బ్రహ్మాండాన్ని అధిగమించిన ‘రచ్చ’
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన 'రచ్చ' చిత్రం సూపర్ కలెక్షన్లతో దూసుకెలుతోంది. ఇప్పటికే పెట్టుబడి మొత్తం రాబట్టి నిర్మాతలను లాభాల్లో ప్రయాణింప చేస్తున్న ఈ చిత్రం నైజాం సర్కిల్ లో బ్రహ్మాండాన్ని రీచ్ అయింది. ఏ సినిమా అయినా నైజాం ఏరియాలో రెండు వారాల్లో రూ. 10 కోట్ల షేర్ వసూలూ చేస్తే పెద్ద గ్రేట్. రికార్డులు తిరగరాసే సినిమాలకు మాత్రమే అంత సత్తా ఉంటుంది. తాజాగా రచ్చ అవలీలగా దాన్ని క్రాస్ చేసింది.
మాస్ ఎంటర్ టైనర్ గా పేరు తెచ్చుకున్న రచ్చ చిత్రానికి విపరీతమైన డిమాండ్ ఇంకా కొనసాగుతోంది. పెద్ద సినిమాలేమీ లేక పోవడంతో రచ్చ తప్ప ప్రేక్షకులకు వేరే ఆప్షన్ కనిపించడం లేదు. ముఖ్యంగా 'సి' సెంటర్లలో రచ్చ సినిమా హాళ్లన్నీ ఇప్పటికీ హౌస్ ఫుల్ అవుతూనే ఉన్నాయి.
రామ్ చరణ్, తమన్నా జంటగా నటించిన ఈచిత్రానికి సంపత్ నంది దర్శకత్వం వహించారు. మెగా సూపర్ గుడ్ ఫిలింస్ బేనర్ పై ఎన్వీ ప్రసాద్, పరాస్ జైన్ ఈచిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే ఫస్ట్ వీక్ కలెక్షన్ల విషయంలో సినిమా రికార్డులు తిరగ రాసింది. అయితే ఎ, బి సెంటర్ల ప్రేక్షకుల్లో చాలా మంది ఈ చిత్రం ఏమంత గొప్పగా లేదని పెదవి విరుస్తుండటం గమనార్హం.
ప్రస్తుతం రామ్ చరణ్ తేజ్ బాలీవుడ్ మూవీ 'జంజీర్'లొ నటిస్తున్నాడు. ఈచిత్రంలో బాలీవుడ్ టాప్ హీరోయిన్ ప్రింయాక చోప్రా హీరోయిన్. అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్న చిత్రం బిగ్ బి అమితాబ్ నటించిన జంజీర్ చిత్రానికి రీమేక్. ఈ చిత్రం అప్పట్లో అమితాబ్ కు యాంగ్రీ యంగ్ మెన్ గా ఇమేజ్ తెచ్చింది.


Click it and Unblock the Notifications











