తొలి రోజు ‘రచ్చ’ బాక్సాఫీసు షేక్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, తమన్నా జంటగా సంపత్ నంది దర్శకత్వంలో రూపొందిన 'రచ్చ' దెబ్బకు తొలి రోజు ఆంధ్రప్రదేశ్ బాక్స్ ఆఫీస్ షేక్ అయింది. ఈచిత్రం క్రిటిక్స్ నుంచి ఎబో యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే బాక్సాఫీసు వద్ద మాత్రం వండర్ ఫుల్ కలెక్షన్లు సాధించింది.
ట్రేడ్ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం....తొలిరోజు ఆంధ్రప్రదేశ్‌లో రచ్చ చిత్రం 700 థియేటర్లలో విడుదలైనట్లు తెలుస్తోంది. మెగా అభిమానులు చెర్రీ చేసిన రచ్చను చూసేందుకు బారులు తీరారు. దాదాపు తొలిరోజు థియేటర్ల హౌస్ ఫుల్ అయ్యాయి. కలెక్షన్లు కూడా బాగానే వసూలు అయ్యాయి. ఖశ్చితంగా ఎంత అమౌంట్ వసూలు అయిందనే వివరాలు తెలియాల్సి ఉంది.
తన తనయుడు రామ్ చరణ్ తేజ్ నటించిన 'రచ్చ' సినిమా తొలిషో తర్వాత వచ్చిన స్పందనను బట్టి సినిమా సూపర్ డూపర్ హిట్టయిందని, ఈ సినిమా దెబ్బకు పలు రికార్డులు బద్దలవ్వడం ఖాయమని చిరంజీవి అన్నారు. రచ్చ సినిమా చూసిన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
రామ్ చరణ్, తమన్నా జంటగా నటించిన ఈచిత్రాన్ని మెగా సూపర్ గుడ్ ఫిల్మ్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రానికి ఆర్.బి.చౌదరి సమర్పకులు కాగా, ఎన్.వి.ప్రసాద్, పారస్ జైన్ నిర్మాతలు. ఈ చిత్రానికి సంగీతం : మణిశర్మ, ఛాయాగ్రహణం: సమీర్ రెడ్డి, రచన: పరుచూరి బ్రదర్స్, ఎడిటింగ్: గౌతంరాజు, కళ: ఆనంద్‌సాయి, కొరియోగ్రఫీ: రాజు సుందరం, శోబి.


Click it and Unblock the Notifications











