గా రీ రిలీజ్ అయ్యింది. శ్రీలక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), వెంకటేశ్వరరావులు సంయుక్తంగా రేసుగుర్రం సినిమాను నిర్మించగా సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. అల్లు అర్జున్ సరసన శృతిహాసన్ హీరోయిన్‌గా నటించారు. కిక్ శ్యామ్, రవికిషన్, ముఖేష్ రిషి, సలోనీ, ప్రకాష్‌రాజ్, బ్రహ్మానందం, అలీ, ఎంఎస్ నారాయణ, పోసాని కృష్ణమురళి, జయప్రకాష్ రెడ్డి, కోటా శ్రీనివాసరావు తదితరులు కీలకపాత్రలు పోషించారు. వక్కంతం వంశీ ఈ సినిమాకు కథను అందించగా.. వేమా రెడ్డి డైలాగ్స్ రాశారు. మనోజ్ పరమహంస సినిమాటోగ్రాఫర్‌గా, గౌతమ్ రాజు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించగా.. థమన్ సంగీం అందించారు. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్‌లో దుమ్మురేపిన రేసుగుర్రం రీ రిలీజ్‌లో తొలిరోజు ఎంత రాబట్టింది అనేది పరిశీలిస్తే..

Also Read
Rakasa Day 6 Collections: రవితేజ రికార్డ్‌పై రాకాస కన్ను.. నిహారిక మూవీకి 6 రోజుల్లో కలెక్షన్స్ ఎన్ని కోట్లంటే
Rakasa Day 6 Collections: రవితేజ రికార్డ్‌పై రాకాస కన్ను.. నిహారిక మూవీకి 6 రోజుల్లో కలెక్షన్స్ ఎన్ని కోట్లంటే

రేసుగుర్రం టోటల్ కలెక్షన్స్
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్ కాస్ట్, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి రేసు గుర్రం సినిమాను 52 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కించారు. వేసవి కానుకగా 2014 ఏప్రిల్ 11న రేసుగుర్రం చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాకు 57 కోట్ల రూపాయల బ్రేక్ఈవెన్ టార్గెట్‌ను నిర్దేశించారు ట్రేడ్ పండితులు. ఈ సినిమా 159 సెంటర్లలో 50 రోజులు.. 26 కేంద్రాలలో 100 రోజులు ప్రదర్శించబడింది. థియేట్రికల్ రన్ ముగిసేసరికి 60 కోట్ల రూపాయల డిస్ట్రిబ్యూషన్ షేర్ సాధించి 2014లో అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు సినిమాగా రేసు గుర్రం నిలిచింది.

Race Gurram4K Re-Release Day 1 Expected Box Office Collections Worldwide Allu Arjun Starrer get good Number in Opening Day

రేసుగుర్రం అడ్వాన్స్ బుకింగ్
రేసుగుర్రం మూవీకి అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేయగా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. రీ రిలీజ్‌లో ఈ సినిమా 2 కోట్ల రూపాయల బ్రేక్ఈవెన్ టార్గెట్‌గా బరిలోకి దిగుతున్నట్లు ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు. అడ్వాన్స్ బుకింగ్‌లో భాగంగా నిన్నటి వరకు తెలుగు రాష్ట్రాల్లో 50 వేలకు పైగా టికెట్లు అమ్ముడై 71 లక్షల రూపాయల గ్రాస్ రాబట్టింది రేసుగుర్రం. అటు నార్త్ అమెరికాలోనూ రేసు గుర్రంకు అదిరిపోయే వసూళ్లు నమోదవుతున్నాయి.

Recommended For You
Rakasa Day 5 Collections: ఆ క్లబ్‌లోకి రాకాస మూవీ.. నిహారిక మూవీకి 5వ రోజు కలెక్షన్స్ ఎంతంటే?
Rakasa Day 5 Collections: ఆ క్లబ్‌లోకి రాకాస మూవీ.. నిహారిక మూవీకి 5వ రోజు కలెక్షన్స్ ఎంతంటే?

ఓవర్సీస్‌లో రేసుగుర్రం కలెక్షన్స్
యూఎస్ఏలో తొలిరోజు స్పెషల్ షోలకు ఫైనల్ అడ్వాన్స్ సేల్స్ పరిశీలిస్తే.. 63 సెంటర్లలో 101 షోలకు గాను 331 టికెట్లు అమ్ముడై 3245 డాలర్లు (దాదాపు 3 లక్షల రూపాయలు), యూకేలో 4 లక్షల రూపాయలు వసూలు చేసింది. నార్త్ అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్‌లో రెండో రోజు 1392 డాలర్లు (1.28 లక్షల రూపాయలు), మూడో రోజు 202 డాలర్లు (18,670 వేల రూపాయలు) రాబట్టింది రేసు గుర్రం.

You May Also Like
బిగ్‌బాస్ బంధాలన్నీ బూటకమే... జబర్దస్త్ నటి ఎమోషనల్
బిగ్‌బాస్ బంధాలన్నీ బూటకమే... జబర్దస్త్ నటి ఎమోషనల్

రేసుగుర్రం రీ రిలీజ్ తొలిరోజు కలెక్షన్స్
ఇక తొలిరోజున ఇండియాలో రేసుగుర్రం రీ రిలీజ్‌‌‌కు అల్లు అభిమానుల నుంచి మంచి స్పందన లభించింది. థియేటర్లను ఫ్లెక్సీలు, బ్యానర్లతో నింపేయగా.. సినిమా హాల్‌ల వద్ద పండగ వాతావరణం నెలకొంది. కొందరు అభిమానులు థియేటర్‌లలోకి నిజమైన గుర్రాలను తీసుకొచ్చి హల్‌చల్ చేశారు. రేసుగుర్రం రీ రిలీజ్‌ ప్రీమియర్స్‌లో భాగంగా 16 షోలకు గాను 9.28 లక్షల రూపాయలు రాబట్టింది. ఫస్ట్ డే ఇప్పటి వరకు 316 సెంటర్లలో 749 షోలు ప్రదర్శితమై 1,31,947 టికెట్లు అమ్ముడయ్యాయి. దాదాపు 42.7 శాతం ఆక్యూపెన్సీ నమోదై ఇండియాలో 1.73 కోట్ల రూపాయల గ్రాస్ వసూలైంది. ఓవర్సీస్ వసూళ్లతో కలిపి తొలిరోజున వరల్డ్ వైడ్‌గా రేసుగుర్రం మూవీకి రీ రిలీజ్‌లో 2 కోట్ల రూపాయలకు పైగా ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X