ప్రభాస్ సినిమా హక్కులను కొనుగోలు చేసిన తమిళ్ స్టార్ హీరో.. సాలీడ్ ప్రీ రిలీజ్ బిజినెస్?
రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమాల్లో రాధేశ్యామ్ ఒకటి. సరికొత్త లవ్ స్టోరీ అడ్వెంచరస్ మూవీ గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేయడం ఖాయమని ఇప్పటికే టీజర్ ట్రైలర్స్ తో ఒక క్లారిటీ వచ్చేసింది. యు.వి.క్రియేషన్స్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాను మార్చి 11వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు.
ఇక ఈ సినిమాను తమిళంలో ఒక స్టార్ హీరో భారీ ధరకు కొనుగోలు చేసి విడుదల చేస్తుండటం విశేషం. ప్రస్తుతం అందుకు సంబంధించిన విషయం సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారింది. ఒకసారి ఆ వివరాల్లోకి వెళితే....

ఓటీటీ ఆఫర్స్ వచ్చినా..
రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులను ఎంతో ఊరిస్తున్న రాధేశ్యామ్ సినిమా ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడింది. ఈ సినిమా రిలీజ్ విషయంలో చిత్ర యూనిట్ సభ్యులు తీసుకుంటున్న జాగ్రత్తలు అన్ని ఇన్ని కావు. ఓటీటీ లో విడుదల చేసేందుకు కొన్ని సంస్థలు భారీ ఆఫర్స్ కూడా ప్రకటించాయి. కానీ సినిమా థియేటర్లలోనే సినిమాను విడుదల చేయాలని యూవీ క్రియేషన్స్ సినిమాను వాయిదా వేసుకుంటూ వచ్చింది.

భారీ బడ్జెట్ తో..
మొదట ఈ సినిమాను 100కోట్ల బడ్జెట్ లోనే పూర్తి చేయాలని అనుకున్నారు. కానీ ఆ తర్వాత ప్రభాస్ స్థాయిని దృష్టిలో ఉంచుకొని మళ్లీ బడ్జెట్ పెంచారు. దాదాపు 250 కోట్లకు పైగా భారీ బడ్జెట్తో నిర్మించినట్లుగా సమాచారం. జిల్ దర్శకుడు రాధాకృష్ణ ఈ సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే.

ఆ పాయింట్ తోనే అసలు కథ..
ఇక ఈ సినిమాకు సంబంధించిన అనేక రకాల రూమర్స్ నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమాలో పూజా హెగ్డే పాత్ర చనిపోతుంది అని ఆ తర్వాత కాలంతో పోటీ పడుతూ హీరో తన ప్రేమను ఎలా గెలిచాడు అనేది అసలు కథ అని సోషల్ మీడియాలో ఒక టాక్ వైరల్ గా మారుతుంది. ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయట.
సముద్రంలో ఒక అలజడి మధ్యలో హీరో చేసే పోరాట విన్యాసాలు కూడా చాలా హైలెట్గా ఉంటాయని తెలుస్తోంది.

రాధేశ్యామ్ ను విడుదల చేస్తున్న తమిళ హీరో
ఇక ప్రస్తుతం ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి ఈ సినిమాను తమిళంలో ఒక స్టార్ హీరో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. అతను మరెవరో కాదు. తమిళనాడు ముఖ్యమంత్రి తనయుడు ఉదయనిది స్టాలిన్ అని తెలుస్తోంది.
అతను హీరోగానే కాకుండా ప్రస్తుతం తమిళ రాజకీయాల్లో కూడా కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఉదయనిది స్టాలిన్ రాధే శ్యామ్ సినిమాను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. రెడ్ గెంట్ మూవీస్ సంస్థలో తమిళంలో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు.
Recommended Video

భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్
తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో విజయాన్ని అందుకుంటుంది అని చిత్ర యూనిట్ సభ్యులు కూడా ఎంతగానో నమ్ముతున్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా రాధేశ్యామ్ సినిమా 400 కోట్లకు పైగానే ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా మొదటిరోజు ఈజీగా 100 కోట్లను అందుకుంటుంది అని అనుకుంటున్నారు.
అయితే ప్రస్తుత పరిస్థితుల్లో సినిమా థియేటర్లు చాలా నష్టాలతో కొనసాగుతున్నాయి. ఈ కరోనా కష్టకాలంలో జనాలను థియేటర్లోకి రప్పించడం కూడా చాలా కష్టమనే చెప్పాలి. మరి మార్చి 11వ తేదిన భారీ స్థాయిలో విడుదల కాబోతున్న సినిమా ఏ భాషలో ఏ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











