Radhe Shyam Collections: పవన్ కళ్యాణ్ సినిమా వసూళ్లను దాటలేకపోయిన ప్రభాస్.. బన్నీ కంటే తక్కువే!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా బిగ్ బడ్జెట్ సినిమాలను లైన్ లో పెడుతున్నా నెంబర్ వన్ స్టార్ హీరో అనే చెప్పాలి. అతని సినిమాలపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా మంచి బజ్ అయితే క్రియేట్ అవుతుంది. ఇక మొత్తానికి రాధే శ్యామ్ సినిమాను కూడా భారీ స్థాయిలో విడుదల చేయడం జరిగింది. ఇక శుక్రవారం విడుదలైన ఈ సినిమా మొదటి రోజు భారీ వసూళ్లను సాధించినట్లుగా కూడా నేషనల్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి అయితే ఒక విషయంలో మాత్రం పాన్ ఇండియా స్టార్ పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ సినిమాల రికార్డులను కూడా దాటలేకపోయాడు. ఆ వివరాల్లోకి వెళితే..

మొదటి రోజు అలాంటి టాక్

మొదటి రోజు అలాంటి టాక్

ప్రభాస్ పూజ హెగ్డే జంటగా నటించిన రొమాంటిక్ లవ్ అడ్వెంచర్ మూవీ రాధే శ్యామ్ గత ఏడాది నుంచి ప్రేక్షకులు ఎంతగానో ఊరిస్తోంది. రాధాకృష్ణ దర్శకత్వంలో యూవి క్రియేషన్స్ నిర్మించిన ఈ సినిమా మొత్తానికి మార్చి 11వ తేదీన వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో విడుదల అయింది. ఇక ఈ సినిమాకు మొదటి రోజు క్రిటిక్స్ నుంచి విభిన్నమైన టాక్ లభించినప్పటికీ ఓ వర్గం అభిమానులు మాత్రం ఈ సినిమా అద్భుతంగా ఉంది అని వివరణ ఇస్తున్నారు.

మొదటి రోజే 100కోట్లు

మొదటి రోజే 100కోట్లు

అయితే మొదటి రోజు రాధే శ్యామ్ సినిమా ఏ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంది అనే విషయంలో ముందు రోజు నుంచే అనేక రకాల కథనాలు వెలువడ్డాయి. తప్పకుండా గత సినిమాల రికార్డులను బ్రేక్ చేస్తుంది అని కూడా ట్రేడ్ వర్గాలు తెలిపాయి. మొదటి రోజే ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 100 కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్స్ సాధించవచ్చని కూడా అంచనాలు వేసుకొచ్చారు.

నైజాం ఏరియాలో..

నైజాం ఏరియాలో..

సినిమా లో ప్రపంచ వ్యాప్తంగా ఏ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంది అనే విషయాన్ని పక్కన పెడితే తెలంగాణ నైజాం ఏరియాలో మాత్రం అనుకున్నంత స్థాయిలో రికార్డును క్రియేట్ చేయలేక పోయినట్లుగా తెలుస్తోంది. బిగ్గెస్ట్ ఫ్యాన్ ఇండియా స్టార్ అయినటువంటి ప్రభాస్ మిగతా హీరోల కంటే చాలా తక్కువ కలెక్షన్స్ అందుకోవాల్సి వచ్చింది. నైజాం ఏరియాలో మొదటిరోజు రాధే శ్యామ్ సినిమా 10.45 కోట్ల షేర్ మాత్రమే అందుకున్నాడు

పవన్, బన్నీ కంటే తక్కువే..

పవన్, బన్నీ కంటే తక్కువే..

ఇక నైజాంలో మొదటి రోజు అత్యధిక షేర్ వస్తుందని అనుకున్న సినిమాల లిస్టు ఈ విధంగా ఉంది. అందులో ఇటీవల వచ్చిన భీమ్లా నాయక్ నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. నైజాంలో ఆ సినిమా మొదటిరోజు 11.85 కోట్ల షేర్ సాదించగా ఆ తరువాత అల్లు అర్జున్ పుష్ప సినిమా 11.44 కోట్ల షేర్ సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది. ఇక ఈ రెండు సినిమాల తర్వాత రాధే శ్యామ్ సినిమా నిలవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

Recommended Video

Radhe Shyam Movie Art Director Ravinder Reddy Exclusive Interview About Radhe Shyam Movie
అత్యధిక షేర్ సాధించిన టాప్ సినిమాలు

అత్యధిక షేర్ సాధించిన టాప్ సినిమాలు

ఇక టాప్ 3 సినిమాల అనంతరం 4వ స్థానంలో సాహో 9.41 కోట్లు సాధించింది. ఆ తర్వాత 5 స్థానంలో బాహుబలి 2 వ భాగం 8.9 కోట్ల షేర్ సాధించింది. ఇక పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ 8.75 కోట్లు.. ఆ తర్వాత సరిలేరు నీకెవ్వరు 8.67 కోట్లు, మెగాస్టార్ చిరంజీవి సైరా 8.10 కోట్లతో నైజామ్ ఏరియాలో మొదటిరోజు అత్యధిక షేర్ సాధించిన సినిమాల్లో టాప్ లిస్టులో కొనసాగుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X