Radhe shyam Pre Release Bussiness.. హిందీలో షాకింగ్ టార్గెట్.. ఏ భాషలో ఎంత రాబట్టాలి అంటే?

చాలా రోజుల తరువాత బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమాతో మరోసారి ప్రభాస్ బాక్సాఫీస్ వద్ద తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. ఇప్పటికే బాహుబలి, సాహో సినిమాలతో తన స్టామినా ఏమిటో చూపించిన డార్లింగ్ ఇప్పుడు ఒక విభిన్నమైన ప్రేమ కథగా తెరకెక్కిన రాధేశ్యామ్ సినిమాతో మరింత బలంగా తన మార్కెట్ ను పెంచుకోవాలని చూస్తున్నాడు. ఇక రాధే శ్యామ్ సినిమా ఈ శుక్రవారం భారీ స్థాయిలో విడుదల అవుతోంది. ఇక ఈ సినిమా ఏ భాషలో ఎంతకు అమ్ముడుపోయింది? బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కావాలి అంటే ఏ స్థాయిలో కలెక్షన్స్ రాబట్టాలి? వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

ప్రభాస్ కెరీర్ లోనే బిగ్ రిలీజ్

ప్రభాస్ కెరీర్ లోనే బిగ్ రిలీజ్

రెబల్ స్టార్ ప్రభాస్ ఎంతో ఇష్టంగా చేసిన రాధేశ్యామ్ సినిమా గత ఏడాది నుంచి అన్ని వర్గాల ప్రేక్షకులను కూడా ఎంతగానో ఊరిస్తోంది. ఈ సినిమా ఇప్పటికే మూడు సార్లు వాయిదా పడింది. ఇక ఫైనల్ గా మార్చు 11వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల అవుతోంది ఒక విధంగా ప్రభాస్ కెరీర్లోనే ఈ సినిమా అత్యధిక థియేటర్లలో విడుదల అవుతోంది.

ఏపీ తెలంగాణ.. ప్రీ రిలీజ్ బిజినెస్

ఏపీ తెలంగాణ.. ప్రీ రిలీజ్ బిజినెస్

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఏరియాల వారిగా జరిగిన బిజినెస్ ఈ విధంగా ఉంది. నైజం 36.5 కోట్లు, సీడెడ్ 18 కోట్లు, ఉత్తరాంధ్ర 13 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 8.83కోట్లు లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 7.5కోట్లు, గుంటూరులో రూ. 9.9 కోట్లు, కృష్ణాలో రూ. 7.5 కోట్లు, నెల్లూరులో రూ. 4కోట్లతో.. రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 105.2కోట్ల వరకు బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది.

మిగతా భాషల్లో..

మిగతా భాషల్లో..

తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా మిగతా రాష్ట్రాల్లో కూడా రాధేశ్యామ్ సినిమాపై లంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఇక సినిమా రేంజ్ ను బడ్జెట్ ను బట్టి మిగతా భాషల్లో మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే చేసింది. ఇక కర్ణాటకలో రూ. 12.5 కోట్ల వరకు ధర పలికిన ఈ సినిమా, తమిళనాడులో 6 కోట్లు, కేరళలో 2కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

హిందీలో 50కోట్లు..

హిందీలో 50కోట్లు..

ఇక బాలీవుడ్ లో ప్రభాస్ సినిమాపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. సాహో మిగతా భాషల్లో తేడా కొట్టేసినప్పటికీ హిందీలో మాత్రం బయ్యర్లకు పెట్టిన పెట్టుబడులకు మంచి లాభాలను అయితే అందించింది. కేవలం హిందీలోనే 50కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేయడం విశేషం. తప్పకుండా సినిమా ఆ టార్గెట్ ను ఈజీగా ఫినిష్ చేస్తుందని చెప్పవచ్చు.

ప్రపంచవ్యాప్తంగా.. టార్గెట్ ఎంతంటే?

ప్రపంచవ్యాప్తంగా.. టార్గెట్ ఎంతంటే?

ఇక రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఈసారి ప్రభాస్ 3కోట్ల టార్గెట్ తో వస్తున్నాడు. ఇక ఓవర్సీస్ లో 24 కోట్లకు అమ్ముడైన రాధేశ్యామ్ సినిమా ప్రపంచవ్యాప్తంగా 202.80కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ టార్గెట్ ను రాధేశ్యామ్ ఈజిగానే ఫినిష్ చేస్తుందని చెప్పవచ్చు. టోటల్ రూ.204 కోట్ల వరకు షేర్ అందుకుంటేనే ఈ సినిమా సక్సెస్ అయినట్లు లెక్క.

Recommended Video

Radhe Shyam : Prabhas Cults కి పండగ షురూ.. | Tollywood | Salaar | Filmibeat Telugu
అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమాలు

అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమాలు

ఇక ఇప్పటివరకు అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన టాలీవుడ్ సినిమాలలో రాధేశ్యామ్ టాప్ 3లో నిలిచింది. మొదట బాహుబలి 2 రూ.352 కోట్లు, సాహో రూ.270 కోట్లు, రాధే శ్యామ్ 202.8కోట్లు, సైరా నరసింహా రెడ్డి రూ.187.25 కోట్లు, పుష్ప 1 రూ.144.9 కోట్లు, స్పైడర్ రూ.124.8 కోట్లు, అజ్ఞాతవాసి రూ.124.6 కోట్లు, బాహుబలి 1 రూ.118 కోట్లు, భీమ్లా నాయక్ రూ.106.75 కోట్లు, మహర్షి రూ.100 కోట్లు, భరత్ అనే నేను రూ.100 కోట్లు,

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X