Radhe Shyam Day 1 Collections.. బాక్సాఫీస్ వద్ద ప్రభాస్ రచ్చ.. తొలి రోజే 100 కోట్ల క్లబ్‌లోకి..
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, అందాల భామ పూజా హెగ్డే నటించిన రాధే శ్యామ్ చిత్రం భారీ వసూళ్లతో బాక్సాఫీస్ జైత్రయాత్రను ప్రారంభించింది. లాక్‌డౌన్ తర్వాత రికార్డు కలెక్షన్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. డివైడ్ టాక్ ఉన్నప్పటికీ ఈ సినిమాకు తొలి రోజు వసూళ్లపై ఎలాంటి ప్రభావం చూపించలేకపోయింది. తొలి రోజు కలెక్షన్ల వివరాలు ఇలా ఉన్నాయి. మొదటి రోజు ప్రభాస్ మూవీ ఏ రేంజ్‌లో కలెక్షన్లు సాధించిందంటే..

తెలుగు రాష్ట్రాల్లో ప్రీ రిలీజ్ బిజినెస్
రాధే శ్యామ్ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ భారీ రేంజ్‌లో జరిగింది. నైజాంలో 36.50 కోట్లు, సీడెడ్ 18 కోట్లు, ఉత్తరాంధ్ర 13 కోట్లు, తూర్పు గోదావరి జిల్లాలో 8.80 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో 7.50 కోట్లు, గుంటూరు జిల్లాలో 9.90 కోట్లు, కృష్ణా జిల్లాలో 7.5 కోట్లు, నెల్లూరు జిల్లాలో 4 కోట్ల మేర బిజినెస్ జరిగింది. దీంతో ఏపీ, నైజాంలో ఈ సినిమా 105 కోట్లకుపైగా ప్రీ రిలీజ్ బిజినెస్ నమోదు చేసింది.

రాధే శ్యామ్ వరల్డ్ వైడ్ బిజినెస్
రాధేశ్యామ్ తెలుగేతర, ఓవర్సీస్ ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. కర్ణాటకలో 12.50 కోట్లు, తమిళనాడులో 6 కోట్లు, కేరళలో 2.10 కోట్లు, హిందీలో 50 కోట్లు, మిగితా రాష్ట్రాల్లో 3 కోట్లు, ఓవర్సీస్‌లో 24 కోట్లు మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇక తెలుగు రాష్ట్రాలు, ఇతర ప్రాంతాలు, ఓవర్సీస్ అన్నీ కలిపితే రాధే శ్యామ్ సినిమా 202.8 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే.. కనీసం 204 కోట్ల లక్ష్యంతో బాక్సాఫీస్ యాత్రను ప్రారంభించింది.

అమెరికాలో తొలి రోజు కలెక్షన్లు
ఇక తొలి రోజు కలెక్షన్ల విషయానికి వస్తే.. అమెరికాలో రాధే శ్యామ్ చిత్రం 904k డాలర్లను ప్రీమియర్ల రూపంలో రాబట్టింది. అంటే ప్రీమియర్ ప్రదర్శన ద్వారా 6.93 కోట్లు వసూలు చేసింది. ఇక ఆస్ట్రేలియాలో ఈ చిత్రం 200k డాలర్లను రాబట్టింది. అంటే 1.12 కోట్లు వసూలు చేసింది. ఇంకా తొలి రోజు కలెక్షన్ల సమాచారం అందాల్సి ఉంది. ఇక కర్ణాటకలో రాధే శ్యామ్ చిత్రం 3.16 కోట్లు వసూలు చేసింది. హిందీలో సుమారు 7 కోట్ల రూపాయలను వసూలు చేసినట్టు సమాచారం.

నైజాం కింగ్‌గా ప్రభాస్
రాధే శ్యామ్ చిత్రం నైజాంలో అరుదైన రికార్డును నమోదు చేసింది. హైదరాబాద్ సిటీలోనే అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డు స్థాయిలో రాబట్టడం విశేషంగా మారింది. తొలి రోజు అడ్వాన్స్ బుకింగ్ మొత్తంగా 6.5 కోట్లు వసూలు చేయడం సెన్సేషనల్‌గా మారింది. ఇక నైజాంలో తొలి రోజు 11.87 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు సమాచారం. ఇటీవల రిలీజైన భీమ్లా నాయక్ 11.8 కోట్లు, పుష్ప 11.4 కోట్లు వసూలు చేయడం గమనార్హం.

ఆంధ్రాలో తొలి రోజు వసూళ్లు
ఆంధ్రా ప్రాంతంలో కూడా రాధేశ్యామ్ చిత్రం భారీ వసూళ్లను రాబట్టింది. గుంటూరు జిల్లాలో 2.6 కోట్ల షేర్, నెల్లూరు జిల్లాలో 1.08 కోట్ల షేర్, గుంటూరు జిల్లాలో 2.60 షేర్, కృష్ణా జిల్లాలో 95 లక్షల షేర్‌ను సాధించింది. ఆంధ్రాలో మొత్తంగా 8.50 కోట్లు, సీడెడ్‌లో 4 కోట్లు వసూలు చేసింది. ఇంకా పలు జిల్లాల నుంచి అధికారిక కలెక్షన్ల వివరాలు అందాల్సి ఉంది.
Recommended Video

ప్రపంచవ్యాప్తంగా రాధే శ్యామ్ కలెక్షన్లు
ఇక ప్రపంచవ్యాప్తంగా రాధే శ్యామ్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. నైజాంలో 12 కోట్లు, సీడెడ్‌లో 4, ఆంధ్రాలో 8.5 కోట్లు, తెలుగేతర రాష్ట్రాలు, ఓవర్సీస్ కలిపి సుమారు 20 కోట్లు వసూలు చేసింది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం తొలి రోజున రూ.50 కోట్లకుపైగా షేర్, 130 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది. ఫైనల్ కలెక్షన్ల కోసం ఫిల్మీబీట్‌ను ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications











