Radhe Shyam 4 Days Collections: సోమవారం ఒక్కసారిగా డౌన్.. ప్రభాస్ కెరీర్ లోనే అత్యంత దారుణంగా...

వరుస పాన్ ఇండియా సినిమాలను లైన్లో పెడుతున్న స్టార్ హీరో ప్రభాస్ ఎలాంటి సినిమాను మొదలు పెట్టినా దాని బడ్జెట్ ఈజీగా మూడు వందల కోట్లు దాటుతుంది అని ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. ఇక రాధే శ్యామ్ సినిమా కూడా మొదట 100కోట్లు అనుకుని ఆ తర్వాత 300 కోట్లతో నిర్మించారు. ఇక ఈ సినిమా మొదటి మూడు రోజుల్లో పర్వాలేదు అనిపించినప్పటికీ 4వ రోజు కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. నాలుగో రోజు కలెక్షన్స్ ప్రపంచవ్యాప్తంగా ఏ స్థాయిలో వచ్చాయి అనే వివరాల్లోకి వెళితే..

డివైడ్ టాక్

డివైడ్ టాక్

ప్రభాస్ పూజ హెగ్డే నటించిన ఈ సినిమా డిఫరెంట్ లవ్ అడ్వెంచర్ మూవీ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జిల్ దర్శకుడు రాధాకృష్ణ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో కొన్ని ప్రేమ సన్నివేశాలు బాగానే హైలెట్ అయినప్పటికీ.. మాస్ ఆడియెన్స్ ను మాత్రం అంతగా ఆకట్టుకోలేక పోయింది. ఇక తెలుగు సంగతి పక్కన పెడితే మిగతా భాషల్లో మాత్రం సినిమాకు కమర్షియల్ గా ఏ మాత్రం లాభాలు వచ్చేలా లేవని అర్థమవుతోంది.

 పవర్ఫుల్ బిజినెస్

పవర్ఫుల్ బిజినెస్

ఇక రాధేశ్యామ్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది అనే వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మంచి డిమాండ్ ఉండడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 105.20 కోట్లు వరకు బిజినెస్ చేసింది. ఇక కర్నాటకలో రూ. 12.50 కోట్లు, తమిళనాడులో రూ. 6 కోట్లు, కేరళలో రూ. 2.10 కోట్లు, హిందీలో రూ. 50 కోట్లు, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లో కలిపి రూ. 27 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా రూ. 202.80 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు సమాచారం.

4వ రోజు.. ఒక్కసారిగా డౌన్

4వ రోజు.. ఒక్కసారిగా డౌన్

4వ రోజూ ‘రాధే శ్యామ్' కలెక్షన్స్ ఒక్కసారిగా తగ్గిపోయాయి. ఏపీ, తెలంగాణలో ఏరియాల వారిగా వచ్చిన కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి. నైజాంలో రూ. 95 లక్షలు కోట్లు, సీడెడ్‌లో రూ. 30 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 14 లక్షలు, ఈస్ట్‌లో రూ. 15 లక్షలు, వెస్ట్‌లో రూ. 13 లక్షలు, గుంటూరులో రూ. 14 లక్షలు, కృష్ణాలో రూ. 12 లక్షలు, నెల్లూరులో రూ. 10 లక్షలతో.. ఆదివారం రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 2.11 కోట్లు షేర్, రూ. 3.45 కోట్లు గ్రాస్ దక్కింది.

4 రోజుల్లో ఏపీ తెలంగాణలో టోటల్ కలెక్షన్స్

4 రోజుల్లో ఏపీ తెలంగాణలో టోటల్ కలెక్షన్స్

‘రాధే శ్యామ్'కు 4 రోజులకు వచ్చేసరికి కలెక్షన్స్ భారీగా తగ్గడంతో తెలుగు రాష్ట్రాల్లో మొత్తం నాలుగు రోజుల్లో ఏరియాల వారిగా వచ్చిన కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి. నైజాంలో రూ. 23.26 కోట్లు, సీడెడ్‌లో రూ. 6.95 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 4.48 కోట్లు, ఈస్ట్‌లో రూ. 3.02 కోట్లు, వెస్ట్‌లో రూ. 3.11 కోట్లు, గుంటూరులో రూ. 4.22 కోట్లు, కృష్ణాలో రూ. 2.46 కోట్లు, నెల్లూరులో రూ. 2 కోట్లతో.. రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 50.50 కోట్లు షేర్, రూ. 78.60 కోట్లు గ్రాస్ వచ్చింది.

ఇప్పటివరకు వరల్డ్ వైడ్ గా వచ్చింది ఎంతంటే

ఇప్పటివరకు వరల్డ్ వైడ్ గా వచ్చింది ఎంతంటే

తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో 4 రోజుల్లో ‘రాధే శ్యామ్' సినిమా రూ. 50.50 కోట్లు షేర్ వచ్చింది. ఇక కర్నాటకలో రూ. 4.10 కోట్లు, తమిళనాడులో రూ. 68 లక్షలు, కేరళలో రూ. 15 లక్షలు, హిందీలో రూ. 7.50 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.48 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 10.90 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా 4 రోజుల్లోనే రూ. 75.31 కోట్లు షేర్‌తో పాటు రూ. 134 కోట్లు గ్రాస్‌ను వసూలు రాబట్టింది.

Recommended Video

Radhe Shyam - Prabhas Interview | Pooja Hegde| Filmibeat Telugu
ఇంకా ఎంత రావాలంటే..

ఇంకా ఎంత రావాలంటే..

ఈ సినిమా కోసం యు.వి.క్రియేషన్స్ దాదాపు 300 కోట్ల వరకు ఖర్చు చేయగా థియేట్రికల్ గానే సినిమాకు వంద కోట్లకుపైగా లాభాలు వచ్చాయి. ఇక రాజ్యం సినిమా బిజినెస్ కు తగ్గట్టుగా ప్రపంచ వ్యాప్తంగా రూ. 202.80 కోట్లు మేర బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. ఇక రూ. 204 కోట్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో మార్కెట్ లోకి వచ్చిన ఈ సినిమా.. 4 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 75.31 కోట్లు వసూలు చేసింది. అంటే సినిమా సక్సెస్ అవ్వాలి అంటే 128.69 కోట్లు రాబట్టాల్సి ఉంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X