Radhe Shyam: హిందీలో మొదటి రోజు డౌటే.. చాలా తక్కువ కలెక్షన్స్ వచ్చే అవకాశం.. ఎందుకంటే?

రెబల్ స్టార్ ప్రభాస్ పూజా హెగ్డే జంటగా నటించిన రొమాంటిక్ లవ్ అడ్వెంచర్ మూవీ రాధే శ్యామ్ మరికొన్ని గంటల్లో దియేటర్లలో సందడి చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. మొదటి రోజే భారీ స్థాయిలో కలెక్షన్ అందుకుంటుందని అందరూ చాలా నమ్మకంతో ఉన్నారు. ఇప్పటికే తెలుగులో అడ్వాన్స్ బుకింగ్స్ తో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే హిందీలో మాత్రం ఈ సినిమా బుకింగ్స్ పై అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. ఇక హిందీలో కలెక్షన్స్ ఏ విధంగా వస్తాయి అనే వివరాల్లోకి వెళితే..

హిందీలో ప్రభాస్ మార్కెట్..

హిందీలో ప్రభాస్ మార్కెట్..

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమా తో నార్త్ ఇండస్ట్రీలో ప్రభాస్ ఒక మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన సాహో సినిమా మిగతా భాషల్లో అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయినప్పటికీ నార్త్ ప్రేక్షకులకు మాత్రం బాగానే కరెక్ట్ అయింది. ఆ సినిమా హిందీ లో పెట్టిన పెట్టుబడులకు లాభాలను అందించి బాక్సాఫీస్ వద్ద ఏకంగా వంద కోట్లకు పైగా కలెక్షన్ సర్దుకుంది.

అక్కడ సక్సెస్ అవ్వాలని..

అక్కడ సక్సెస్ అవ్వాలని..

రాధే శ్యామ్ సినిమా కూడా తప్పకుండా హిందీలో మంచి కలెక్షన్స్ రాబడుతుంది అని మొదటి నుంచి కూడా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక సినిమా అక్కడ సక్సెస్ అవ్వాలని ప్రత్యేకంగా కొన్ని పాటలను కూడా హిందీ ఆడియన్స్ కి నచ్చే విధంగా కంపోజ్ చేయడం విశేషం. ఏకంగా ముగ్గురు బాలీవుడ్ కంపోజర్స్ కు కోట్ల రూపాయలు ఇచ్చి సాంగ్స్ రెడీ చేయించారు. తప్పకుండా హిందీ లో మొదటి రోజే సినిమా మంచి వసూళ్లను అందుకుంటుంది అని ఆడియేన్స్ కూడా నమ్మారు.

హిందీలో అడ్వాన్స్ బూకింగ్స్..

హిందీలో అడ్వాన్స్ బూకింగ్స్..

అయితే సినిమా విడుదల రోజు దగ్గర పడుతున్న కొద్దీ అడ్వాన్స్ బుకింగ్స్ ఇతర భాషల్లో బాగానే ఉన్నప్పటికీ హిందీ లో మాత్రం చాలా తక్కువ స్థాయి లో అడ్వాన్స్ బుకింగ్ నమోదు అవుతుండడం విశేషం. సాహో సినిమాకు కూడా బాహుబలి రేంజ్ లోనే అడ్వాన్స్ బుకింగ్స్ తో ప్రభాస్ సోలో గా కూడా మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్నట్లు అర్థమైంది. కానీ రాధే శ్యామ్ కు మాత్రం పరిస్థితులు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి.

పాజిటివ్ టాక్ వస్తేనే..

పాజిటివ్ టాక్ వస్తేనే..

రాధే శ్యామ్ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు అంతగా లేవని ఒక ఫైట్ సీన్ కూడా లేదు అని చిత్ర యూనిట్ సభ్యులు ముందుగానే క్లారిటీ ఇచ్చారు. సౌత్ ప్రేక్షకులను ఎక్కువగా కోరుకునేది యాక్షన్ ఫైట్ సన్నివేశాలు మాత్రమే. బహుశా ఆ ప్రభావం వల్ల అక్కడి ఆడియన్స్ ను సినిమాపై పెద్దగా ఆసక్తి చూపించలేదు అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. కేవలం పాజిటివ్ టాక్ వస్తేనే రాధే శ్యామ్ సినిమాకు మరుసటి రోజు నుంచి కలెక్షన్స్ ఎక్కువగా పొందే అవకాశం ఉంటుంది అని అనిపిస్తోంది.

హిందీ బిజినెస్ ఎంతంటే?

హిందీ బిజినెస్ ఎంతంటే?

హిందీలో రాధే శ్యామ్ సినిమా 50 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు సమాచారం. ఒక విధంగా ఇది చాలా తక్కువ టార్గెట్ అనే చెప్పాలి. ప్రభాస్ సాహో సినిమా వందకోట్ల కలెక్షన్స్ అందుకుంది. ఇక ఇటీవల వచ్చిన అల్లు అర్జున్ పుష్ప సినిమా కూడా అదే తరహాలో కలెక్షన్స్ అందుకుంది. ఇప్పుడు రాధే శ్యామ్ సినిమా యాభై కోట్ల టార్గెట్ ను సాధించడం పెద్ద కష్టమేమీ కాదు అని చెప్పవచ్చు. కానీ అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తుంటే సినిమా మొదటి రోజు మాత్రం అనుకున్నంతగా కలెక్షన్స్ రాబట్టకపోవచ్చు అనే టాక్ వస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X