షాకిచ్చిన కర్ణాటక 'రచ్చ' కలెక్షన్స్

By Srikanya

రామ్ చరణ్ తేజ తాజా చిత్రం రచ్చ కలెక్షన్స్ హవా ఇంకా కర్ణాటకలో కొనసాగుతోంది. అక్కడ గతంలో ఏ తెలుగు చిత్రం చేయనటువంటి రికార్డు కలెక్షన్స్ ని వసూలు చేస్తోంది. అక్కడ ట్రేడ్ ఎనాలిస్ట్ ల అంచనా ప్రకారం...ఈ చిత్రం ఇప్పటివరకూ 15 కోట్లు వసూలు చేసింది. తెలుగు స్టైయిట్ చిత్రం...డబ్బంగ్ కాకుండా అంత వసూలు కావటం అక్కడ వారిని ఆశ్చర్యపరుస్తోంది. ఇప్పటికీ చాలా ధియోటర్స్ లో ఈ చిత్రానికి హౌస్ ఫుల్ బోర్డులు కనపడుతున్నాయని చెప్తున్నారు. ఈ చిత్రం అక్కడ 90 స్క్రీన్స్ లో విడుదలైంది.

మరో విశేషం ఏమిటంటే...ఈ తొంభై కాక మరో 30 స్క్రీన్స్ వరకూ ఏ విధమైన పబ్లిసిటీ లేకుండా విడుదల చేసారు. దాంతో వాటి లెక్కలు అంచనాకు అందటం లేదని చెప్తున్నారు. అప్పటికీ కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ...నాన్ కన్నడ మూవీస్ ని 24 ప్రింట్స్ కి మించి రిలీజ్ చేయకూడదని రూల్ పెట్టింది. అయితే కాంపిటేషన్ కమీషన్ ఆఫ్ ఇండియా...ప్రీ ట్రేడ్ ని అడ్డుకుంటున్నారని ఫిల్మ్ ఛాంబర్ పై ఫైన్ వేసి...నాన్ కన్నడ సినిమాల అధిక స్క్రీన్స్ రిలీజ్ కు ద్వారం తెరిచింది. అది రచ్చ చిత్రానికి బాగా కలిసి వచ్చింది. దాంతో 90 ధియోటర్స్ వరకూ అపీషియల్ గా విడుదల చేయటం సాధ్యమైంది.

దాంతో ఇప్పుడు రచ్చ కర్ణాటక కలెక్షన్స్ అంతటా చర్చనీయాంశంగా మారాయి. రచ్చ చిత్రం ఓపినింగ్ రోజు నుంచి ఆంధ్రాలో కూడా కలెక్షన్స్ బాగున్నాయి. సంపత్ నంది ఈ చిత్రాన్ని చిరు మ్యానరిజమ్స్ ని, చిరు పాటలను పట్టుకుని ఈ సినిమాని మాస్ కి దగ్గర చేయటానికి ప్రయత్నం చేసారు. అందులోనూ సినిమాలో మాస్ కి పట్టేలా రాసిన డైలాగ్స్ ..పరుచూరి వారి కలం పదును మరోసారి తెలియచేసాయి. ఆ డైలాగ్స్ అభిమానులను ఆనందంలో ముంచాయి. చిరంజివి పెద్ద తెరకు దూరంగా ఉండటంతో రామ్ చరణ్ లో ఆయన్నిచూసుకుంటూ అభిమానులు నీరాజనం పడుతున్నారు.

ఇక సెకండాఫ్ లో వచ్చే వానా వానా వెల్లు వాయే పాట సైతం సినిమాకు బాగా ప్లస్ గా మారింది. తమన్నా తడి తడి అందాలు కుర్రాళ్లకు కిక్కిస్తున్నాయని అంటున్నారు. ఇక ఈ కలెక్షన్స్ హవా ఇలాగే కొనసాగితే రామ్ చరణ్ ..మగధీర రికార్డుని బ్రద్దలు కొట్టడం పెద్ద కష్టమేమి కాదని అంటున్నారు. ఇదిలా ఉంటే... మరో ప్రక్క ఎన్టీఆర్ దమ్ము చిత్రం కూడా అదే బాటలో నడిచి 150 ప్రింట్స్ వరకూకర్ణాటకలో విడుదల చేయాలని నిర్ణయించుకుంది. ఈ ధోరిణి అక్కడ ఫిల్మ్ ఛాంబర్ కి అంతు పట్టడం లేదు. తమ సినిమాలకు ఈ తెలుగు సినిమాలు ఏ విధంగా దెబ్బ కొడతాయో అని వారు ఆలోచనలో పడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X