మరో రికార్డుపై కన్నేసిన ప్రభాస్.. రాధేశ్యామ్ తొలి రోజు ఎంత వసూలు చేస్తుందంటే..

రాజమౌళి తెరకెక్కించిన ప్రతిష్టాత్మక సినిమాలు బాహుబలి, బాహుబలి 2 ల భారీ సక్సెస్ లతో పాన్ ఇండియా స్టార్ గా ప్రపంచవ్యాప్తంగా నటుడిగా గొప్ప పేరు, పాపులారిటీ తో పాటు హీరోగా భారీ స్థాయి మార్కెట్ ని అందుకున్నారు ప్రభాస్. వాటి అనంతరం ఆయన నటించిన సాహో మూవీ ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోనప్పటికీ అటు నార్త్ లో మాత్రం కలెక్షన్స్ దుమ్ము దులిపింది. శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటించిన సాహో సినిమా అప్పట్లో బిజినెస్ పరంగా అదరగొట్టింది.

Recommended Video

Radhe Shyam : Prabhas Cults కి పండగ షురూ.. | Tollywood | Salaar | Filmibeat Telugu
నాలుగు సినిమాలతో..

నాలుగు సినిమాలతో..

ఇక లేటెస్ట్ గా ప్రభాస్ మొత్తం నాలుగు సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. వాటిలో ప్రశాంత్ నీల్ తో చేస్తున్న సలార్ భారీ మాస్ యాక్షన్ మూవీగా రూపొందుతోంది. ఇక నాగ అశ్విన్ తో ఆయన చేస్తున్న ప్రాజక్ట్ కె మూవీ సైన్స్ ఫిక్షన్ జానర్ లో రూపొందుతుండగా, బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తో ప్రభాస్ చేస్తున్న సినిమా ఆదిపురుష్, మైథలాజికల్ మూవీగా మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో తెరకెక్కుతోంది. అయితే ఈ మూడు సినిమాలు ప్రస్తుతం సెట్స్ మీద వున్నాయి. కాగా సాహో రిలీజ్ తరువాత వెంటనే జిల్ మూవీ ఫేమ్ రాధాకృష్ణతో రాధేశ్యామ్ మూవీ మొదలెట్టి ఇటీవల పూర్తి చేసారు ప్రభాస్.

అనుకోకుండా వాయిదా

అనుకోకుండా వాయిదా

పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని యువి క్రియేషన్స్ బ్యానర్ పై ప్రమోద్, వంశీ ఎంతో భారీ వ్యయంతో నిర్మించారు. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన రాధేశ్యామ్ నుండి రిలీజ్ అయిన సాంగ్స్, ట్రైలర్ కొన్నాళ్ల క్రితం యూట్యూబ్ లో రిలీజ్ అయి అందరినీ ఆకట్టుకున్నాయి. నిజానికి మొన్న జనవరిలో సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ కావాల్సిన రాధేశ్యామ్ మూవీ, కరోనా పరిస్థితుల కారణంగా కొన్నాళ్ల పాటు వాయిదా పడింది.

భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్

భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్

ఇక ఈ సినిమా సౌత్ వర్షన్లకి జస్టిన్ ప్రభాకరన్, హిందీ వర్షన్ కి మన్నన్ మిథూన్ సంగీతం అందించారు. ఒకప్పటి బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ ప్రేమపావురాలు హీరోయిన్ భాగ్యశ్రీ రాధేశ్యామ్ లో ప్రభాస్ కి తల్లిగా యాక్ట్ చేస్తున్నట్లు సమాచారం. ఇక రాధేశ్యామ్ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరిగినట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్. దాదాపు 500కోట్ల బిజినెస్ చేసే అవకాశం ఉన్నట్లు తతెలుస్తోంది.

నాన్ థియేట్రికల్ బిజినెస్

నాన్ థియేట్రికల్ బిజినెస్

ఇటీవల ఈ మూవీ నాన్ థియేట్రికల్ (ఓటిటి రైట్స్) ని జీ 5 వారు ఏకంగా రూ. 250 కోట్లకు కొనుగోలు చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇక సినిమా విషయానికి వస్తే మంచి రొమాంటిక్ లవ్ ఎమోషనల్ యాక్షన్ మూవీగా తెరకెక్కిన రాధేశ్యామ్ మూవీలో ప్రియదర్శి, సీనియర్ నటుడు కృష్ణంరాజు, మురళీశర్మ, జయరాం, షాషా ఛత్రి వంటి నటులు ఇతర పాత్రలు చేసారు. యూరోప్ బ్యాక్ డ్రాప్ లో 1970ల కాలం నాటి కథగా తెరకెక్కిన రాధేశ్యామ్ కి బడ్జెట్ కూడా భారీగానే ఖర్చుచేసినట్లు టాక్. రాధేశ్యామ్ మూవీని మార్చి 11న రిలీజ్ చేస్తున్నట్లు ఇటీవల అధికారికంగా ప్రకటించారు యూనిట్ సభ్యులు.

పదివేల థియేటర్స్ లో

పదివేల థియేటర్స్ లో

కాగా ఈ మూవీని ఏకంగా 10000 కి పైగా థియేటర్స్ లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు యూనిట్ పక్కాగా ప్లాన్స్ సిద్ధం చేస్తోందని, ఇప్పటికే పలు ఏరియాల్లో థియేటర్స్ బుకింగ్ పూర్తి అయిందని, తొలిరోజు అనేక ప్రాంతాల్లో వీలైనన్ని ఎక్కువ థియేటర్స్ లో షోలు వేసేందుకు నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్స్, బయ్యర్స్ తో మాట్లాడుతున్నారని అంటున్నారు.

 తొలిరోజు వసూళ్లు ఎంతంటే?

తొలిరోజు వసూళ్లు ఎంతంటే?


అలానే ఈ మూవీ తొలి రోజు కలెక్షన్ ఖచ్చితంగా రూ. 100 కోట్లు మార్క్ అందుకోవడం ఖాయం అని, ప్రస్తుతం ప్రభాస్ కు ఉన్న క్రేజ్ ని బట్టి చూస్తే అది ఆయనకి కేక్ వాక్ వంటిందని అంటున్నారు సినీ విశ్లేషకులు. ఆ విధంగా అందరిలో ఎన్నో భారీ అంచనాలు ఏర్పరిచిన రాధేశ్యామ్, వచ్చే నెలలో రిలీజ్ తరువాత ఎంత మేర సక్సెస్ అందుకుని ఫ్యాన్స్ కి కిక్ ఇస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X